republic day celebrations 2023
-
గవర్నర్‌పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాటల దాడి మరింత పెరిగింది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గవర్నర్‌పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. కాగా, కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై కాషాయ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, ఎమ్మెల్సీపై సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గవర్నర్ తమిళిసైపై వ్యాఖ్యలకు గానూ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కార్పొరేటర్ శ్రీవాణి కోరారు. ఇక, రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గవర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్లో పాస్ చెసిన బిల్లుల ఫైళ్లను గవర్నర్ ఎందుకు దాచుకున్నారంటూ అనుచిత పదజాలాన్ని ఎమ్మెల్సీ ఉపయోగించారు. ఇది రాజ్యాంగమా అంటూ నిలదీశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నిలదీస్తూ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హైకోర్టు తీర్పులను తెలుగులోకి అనువదిస్తాం
సాక్షి, అమరావతి: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ చేపడుతున్న సంస్కరణలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర హైకోర్టు ఇచ్చే తీర్పులను తెలుగులోకి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా చెప్పారు. న్యాయవ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా అత్యంత కీలకమైన రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కేసులను వర్గీకరించడం, ఒకే తరహా కేసులను గుర్తించడం, తాజాగా దాఖలైన వ్యాజ్యాల వంటివి గతంలో దాఖలై ఉంటే అందులో కోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తించడం వంటి వాటికోసం ఏఐను వాడుకుంటామని చెప్పారు. దీనివల్ల విచారణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని, కక్షిదారులకు సత్వర న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత అందరి భాగస్వామ్యంతో ఏపీ హైకోర్టును మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హైకోర్టులో గురువారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ మిశ్రా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల హక్కులను పరిరక్షించడంలో భారత న్యాయవ్యవస్థ ముందువరుసలో ఉందన్నారు. సత్వర న్యాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ అసెంబ్లీ సభ్యులైన తన తాతకు సహాయకుడిగా సమరయోధులతో జరిగే ఇష్టాగోష్టులకు వెళ్లే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. అప్పుడే రాజ్యాంగం గొప్పతనం అర్థమైందన్నారు. హైకోర్టు, దిగువ కోర్టుల్లో ఖాళీలు భర్తీచేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామన్నారు. రాబోయే మూడునెలల్లో హైకోర్టులో 14 కోర్టు హాళ్లు అందుబాటులోకి రానున్నాయని, కొత్తగా నిర్మిస్తున్న భవనంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, లక్ష పుస్తకాలతో పాటు విదేశీ జర్నల్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు ప్రసంగించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి సతీమణులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
వాడవాడలా జాతీయ పతాక రెపరెపలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గురువారం గణతంత్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకం రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేడ్కర్, ఇతర స్వాతంత్య్ర పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సేవల్ని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో ప్రగతి గురించి వివరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. శాసనమండలి వద్ద జరిగిన వేడుకల్లో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ భవనం ముందు శాసనసభాపతి తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, ఉప కార్యదర్శులు రాజకుమార్, జయరాజు, జగన్మోహన్రావు, చీఫ్ మార్షల్ పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం సెక్రటరీ కె.ధనుంజయరెడ్డి, అదనపు సెక్రటరీ డాక్టర్ నారాయణభరత్ గుప్తా, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు. మంగళగిరిలోని ఆక్టోపస్ విభాగం ప్రధాన కార్యాలయంలో ఆక్టోపస్ ఎస్పీ బల్లి రవిచంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆక్టోపస్ అదనపు ఎస్పీ కె.రామచంద్రమూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బస్ భవన్లో.. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో సంస్థ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు కార్గో సేవలను మరింతగా విస్తరించాలన్నారు. ఆర్టీసీ ఈడీలు కోటేశ్వరరావు, కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, పి.కృష్ణమోహన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలోని ఏపీ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ ఎండీ జి.లక్ష్మీషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. 26 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. జేఎండీ ఎం. శివప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాల జేఎండీలు వికాస్, భావన పాల్గొన్నారు. విజయవాడలోని టిడ్కో కార్యాలయంలో సంస్థ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంస్థ ఎండీ శ్రీధర్, సీఈ గోపాలకృష్ణారెడ్డి, డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ పొల్గొన్నారు. 57 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో సంస్థ కమిషనర్ వివేక్‌యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంస్థ అదనపు కమిషనర్ షేక్ అలీ బాషా, జాయింట్ డైరెక్టర్ (ఓఎం) టి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి : సీఎస్ సాక్షి, అమరావతి: అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని, అవి ప్రజలందరికీ అందేలా ప్రభుత్వ ఉద్యోగులు కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ జవహర్‌రెడ్డి చెప్పారు. ఇందుకుగాను ప్రతి ఉద్యోగి మరింత చిత్తశుద్ధి, అకింతభావంతో పనిచేయాలని కోరారు. రాష్ట్ర సచివాలయం వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి కె.కృష్ణమూర్తి, సాధారణ పరిపాలనశాఖ ఉప కార్యదర్శులు రామసుబ్బయ్య, శ్రీనివాస్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. భారతదేశానికి ఆత్మలాంటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ సజిల, వైఎస్సార్సీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కిరణ్, పార్టీ నేతలు మేరాజోత్ హనుమంత్‌నాయక్, పడమట సురేష్‌బాబు, ఎ.నారాయణమూర్తి, పోచంరెడ్డి సుదర్శన్‌రెడ్డి, మందపాటి శేషగిరిరావు, కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కర్తవ్యపథ్‌లో అబ్బురపరిచిన కోనసీమ ‘ప్రభ’
సాక్షి , అమలాపురం: రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో ఏపీలోని కోనసీమ ప్రాంతంలోని ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. కనుమ పండుగ రోజు జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థంను శకటంగా రూపొందించారు. వేడుకల్లో మొత్తం 17 రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించగా..అందులో ఏపీ నుంచి ప్రభలతీర్థం ఒకటి కావడం విశేషం. ఈ పరేడ్‌లో పాల్గొన్న వారు ‘సాక్షి’తో తమ భావాలను ఇలా పంచుకున్నారు. ఈ సారి ప్రత్యేకం గతంలో నాలుగుసార్లు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నాను. కాని ఈసారి ప్రత్యేకం. మన ప్రాంతానికి చెందిన ప్రభ శకటం కూడా వెళ్లడం చాలా సంబరంగా అనిపించింది. మన ప్రభను అందరూ ప్రత్యేకంగా తిలకించారు. కొంతమంది భక్తితో నమస్కరించారు. ఇది మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు. – చింతా వీరాంజనేయులు జన్మ ధన్యమైంది నాద బృందంలో ఇప్పటివరకు మా నాన్న పసులేటి నాగబాబు 15 సార్లు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నారు. నేను పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ అవకాశం ఎప్పుడు దక్కుతుందా అని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, ప్రతిభాపాటిల్, ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మేము ప్రదర్శనలు చేసినా కవాతులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఏకాదశ రుద్రులతో ఉన్న ఏపీ శకటాన్ని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. విదేశీ ప్రముఖులు పక్కవారిని వివరాలు అడుగుతూ కనిపించారు. 10.51కి శకటం ప్రయాణం ప్రారంభం కాగా, కవాతు ముగిసి ఎర్రకోటకు చేరే సరికి 01.15 అయ్యింది. – పసుపులేటి కుమార్, ముక్కామల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
మానవ సహిత గగన్‌యాన్.. ఎల్వీఎం–3 ద్వారా రోదసిలోకి మనుషులు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ వెల్లడించారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో గురువారం గణతంత్ర వేడుకల అనంతరం భాస్కర్ అతిథి భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గగన్‌యాన్‌కు సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా భూస్థిర పరీక్షలు నిర్వహించామని చెప్పారు. దీనికి సంబంధించి 2022లో తొమ్మిది రకాల సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్‌లు నిర్వహించామన్నారు. మరో 30 రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ ఏడాది ఆఖరు నాటికి క్రూ మాడ్యూల్తో ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ముందు రెండుసార్లుగా మానవ రహిత ప్రయోగాలను నిర్వహించాక 2024 ఆఖరు నాటికి ఎల్వీఎం–3 భారీ రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు ఇస్రోలో అన్ని సెంటర్లు దీనిపై దృష్టిసారించి పనిచేస్తున్నాయన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకుని దీనికోసం ఇస్రోలో ప్రతిఒక్కరు కృషిచేస్తున్నారని రాజరాజన్ చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో గగన్‌యాన్ ప్రయోగంలో మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 2023లో 11 ప్రయోగాలు లక్ష్యం ఇక ఈ ఏడాది 11 ప్రయోగాలు లక్ష్యంగా ఇప్పటినుంచే పనిచేస్తున్నామని రాజరాజన్ తెలిపారు. ఇందులో ఈ ఏడాది పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఐదు రాకెట్లు, ఎల్వీఎం–3లో రెండు, జీఎస్ఎల్వీ సిరీస్‌లో రెండు, ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో రెండు ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలియజేశారు. ఇందులో ఫిబ్రవరి మూడో వారంలో ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) డీ2 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం ఐదు పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నామన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ల ద్వారా వన్‌వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను, చంద్రయాన్–3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజరాజన్ చెప్పారు. అలాగే, జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా నావిగేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని కూడా తెలిపారు. మరోవైపు.. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పీఐఎఫ్) భవనం నిర్మాణం పూర్తిచేసి విజయవంతంగా ట్రయల్ రన్‌ను నిర్వహించామని.. రెండో ప్రయోగ వేదికకు సంబంధించి సెకండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ55 ఇంటిగ్రేషన్‌తో సెకండ్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మొత్తం మీద షార్‌లోని అన్ని సదుపాయాలను ఉపయోగించి ఈ ఏడాది 11 ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తద్వారా ఈ ఏడాది కూడా స్పేస్ రీఫార్మ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చునని ఆయన తెలిపారు. చివరగా.. ప్రైవేట్ ప్రయోగాల విషయంలో ఎవరైనా స్టార్టప్ కంపెనీలతో వస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. -
ఏపీ ప్రగతి దేశానికి ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు 73 ఏళ్ల రాజ్యాంగ సారాన్ని మూడున్నరేళ్లలో ప్రభుత్వం అందించిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి పథంలో నిలిపిందని, మనం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. మన ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని 43 నెలల్లోనే సాకారం చేశామన్నారు. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ అందుకు దోహదం చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.1.82 లక్షల కోట్లు అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు చేరాయన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న గవర్నర్ వ్యవసాయంలో ముందడుగు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 29.77 లక్షల మంది రైతుల నుంచి 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.54,140 కోట్లు చెల్లించింది. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు కూడా మేలు చేస్తోంది. మూడున్నరేళ్లలో 52.38 లక్షల మంది రైతులకు రూ.25,971 కోట్లు అందచేసింది. దేశంలో సార్వత్రిక పంటల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గుర్తించిన అన్ని పంటలకు రైతుల తరపున ప్రీమియం వాటాను ప్రభుత్వమే చెల్లించింది. ఇప్పటివరకు రూ.6,684 కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల ద్వారా రూ.1,442.66 కోట్ల వడ్డీ రాయితీని నేరుగా 73.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. విజయవాడలో జాతీయజెండాకు సెల్యూట్ చేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గ్రామీణ పేదరిక నిర్మూలన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి నెలకు రూ.2,750 చొప్పున చెల్లిస్తోంది. ప్రతినెలా రూ.1,765 కోట్లను 64.06 లక్షల మంది లబ్ధిదారులకు ఒకటో తేదీన ఇంటివద్దే అందజేస్తోంది. మూడున్నరేళ్లలో పింఛన్ల కోసం రూ.63,303 కోట్లు ఖర్చు చేసింది. చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారి కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయం సహాయక సంఘాలకు రూ.25,517 కోట్లను చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించింది. వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళల జీవనోపాధి కోసం రూ.18,750 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలకు చెందిన 3,56,143 మంది మహిళలకు రూ.1,518 కోట్లను అందించింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3,93,537 మందికి రూ.590 కోట్ల మొత్తాన్ని నేరుగా పంపిణీ చేసింది. రూ.40 కోట్ల వ్యయంతో 17.44 లక్షల ఎస్సీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. రాజ్యాంగ నిర్మాతకు నివాళిగా విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో రూ.268 కోట్ల అంచనా వ్యయంతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. గ్రామ స్వరాజ్యం, పారదర్శక సేవలు లక్ష్యంగా ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థతో 2.65 లక్షల మంది వలంటీర్లు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ద్వారా ఇప్పటివరకు రూ.33,544 కోట్లతో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా 2.3 లక్షల గృహాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు రూ.34 వేల కోట్లతో వైఎస్సార్ జగనన్న లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పథకాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని అన్ని ఇళ్లను సందర్శించేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. గవర్నర్‌తో ఆప్యాయంగా సీఎం వైఎస్ జగన్ పరిశ్రమలు – వాణిజ్యం రాష్ట్రంలో 2019 జూన్ నుంచి 2022 డిసెంబర్ 31 వరకు పెట్టుబడుల ప్రవాహం బలంగా ఉంది. రూ.54,236 కోట్ల పెట్టుబడితో 109 పెద్ద పరిశ్రమలను స్థాపించారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.72,608 కోట్లతో 1,45,496 యూనిట్లు వచ్చాయి. వీటిద్వారా 11,19,944 మందికి ఉపాధి లభిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ ‘టాప్ అచీవర్’గా ఎంపికైంది. జూన్ 2022లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తలసరి ఆదాయం రూ.1,70,215కి పెరిగింది. మత్స్యకారుల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో 9 ఫిషింగ్ హార్బర్లు, మూడు ఓడరేవులను అభివృద్ధి చేస్తోంది. ఉపాధిలో మిన్న.. ఉపాధిహామీలో భాగంగా 1,871 లక్షల పనిదినాలను కల్పించి ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో ఉంది. రోడ్లు భవనాల శాఖ 5,181 కి.మీ పొడవైన వివిధ రహదారుల అభివృద్ధి పనులను రూ.2173 కోట్లతో చేపడుతోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఏడాది కాలంలో 992 కి.మీ. బీటీ రోడ్లు వేశారు. జీవనాడికి ప్రాధాన్యం.. ఏపీకి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల ఆయకట్టు స్థిరీకరణ పనులు పూర్తయ్యాయి. రూ.15,448 కోట్లతో బాబు జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. పటిష్టంగా శాంతి భద్రతలు.. రాష్ట్ర పోలీసుల సమర్థతతో 2022లో నేరాలు గణనీయంగా తగ్గాయి. వినూత్న పోలీసింగ్ చర్యల ద్వారా ఇది సాధ్యమైంది. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం దిశ యాప్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 1.11 కోట్ల మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. శాంతి భద్రతలను సమర్థంగా పరిరక్షించేందుకు 14 కొత్త పోలీసు సబ్ డివిజన్లు, 19 కొత్త సర్కిళ్లు, రెండు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు 21 స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసింది. వికేంద్రీకరణతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరింది. కొత్తగా ఏర్పాటైన వాటితో రెవెన్యూ డివిజన్లు 76కి పెరిగాయి. వందేళ్ల తరువాత భూముల సర్వే దేశంలో 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టిన తొలి రాష్ట్రం మనదే. 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 85 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో విస్తరించిన 17,584 గ్రామాల్లో రీసర్వే ప్రాజెక్టు కొనసాగనుంది. కనువిందుగా కవాతు గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. బెస్ట్ ఆర్డ్మ్ కంటింజెంట్‌గా ఇండియన్ ఆర్మీ నిలవగా, ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్ రెండో స్థానంలో నిలిచింది. నాన్ ఆర్డ్మ్ కంటింజెంట్ విభాగంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్) తొలి రెండు స్థానాలు సాధించాయి. ఈ ఏడాది నుంచి కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ పరేడ్‌లో పాల్గొన్న ఒడిశా స్టేట్ పోలీస్ విభాగానికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న శకటాలు గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన 13 శకటాలు రాష్ట్ర ప్రగతి, సంక్షేమానికి నిదర్శనంగా నిలిచాయి. గృహ నిర్మాణ శాఖ శకటం ప్రథమ బహుమతిని కైవశం చేసుకోగా పాఠశాల విద్యాశాఖ (డిజిటల్ విద్యాబోధన) శకటం రెండో స్థానంలో నిలిచింది. ఊరూరా అభివృద్ధి– ఇంటింటా సమృద్ధి నేపథ్యంతో రూపుదిద్దుకున్న గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శకటం మూడో స్థానం దక్కించుకుంది. మొదటి, మూడో ఉత్తమ శకటాలకు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి గవర్నర్ చేతుల మీదుగా బహుమతులను అందుకోగా రెండో ఉత్తమ శకటానికి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులతో కలసి స్వీకరించారు. చదువులకు చేయూత పేదరికం కారణంగా చదువులు ఆగిపోరాదని అమ్మ ఒడితోప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఇప్పటి దాకా రూ.19,617 కోట్లను నేరుగా 44.49 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేసింది. 84 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతోంది. మన బడి – నాడు నేడు ద్వారా 45,484 ప్రభుత్వ పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 151 డిగ్రీ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 55,607 అంగన్వాడీల్లో రూ.17,835 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పించింది. జగనన్న గోరుముద్ద కోసం ఇప్పటిదాకా రూ.3,239 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు రూ.2,368 కోట్లు వెచ్చించింది. జగనన్న విద్యా దీవెన కింద మొత్తం ఫీజులను రీయింబర్స్ చేస్తూ ఇప్పటివరకు 24,74,544 మంది విద్యార్థులకు రూ.9,051 కోట్లు చెల్లించింది. డిజిటల్ లెర్నింగ్ ఆవశ్యకతను గుర్తించి 4,59,564 మంది 8వ తరగతి విద్యార్థులకు రూ.778 కోట్ల విలువైన ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్‌తో పాటు రూ.688 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం – కుటుంబ సంక్షేమం రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆసుపత్రులు, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్, ఇతర స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా సేవలందిస్తోంది. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా కొత్తగా 88 ఆస్పత్రులను మంజూరు చేసింది. నాడు – నేడుతోపాటు కొత్త వైద్య కాలేజీల కోసం రూ.16,823 కోట్లు వ్యయం చేస్తోంది. వచ్చే రెండేళ్లల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 28కి పెరగనుంది. 16 హెల్త్ హబ్స్ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించనుంది. వైద్య శాఖలో ఖాళీలు లేకుండా 48,639 పోస్టులను భర్తీ చేసింది. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటిన అన్ని సేవలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 95 శాతం మంది పథకం పరిధిలో ఉన్నారు. 104, 108 సేవలను పునరుద్ధరించి 1,444 వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డాక్టర్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. -
గవర్నర్ తమిళిసైకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్
సాక్షి, వరంగల్: తెలంగాణలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఈ ఏడాది కూడా సీఎం కేసీఆర్, మంత్రులు డుమ్మా కొట్టారు. దీంతో, కేసీఆర్ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి గవర్నర్‌కు కనిపించడం లేదా?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి జరిగిందా?. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా తమిళిసై వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గవర్నర్‌ను చూడలేదు. అంతపెద్ద సెక్రటేరియేట్ నిర్మాణం జరిగితే కనిపించడం లేదా.. అది అభివృద్ధి కాదా?. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ మంచి నీళ్లు ఇస్తున్నాము. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతోంది. రైతు సంక్షేమ తెలంగాణలో గవర్నర్‌కు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసైసౌందరరాజన్, ప్రభుత్వం మధ్య విమర్శలపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాటల దాడి మరింతగా పెరిగింది. గవర్నర్ తమిళిసై అటు పుదుచ్చేరిలో కూడా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పుదుచ్చేరిలో కూడా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. 5 లక్షల మందితో సీఎం కేసీఆర్ బహిరంగ సభ పెట్టారు. కానీ, రిపబ్లిక్ డే వేడుకలకు మాత్రం కరోనాను సాకుగా చూపించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. కేంద్రానికి నేను ఇవ్వాల్సిన రిపోర్టు పంపించాను. తెలంగాణలో అన్నీ అతిక్రమణలే. రాజ్యాంగ, రాజకీయ, చట్టపరమైన అతిక్రమణలు ఉన్నాయి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు తెలంగాణలో రాజ్‌భవన్ వేడుకల్లో పాల్గొన్న తమిళిసై కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి’ అంటూ ఆమె కామెంట్స్ చేశారు. -
ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు (ఫొటోలు)
-
తెలంగాణ గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, గణతంత్ర వేడుకల నేపథ్యంలో మాటల దాడి మరింత పెరిగింది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడారు. గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి లేఖ రాస్తాము. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలి. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదు అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత సైతం గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా.. ‘కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టిపెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రగతి భవన్లో గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
-
రిపబ్లిక్ డే వేడుకలు.. హాజరైన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. వేడుకల్లో గవర్నర్ ప్రసంగిస్తూ ఏపీలో ప్రభుత్వ పథకాలు భేష్ అని ప్రశంసించారు. డీబీటీ ద్వారా నవరత్నాలు, అమ్మ ఒడి పథకాలు అర్హులందరికీ అందుతున్నాయన్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని గవర్నర్ అన్నారు. ‘‘జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు, దుస్తులు, స్కూల్ కిట్ అందిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సీబీఎస్ఈ సిలబస్ అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.’’ అని బిశ్వభూషణ్ అన్నారు. ‘‘వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా రూ.2750 సాయం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి. త్వరలో సంచార పశువైద్య క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నాం. గర్భిణులు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నాం’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ‘‘కుల,మత, ప్రాంతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఇంటికీ వెళ్తున్నారు.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది’’ అని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఢిల్లీలో ఘనంగా 74వ రిపబ్లిక్ డే.. అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రత్యేక అతిథి, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా పాల్గొన్నారు. సైనికులు కవాతు నిర్వహించి వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం 21 గన్‌సెల్యూట్‌తో త్రివర్ణపతాక ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకల్లో ప్రదర్శించిన 23 శకటాలు దేశంలో భిన్న సంస్కృతిని ప్రతిబింబించాయి. 17 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించారు. ఈ ఈజిప్టు సైనికులు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశనలుమూల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సైనికుల సాహసాలు అబ్బురపరిచాయి. ఆత్మనిర్బర్ భారత్.. ఆత్మనిర్బర్ భారత్ ప్రతిబించేలా ఈసారి వేడుకల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలనే ప్రదర్శించారు. 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ తుపాకులు, ఇటీవలే సైన్యంలో చేరిన ఎల్సీహెచ్ ప్రచండ్, కే-9 వజ్ర హోవిట్జర్, ఎంబీటీ అర్జున్, నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్‌ను ప్రదర్శించారు. పరేడ్ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించడంతో గణతంత్ర వేడుకలు ముగిశాయి. 11:20 AM అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన.. కర్తవ్యపథల్ గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతింబింబించేలా ఉన్న ఈ శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. అలాగే గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. The tableau of Andhra Pradesh depicts 'Prabhala Theertham'- a festival of the peasantry during Makara Sankranti, at the Republic Day parade pic.twitter.com/YXPdmuUFET — ANI (@ANI) January 26, 2023 10:30 AM పరేడ్‌లో రాష్ట్రపతి, ప్రధాని.. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేడుకలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా గణతంత్ర పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. 21-గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ గణతంత్ర పరేడ్‌లో ఈజిప్టు సైన్యం కూడా పాల్గొంది. Delhi | President Droupadi Murmu leads the nation in celebrating Republic Day Egypt’s President Abdel Fattah al-Sisi attends the ceremonial event as the chief guest Simultaneously, National Anthem and 21-gun salute presented pic.twitter.com/hi3joxFs57 — ANI (@ANI) January 26, 2023 10:20 AM పరేడ్‌కు రాష్ట్రపతి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాతో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్‌కు బయల్దేరారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అక్కడ ఘనంగా నిర్వహించే 74వ గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. Delhi | President Droupadi Murmu and Egyptian President Abdel Fattah El –Sisi depart from the Rashtrapati Bhavan to attend the Republic Day celebrations at Kartavya Path pic.twitter.com/tvhgjnwsC7 — ANI (@ANI) January 26, 2023 10:10 AM అమరులకు మోదీ నివాళులు.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులను స్మరించుకున్నారు. అనతరం కర్తవ్య పథలో గణతంత్ర పరేడ్‌కు హాజరవుతారు. #RepublicDay | PM Modi leads the nation in paying homage to the fallen soldiers at the National War Memorial in Delhi pic.twitter.com/CE9B2CPZmB — ANI (@ANI) January 26, 2023 న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో నిర్వహించే గణతంత్ర పరేడ్‌కు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో పరేడ్ ప్రారంభం కానుంది. మొదట జాతీయ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ హాజరవుతున్నారు. ఈజిప్టు సైన్యం కూడా కవాతులో పాల్గొంటుంది. ఈ సారి నిర్వహించే పరేడ్ ప్రత్యేకంగా ఉండనుంది. సైనిక శక్తిసామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించనున్నారు. వారం రోజుల పాటు జరుగుతున్న గణతంత్ర వేడుకలు జనవరి 23న నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రారంభమయ్యాయి. జనవరి 24, 25 తేదీల్లో 'ఆది శౌర్య- పర్వ్ పరాక్రమ్ కా' ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఢిల్లీలో నిర్వహించారు. -
రిపబ్లిక్ డే 2023: మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల ఫొటోలు
-
తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. సికింద్రాబాద్ సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఆమె నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. వేడుకల్లో సీఎస్ శాంతకుమారి, డీజీపీ అంజనీకుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్.. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు. సమ్మక్క, సారలమ్మ, కొమురం భీంలను సర్మించుకున్నారు. ‘‘ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే జాతి నిర్మాణం’’ అని తమిళిసై అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్రధానికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. -
Indian Republic Day 2023: చర్చలకు చక్కని వేదిక
న్యూఢిల్లీ: పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పు వంటి కీలక అంశాలపై చర్చకు, వాటి పరిష్కారానికి జీ20 సదస్సు సరైన వేదిక అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే... ► దశాబ్దాలుగా పలు పథకాల ద్వారా భారత దేశం సాధించిన సర్వతోముఖాభివృద్ధి, పౌరుల సృజనాత్మక ఆవిష్కరణల ఫలితంగా నేడు ప్రపంచం భారత్‌కు సమున్నత గౌరవం ఇస్తోంది. ► పలు దేశాల కూటములు, ప్రపంచ వేదికలపై మన జోక్యం తర్వాత దేశం పట్ల సానుకూలత పెరిగింది. ఫలితంగా దేశానికి అపార అవకాశాలు, నూతన బాధ్యతలు దక్కాయి. ► ఈ ఏడాదికి జీ20 కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా మెరుగైన ప్రపంచం, భవ్య భవిష్యత్తుకు బాటలు పరిచేందుకు భారత్‌కు సువర్ణావకాశం దొరికింది. భారత నాయకత్వంలో ప్రపంచం మరింత సుస్థిరాభివృద్ధి సాధించగలదని గట్టిగా నమ్ముతున్నా. ► ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ20 దేశాల్లోనే ఉంది. ప్రపంచ జీడీపీకి 85 శాతం ఈ దేశాలే సమకూరుస్తున్నాయి. భూతాపం, పర్యావరణ పెను మార్పులుసహా పుడమి ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలకు, పరిష్కారానికి జీ20 చక్కని వేదిక. ► దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడాల్సిన తరుణమొచ్చింది. సౌర, ఎలక్ట్రిక్ విద్యుత్ సంబంధ విధాన నిర్ణయాలు అమలుచేస్తూ ఈ దిశగా వివిధ దేశాలకు భారత్ నాయకత్వ లక్షణాలను కనబరుస్తోంది. ఈ క్రమంలో సాంకేతికత బదిలీ, ఆర్థిక దన్నుతో సంపన్న దేశాలు ఆపన్న హస్తం అందించాలి. ► వివక్షాపూరిత పారిశ్రామికీకరణ విపత్తులను తెస్తుందని గాంధీజీ ఏనాడో చెప్పారు. సాంప్రదాయక జీవన విధానాల్లోని శాస్త్రీయతను అర్థంచేసుకుని పర్యావరణ అనుకూల అభివృద్దిని సాధించాలి. ► రాజ్యాంగ నిర్మాతలు చూపిన మార్గనిర్దేశక పథంలోని మనం బాధ్యతాయుతంగా నడవాలి. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన డాక్టర్ అంబేడ్కర్‌కు మనం సదా రుణపడి ఉండాలి. ఆ కమిటీలో 15 మంది మహిళలుసహా అన్ని మతాలు, వర్గాల వారికీ ప్రాధాన్యత దక్కడం విశేషం. ► దేశంలో నవతరం విడివిడిగా, ఐక్యంగానూ తమ పూర్తి శక్తిసామర్థ్యాలను సంతరించుకునే వాతావరణం ఉండాలి. దీనికి విద్యే అసలైన పునాది. 21వ శతాబ్ది సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) రూపొందించారు. విద్యా బోధనలో సాంకేతికతను లోతుగా, విస్తృతంగా వినియోగించాలని ఎన్ఈపీ స్పష్టంచేస్తోంది. -
ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు..
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నుంచి సర్వోన్నత న్యాయస్థానం పౌరులకు కొత్త వెసులుబాటు కల్పించనుంది. షెడ్యూల్డ్ భాషల్లోనూ న్యాయస్థానం తీర్పులను వెలువరిస్తామని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్(ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చబడిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ భాషల్లో తీర్పులను ప్రజలు ఉచితంగా పొందొచ్చు. ‘ ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా 34,000 తీర్పులు పొందొచ్చు. వాటిలో ఇప్పటికే 1,268 తీర్పులు ప్రాంతీయ భాషల్లోనూ ఉన్నాయి. తీర్పుల్లో 1091 హిందీలో, 21 ఒడియాలో, 14 మరాఠీ, 4 అస్సామీ, ఒకటి గారో, 17 కన్నడ, ఒకటి ఖాసీ, 29 మలయాళం, 3 నేపాలీ, 4 పంజాబీ, 52 తమిళం, 28 తెలుగు, 3 ఉర్దూ భాషల్లో ఉన్నాయి.‘ గురువారం నుంచి 13 భాషల్లో 1,268 తీర్పులు సుప్రీంకోర్టు వెబ్సైట్, మొబైల్ యాప్, నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ వెబ్సైట్లో జనవరి 26వ తేదీ నుంచి అందుబాటులో వస్తాయి. ఈ ఏడాది జనవరి ఒకటోతేదీదాకా వెలువరిచిన తీర్పులను న్యాయవాదులు, లా విద్యార్థులు, సాధారణ జనం అందరూ వీటిల్లో ఉచితంగా చూసుకోవచ్చు’ అని సీజే చెప్పారు. -
ఈజిప్ట్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 700 కోట్ల డాలర్లున్న ద్వైపాక్షిక వర్తకాన్ని ఐదేళ్లలో 1,200 కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ఆహార, ఇంధన, ఎరువులు తదితర రంగాలపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తదితరాలు చర్చకు వచ్చాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, యువత, సమాచార, సాంస్కృతిక రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ‘‘ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక బంధం స్థాయికి పెంపొందించుకోవాలని భేటీలో నిర్ణయించాం. ఇరు దేశాల వ్యూహాత్మక సహకారం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో శాంతికి, ప్రగతికి బాటలు పరుస్తుంది’’ అని మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండటంపై ఇరు దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. ఇది మానవాళి భద్రతకు అతి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తికి సైబర్ స్పేస్ దుర్వినియోగం చేస్తున్న తీరుకు అడ్డుకట్ట వేసేందుకు చేతులు కలపాలని నిర్ణయించాం’’ అన్నారు. కరోనా, యుద్ధంతో దెబ్బ తిన్న ఆహార, ఫార్మా సరఫరాలను బలోపేతం చేయడంపై చర్చించామన్నారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా తెలిపారు. ఇదే తొలిసారి గణతంత్ర ఉత్సవాలకు ఈజిప్టు అధ్యక్షున్ని ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఈజిప్టు సైనిక బృందం కూడా గణతంత్ర పరేడ్‌లో పాల్గొంటోంది. మూడో ఇండియా–ఆఫ్రికా ఫోరం శిఖరాగ్రంలో పాల్గొనేందుకు సిసి 2015లో తొలిసారి భారత్‌లో పర్యటించారు. తర్వాత ఏడాదికే మరోసారి పర్యటించారు. యువతే అతిపెద్ద లబ్ధిదారులు అభివృద్ధి చెందిన భారతదేశంలో యువతే అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నారని ప్రధానినరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత సైతం వారిపైనే ఉందన్నారు. గణతంత్ర పరేడ్‌లో పాల్గొననున్న ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘అమృతకాలంలో దేశ ఆకాంక్షలు, కలలకు యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేటితరానికి ఎన్నెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం సాధిస్తున్న ఘనతల్లోనే ప్రపంచం తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. జాతి లక్ష్యాలు, ఆకాంక్షలతో యువతను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అనుసంధానిస్తున్నాయి. యువత మాట్లాడడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 కూటమి గురించి పాఠశాలలు, కళాశాలల్లో చర్చించుకోవాలి’’ అని సూచించారు. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని యువతను కోరారు. -
74th Republic Day: గణతంత్ర పరేడ్‌లో... స్వదేశీ వెలుగులు
74వ గణతంత్ర వేడుకలు స్వదేశీ వెలుగులతో మెరవనున్నాయి. సంప్రదాయ గౌరవ వందనంలో బ్రిటిష్ కాలపు 25–పౌండర్ గన్స్ స్థానంలో స్వదేశీ 105 ఎంఎం తుపాకులు సగర్వంగా గర్జించనున్నాయి. పరేడ్‌లో ప్రదర్శించే ఆయుధాలన్నీ మన దేశంలో తయారైనవే! బ్రిటన్ వలస పాలన నీడల నుంచి బయటపడి పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఆత్మనిర్భర్ భారత్ సత్తాను సగర్వంగా చాటేలా గణతంత్ర వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చైనాతో ఉద్రిక్తతల వేళ మన సాయుధ సత్తాను చాటడానికి కవాతులో మేడిన్ ఇండియా ఆయుధాలను ప్రదర్శించబోతున్నారు. ఇండిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని, ఆకాశ్, నాగ్ క్షిపణులతో పాటు బ్రహ్మోస్, అర్జున్ యుద్ధ ట్యాంకులు, ప్రచండ హెలికాప్టర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి... బ్రహ్మోస్ ప్రపంచంలో మొట్టమొదటి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత రక్షణ అభివృద్ధి పరిశోధన రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, భూ ఉపరితలం... ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించగలదు. వంద శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్ల నుంచి కూడా సులభంగా తప్పించుకోగల ఈ క్షిపణి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అగ్ని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన క్షిపణి. కాలక్రమేణా ఆధునిక సాంకేతితతో రూపు మార్చుకుంటూ వచ్చింది. అగ్ని 5 వెర్షన్లను రూపొందించిన తర్వాత ఇటీవల అణ్వాయుధ సామర్థ్యంతో అగ్ని ప్రైమ్ ఖండాంతర క్షిపణిని తయారు చేశారు. 2 వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. ప్రచండ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించగలిగే తేలికపాటి హెలికాప్టర్. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) అభివృద్ధి చేసింది. సముద్రమట్టానికి 16,400 అడుగుల ఎత్తులో అలవోకగా టేకాఫ్, ల్యాండింగ్ ప్రత్యేకత. దీనితో రెండు శక్తిమంతమైన ఇంజిన్లు, అత్యంత ఆధునిక సౌకర్యాలుంటాయి. రాత్రి పూట కొండల మధ్య ప్రయాణించగలిగే సత్తాతో పాటు నిమిషానికి 800 రౌండ్లు కాల్పులు జరిపే సామర్థ్యముంది. చైనా డ్రోన్లను కూడా కూల్చివేయగలవు. నేలపై ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలవు. ఆకాశ్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్ తొలి క్షిపణి ఆకాశ్. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. 95% పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందుకు పాతికేళ్లు పట్టింది. 2014లో వైమానిక దళానికి, 2015లో ఆర్మీకి అందజేశారు. వీటిని విదేశాలకు విక్రయించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. కే–9 వజ్ర స్వీయ చోదక శతఘ్ని వ్యవస్థ. 2018లో తొలిసారిగా ఆర్మీకి అందజేశారు. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేస్తుంది. ప్రస్తుతం లద్ధాఖ్ సరిహద్దుల్లో మోహరించారు. 155 ఎంఎం కెనాన్ కలిగిన ఈ శతఘ్ని 18 నుంచి 52 కి.మీ. దూరం దాకా గుళ్ల వర్షం కురిపించగలదు. దీనికున్న అత్యంత శక్తిమంతమైన ఇంజిన్ గంటకి 67 కి.మీ. వేగంతో పని చేస్తుంది. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. రక్షణ రంగానికి స్వదేశీ హంగులు ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టాక రక్షణ రంగంలో స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రష్యా వంటి దేశాల సాంకేతిక సహకారంతో దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి ముమ్మరమైంది. 2021లో సాయుధ బలగాలు తమకు కేటాయించిన నిధుల్లో 64% స్వదేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు వినియోగిస్తే గతేడాది 68% నిధులు వినియోగించాయి. ఆర్మీ అత్యధికంగా 72% నిధులను మేడిన్ ఇండియా ఆయుధాలపైనే వెచ్చించింది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను 2025 కల్లా 2,500 కోట్ల డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం దిశగానూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గణతంత్ర ‘వెలుగులు’
సాక్షి, అమరావతి: 74వ గణతంత్ర దిన వేడుకలకు ఏపీ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. శాసన సభ భవనంతో పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్‌లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరోవైపు గణతంత్ర వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది. ప్రజలను ఈ దృశ్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. కాగా, స్టేడియంలో ఏర్పాట్లను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా బుధవారం పరిశీలించారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. -
74th Republic Day: పరేడ్‌లో మహిళా శక్తి
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించనున్నారు. మొదటిసారి మహిళా ఒంటె దళం కవాతు చేయనుంది. డేర్ డెవిల్స్‌గా స్త్రీల బృందం మోటర్ సైకిల్ విన్యాసాలుచేయనుంది. అనేక శకటాలు మహిళా శక్తిని చాటనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్త్రీ ప్రభావ శక్తికి ఈ పరేడ్ వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట΄ాటలు. చూడటానికి కళ్లు చాలవు. ఇదంతా కలిసి మన దేశం... మనమంతా కలిసి మన శక్తి అనే భావన ఈ సందర్భంలో కలుగుతుంది. అయితే ఈసారి ఈ ‘మన శక్తి’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలుప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఈ పరేడ్ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలువనుంది. ముగ్గురు మహిళా సైనికాధికారులు పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది. ఎన్సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్– 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్ డింపుల్ భాటి మోటార్ సైకిల్ విన్యాసాల దళంలో, మేజర్ మహిమ ‘కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు. మహిళా శకటాలు ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాల నుంచి, 6 మంత్రిత్వ శాఖల నుంచి, త్రివిధ దళాల నుంచి శకటాలుపాల్గొననున్నాయి. ఇవి కాకుండా డిఆర్డివో శకటం ఉంటుంది. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం,ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడుపుతున్నాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికిపాటుపడతాం అనే థీమ్‌తో త్రిపుర శకటం ఉండనుంది. పశ్చిమ బెంగాల్ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది. కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్ దారుల్లో నడిపించనున్నాయి. కళకళలాడే నృత్యాలు వీరందరూ కాకుండా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలలో విద్యార్థునులు, యువతలు, మహిళా కళాకరులు విశేష సంఖ్యలోపాల్గొననున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మొదలు వీరంతా తమ సాంస్కృతిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు. లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ, స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి, లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ చారిత్రక దృశ్యం దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ నేత్రపర్వంగా ఉండటమే కాదు, దేశభక్తి భావాలు ఉ΄÷్పంగేలా కూడా చేస్తుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేకత... సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) ‘క్యామెల్ కాంటింజెంట్’లో తొలిసారిగా ΄ాల్గొంటున్న మహిళా సైనికులు... దిల్లీలో ఘనంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ 1976 నుంచి భాగం అవుతోంది. ఈసారి జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళా సైనికులు ‘క్యామెల్ కాంటింజెంట్’లో భాగం కావడం చారిత్రక ఘట్టం కానుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరవై నాలుగు మంది మహిళా సైనికులకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో క్యామెల్ రైడింగ్‌లో శిక్షణ ఇచ్చి పన్నెండు మందిని ఎంపిక చేశారు. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో ΄ాల్గొనడం ఒక సంతోషం అయితే క్యామెల్ కాంటింజెంట్‌లో భాగం కావడం మరింత సంతోషం కలిగిస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైన అంబిక. ‘రిపబ్లిక్ డే ఉత్సవాల్లో క్యామెల్ రైడర్స్‌ను చూసి అబ్బురపడేదాన్ని. ఇప్పుడు నేను అందులో భాగం కావడం గర్వంగా ఉంది’ అంటుంది సోనాల్. విజయ్‌చౌక్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్యపథ్ మీదుగా క్యామెల్ రైడర్స్ కవాతు నిర్వహిస్తారు. రిపబ్లిక్‌డే తరువాత జరిగే రీట్రీట్ సెరిమనీలో కూడా ఈ బృందం ΄ాల్గొనబోతోంది. అమృత్‌సర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ఈ బృందం ΄ాల్గొని ప్రశంసలు అందుకుంది. ఉమెన్ రైడర్స్ కోసం ఆకట్టుకునే యూనిఫాంను కూడా రూ΄÷ందించారు. ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ దీన్ని డిజైన్ చేశారు. మన దేశంలోని వివిధ ్ర΄ాంతాలకు చెందిన క్రాఫ్ట్ ఫామ్స్‌ను ఈ డిజైన్ ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌లోని మెవాడ్ సంప్రదాయానికి చెందిన తల΄ాగా మరో ఆకర్షణ. మన దేశంలో భద్రతావసరాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ఒంటెలను ఉపయోగిస్తున్న ఏకైక సైనిక విభాగం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సాంస్కృతిక కార్యక్రమాల్లో బీఎస్ఎఫ్ క్యామెల్ కాంటింజెంట్ కవాతులకు ప్రత్యేకత ఉంది. ఉమెన్ రైడర్స్ రాకతో కవాతులలో రాజసం ఉట్టిపడుతుంది. మేము సైతం: ఉమెన్ రైడర్స్, ఆకట్టుకునే యూనిఫాం: ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ డిజైన్ చేశారు. -
రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. అక్కడే బలగాల పరేడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గణతంత్ర దినోత్సవ వేడుకలపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. రేపు(గురువారం) రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ వేడుకలను నిర్వహించనున్నట్టు ఓ ప్రకటన విడులైంది. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై గురువారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లోనే బలగాలు పరేడ్ నిర్వహించనున్నారు. అలాగే, రేపు ఉదయం 6:30 గంటలకు బీఆర్కే భవన్లో గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. బీఆర్కే భవన్లో సీఎస్ శాంతికుమారి.. జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. -
ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కడేనా?: బీజేపీ లక్ష్మణ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వేడుకల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరపాలని ఆదేశించింది. ఎక్కడ పరేడ్ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించింది. ఇక, ఈ క్రమంలో బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు. రిపబ్లిక్ డే వేడుకలను అవమానిస్తున్నారు. కరోనా ఉందని సాకులు చెప్పడం హాస్యాస్పదం. పరేడ్‌తో గణతంత్ర దినోత్సవం చేయాలని హైకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నాము. మీ పార్టీ సభలకి లేని కోడ్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాత్రం పెట్టడం దారుణం. దేశం గర్వించదగ్గ వేడుకకి ఇలాంటి రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. మీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రతీ సంప్రదాయం కోర్టు ద్వారానే కాపాడాలంటే కష్టం. వేడుకలు రాజ్ భవన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనికి సంబంధించి కేబినెట్ భేటీ ఎప్పుడు జరిగింది?. నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు?. ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కడేనా?. కేసీఆర్ ప్రభుత్వం పతనమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. 11,000 గ్రామాల కూడళ్లలో సమావేశాలు పెట్టి కేసీఆర్ మోసాలు ప్రజల వద్ద ఎండగడుతాము. రానున్న రోజుల్లో ప్రతీ నెలకు ఒకసారి తెలంగాణకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వస్తూనే ఉంటారు. తెలంగాణపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది అని కామెంట్స్ చేశారు. -
రిపబ్లిక్ డే విషెస్ చెప్పేయండిలా..!
జనవరి 26వ తేదీ.. మనకు ప్రత్యేకమైన రోజు. భారతదేశం గర్వించదగ్గ రోజు. 1950వ సంవత్సరం జనవరి 26న భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చిన రోజు. దీన్ని పురస్కరించుకునే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మనకు 74వ గణతంత్ర దినోత్సవం. అనేక మార్పులు చేర్పులు తర్వాత అప్పటి మన నాయకులు జనవరి 26వ తేదీన రాజ్యాంగంలోని హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, రాజ్యాంగం హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవటానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ మార్పులు జరిగి, 1950, జనవరి 26వ తేదీ అధికారికంగా అమల్లోకి తెచ్చారు. ఫలితంగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. ఈ రోజు భారతీయులందరీకి ఎంతో ప్రత్యేకం. భారతదేశం అంతా దీన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీ స్నేహితులు, బంధువులకు క్రింద ఉన్న గణతంత్ర దినోత్సవ కోట్స్ తో విషెస్ చెప్పండి. మాతృభూమి కోసం.. తమ ధన, మాన ప్రాణాలను.. త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. వందనం.. అభివందనం.. పాదాభివందనం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం.. భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేటి మన స్వాతంత్ర్య సంభరం.. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ.. జరుపుకుందాం ఈ గణతంత్ర దినోత్సవ పండుగను మెండుగా కన్నుల పండుగగా..!! అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో వీరుల త్యాగఫలం.. మన నేటి స్వేచ్ఛకే మూలబలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి తల వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 'గణతంత్ర దినోత్సవంతో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం.. దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు' మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. 'ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మన సమరయోధులను స్మరించుకుందాం.. మన వారసత్వాన్ని కాపాడుకుందాం.. మన దేశాన్ని చూసి గర్వపడదాం..' మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. మన దేశ శ్రేయస్సు కోసం మనం చేయగలిగినదంతా చేస్తామని మన భారతమాతకి ప్రతిజ్ఞ చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! గెలవాలనే మన కోరికకు ఆజ్యం పోద్దాం, మన దేశంలోని ప్రతి భాగాన్ని శక్తివంతం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాను మరియు నా దేశ సంస్కృతిని గౌరవిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం యొక్క కీర్తిలో సంతోషించండి మరియు సైనికులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిషర్ల దాశ్య సంకెళ్లను వదిలించుకొని భారతదేశం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న చారిత్రక రోజు. మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. భారతదేశం గొప్ప దేశం. శాంతియుత దేశం. భారతీయతను చాటి చెబుదాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం భారతీయులం. మొదటి నుంచీ... చివరి వరకూ - మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గణతంత్రం వల్ల కలిగే ఆశ ఏంటి... ఒక దేశం, ఒక భాష, ఒక జాతీయ జెండా - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం శాంతిని నమ్ముతాం. శాంతియుత అభివృద్ధి మనకోసం మాత్రమే కాదు... ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసమూ - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశ సేవలో నేను మరణిస్తే, అది నాకు గర్వకారణమే. నా రక్తంలోని ప్రతి చుక్కా దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి. దేశాన్ని మరింత బలంగా, చురుగ్గా మార్చాలి - మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వాట్సాప్, ఫేస్బుక్, షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో షేర్ చేస్తూ... మీ స్నేహితులు, బంధువులకు విషెస్ చెప్పండి.