సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గురువారం గణతంత్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకం రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేడ్కర్, ఇతర స్వాతంత్య్ర పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారి సేవల్ని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో ప్రగతి గురించి వివరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. శాసనమండలి వద్ద జరిగిన వేడుకల్లో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ భవనం ముందు శాసనసభాపతి తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, ఉప కార్యదర్శులు రాజకుమార్, జయరాజు, జగన్మోహన్‌రావు, చీఫ్ మార్షల్ పాల్గొన్నారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో..
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం సెక్రటరీ కె.ధనుంజయరెడ్డి, అదనపు సెక్రటరీ డాక్టర్ నారాయణభరత్ గుప్తా, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
మంగళగిరిలోని ఆక్టోపస్ విభాగం ప్రధాన కార్యాలయంలో ఆక్టోపస్ ఎస్పీ బల్లి రవిచంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆక్టోపస్ అదనపు ఎస్పీ కె.రామచంద్రమూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బస్ భవన్‌లో..
విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌లో సంస్థ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు కార్గో సేవలను మరింతగా విస్తరించాలన్నారు. ఆర్టీసీ ఈడీలు కోటేశ్వరరావు, కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, పి.కృష్ణమోహన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలోని ఏపీ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ ఎండీ జి.లక్ష్మీషా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
26 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. జేఎండీ ఎం. శివప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాల జేఎండీలు వికాస్, భావన పాల్గొన్నారు. విజయవాడలోని టిడ్కో కార్యాలయంలో సంస్థ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంస్థ ఎండీ శ్రీధర్, సీఈ గోపాలకృష్ణారెడ్డి, డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ పొల్గొన్నారు. 57 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించారు. విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో సంస్థ కమిషనర్ వివేక్‌యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంస్థ అదనపు కమిషనర్ షేక్ అలీ బాషా, జాయింట్ డైరెక్టర్ (ఓఎం) టి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి : సీఎస్
సాక్షి, అమరావతి: అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని, అవి ప్రజలందరికీ అందేలా ప్రభుత్వ ఉద్యోగులు కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ జవహర్‌రెడ్డి చెప్పారు. ఇందుకుగాను ప్రతి ఉద్యోగి మరింత చిత్తశుద్ధి, అకింతభావంతో పనిచేయాలని కోరారు. రాష్ట్ర సచివాలయం వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి కె.కృష్ణమూర్తి, సాధారణ పరిపాలనశాఖ ఉప కార్యదర్శులు రామసుబ్బయ్య, శ్రీనివాస్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
భారతదేశానికి ఆత్మలాంటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ సజిల, వైఎస్సార్‌సీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కిరణ్, పార్టీ నేతలు మేరాజోత్ హనుమంత్‌నాయక్, పడమట సురేష్‌బాబు, ఎ.నారాయణమూర్తి, పోచంరెడ్డి సుదర్శన్‌రెడ్డి, మందపాటి శేషగిరిరావు, కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వాడవాడలా జాతీయ పతాక రెపరెపలు
Published Fri, Jan 27 2023 4:41 AM | Last Updated on Fri, Jan 27 2023 4:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment