national flag hoist
-
రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండా
-
స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలి
కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందినప్పుడే నిజమైన సంతృప్తి అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తి చెప్పారు. కర్నూలులోని హెచ్ఆర్సీ కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలకు నిలయంగా మారుతోందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వారందరిని స్మరించుకోవడం పౌరుల బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హెచ్ఆర్సీ జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. అసమానతలు బాధాకరం లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి దేశంలో నేటికీ ధనిక, పేదవర్గాలు, కులమతాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండటం బాధాకరమని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. కర్నూలులోని లోకాయుక్త కార్యాలయం ఆవరణలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రఫలాలు పౌరులందరికీ సమానంగా అందించేందుకు పాలకులు, అధికారులు కృషిచేయాలని కోరారు. చెస్, క్యారమ్స్, ముగ్గులు, క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. లోకాయుక్త ఇన్స్పెక్టర జనరల్ నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
వాడవాడలా జాతీయ పతాక రెపరెపలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గురువారం గణతంత్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకం రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేడ్కర్, ఇతర స్వాతంత్య్ర పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సేవల్ని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో ప్రగతి గురించి వివరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. శాసనమండలి వద్ద జరిగిన వేడుకల్లో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ భవనం ముందు శాసనసభాపతి తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, ఉప కార్యదర్శులు రాజకుమార్, జయరాజు, జగన్మోహన్రావు, చీఫ్ మార్షల్ పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం సెక్రటరీ కె.ధనుంజయరెడ్డి, అదనపు సెక్రటరీ డాక్టర్ నారాయణభరత్ గుప్తా, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు. మంగళగిరిలోని ఆక్టోపస్ విభాగం ప్రధాన కార్యాలయంలో ఆక్టోపస్ ఎస్పీ బల్లి రవిచంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆక్టోపస్ అదనపు ఎస్పీ కె.రామచంద్రమూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బస్ భవన్లో.. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో సంస్థ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు కార్గో సేవలను మరింతగా విస్తరించాలన్నారు. ఆర్టీసీ ఈడీలు కోటేశ్వరరావు, కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, పి.కృష్ణమోహన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలోని ఏపీ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ ఎండీ జి.లక్ష్మీషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. 26 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. జేఎండీ ఎం. శివప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాల జేఎండీలు వికాస్, భావన పాల్గొన్నారు. విజయవాడలోని టిడ్కో కార్యాలయంలో సంస్థ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంస్థ ఎండీ శ్రీధర్, సీఈ గోపాలకృష్ణారెడ్డి, డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ పొల్గొన్నారు. 57 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో సంస్థ కమిషనర్ వివేక్‌యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంస్థ అదనపు కమిషనర్ షేక్ అలీ బాషా, జాయింట్ డైరెక్టర్ (ఓఎం) టి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి : సీఎస్ సాక్షి, అమరావతి: అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని, అవి ప్రజలందరికీ అందేలా ప్రభుత్వ ఉద్యోగులు కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ జవహర్‌రెడ్డి చెప్పారు. ఇందుకుగాను ప్రతి ఉద్యోగి మరింత చిత్తశుద్ధి, అకింతభావంతో పనిచేయాలని కోరారు. రాష్ట్ర సచివాలయం వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి కె.కృష్ణమూర్తి, సాధారణ పరిపాలనశాఖ ఉప కార్యదర్శులు రామసుబ్బయ్య, శ్రీనివాస్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. భారతదేశానికి ఆత్మలాంటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ సజిల, వైఎస్సార్సీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కిరణ్, పార్టీ నేతలు మేరాజోత్ హనుమంత్‌నాయక్, పడమట సురేష్‌బాబు, ఎ.నారాయణమూర్తి, పోచంరెడ్డి సుదర్శన్‌రెడ్డి, మందపాటి శేషగిరిరావు, కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
75 ఏళ్ల స్వాతంత్య్రం.. మూడు షిఫ్ట్‌లు, రోజుకు రూ. 50 భత్యం
శివాజీనగర(బెంగళూరు): భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతటా ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌ను ఆచరిస్తుండగా, విధానసౌధపై ప్రతి రోజు త్రివర్ణ పతాకం ఎగురవేసే వారి భత్యం రోజుకు రూ. 50 మాత్రమే. ఈ సందర్భంగా వారు తమ భత్యం రూ.100 పెంచాలని కోరుకుంటున్నారు. గ్రూప్ ‘డీ’ ఉద్యోగులుగా నియామకమైన ఏడుగురు కార్మికులు తమ జెండావిష్కరణ కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రతిరోజు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారు. హోమ్‌గార్డులతో గాని పోలీస్ సిబ్బందితో పని చేస్తారు. విధానసౌధ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 150 అడుగుల ఎత్తు నాలుగో అంతస్తులో 30 అడుగుల ఎత్తు కలిగిన జెండా స్తంభముంది. అంటే తాము విధానసౌధ బయట నుండి చూసే జెండాలు గ్రౌండ్ ఫ్లోర్ నుండి 180 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతాయి. పాదరక్షలు లేకుండానే... విధానసౌధపై జెండావిష్కరణ పాదరక్షలు లేకుండగా చేయటం అంత సులభమైన పని కాదు. అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని సూర్యోదయం సమయంలో కొంచెం పైకి ఎత్తాలి. సూర్యస్తమయం సమయంలో నిర్ధారించిన సమయంలో కిందకు దించాలి. పాదరక్షలు లేకుండగానే జెండావిష్కరణ చేయాలి. దానిని కిందకు దింపిన తరువాత దానిని మడవటానికి ఒక విధానముందని జెండా కర్తవ్యంలో ఉన్న సీనియర్ సిబ్బంది ఆంథోని మీడియాకు తెలిపారు. ఆయన 26 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాడు. ఆంథోని తరహాలోనే తోటి ఉద్యోగులు రాత్రి–పగలు షిఫ్ట్ పద్దతిలో పనిచేస్తున్నారు. వర్షం వచ్చినా కూడా వారికి సెలవు లేదు. ఉదయం 6.22కు సూర్యోదయమైతే ఏమైనా గాని ఆ సమయానికి జెండా ఆవిష్కరణ చేయాలి. ఈ ఉద్యోగులు తమ నియమించిన పనికి జీతం పొందుతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలతో పాటు విధానసౌధలో కార్యాలయాల తలుపులు మూయటం, తెరవటం కూడా ఉంది. రోజుకు 50 రూపాయలను ఫ్లాగ్ డ్యూటీ కోసం ఇవ్వబడుతోందని ప్రభుత్వ డీపీఏఆర్ వర్గాలు తెలిపాయి. 2013లో రోజుకు 15 రూపాయలుండేది. 2016లో రోజుకు రూ.25, అప్పటి నుండి జీతం పెంచలేదు. రోజుకు రూ.100 పెంచాలని చేసిన వారి డిమాండ్‌ను ఇప్పటి వరకు పరిష్కరించలేదని డీపీఏఆర్ అధికార వర్గాలు తెలిపాయి. వారు విధానసౌధలో ఆవిష్కరించే జెండా 8 అడుగుల ఎత్తు, 12 అడగుల వెడల్పుతో కర్ణాటకలో అతిపెద్ద జెండాల్లో ఇది ఒకటి. చదవండి: వారానికి 4 రోజులే పని, త్వరలోనే అమల్లోకి కొత్త లేబర్ చట్టాలు! -
జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఎంఈఓ
చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్‌లోని మం డల విద్యాధికారి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. కార్యాలయం ఆ వరణలో ఎంఈఓ బోనగిరి రాములు జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటికే అక్కడికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్ద ఎత్తునవచ్చారు. ఇదే సమయంలో ఎంఈఓ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు. జాతీయ గీతాలాపన ప్రారంభించిన సమయంలో కొందరు పైకి చూసి విషయాన్ని గు ర్తించారు. దీంతో నాలుకర్చుకున్న ఎంఈఓ హు టాహుటిన జాతీయ పతాకాన్ని తిరిగి మార్చారు. అనంతరం మరోసారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వ్యక్తి జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటోనని పలువురు చర్చించుకున్నారు. -
లండన్‌లో త్రివర్ణ పతాక రెపరెపలు
లండన్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా లండన్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు అక్కడ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీమిండియా బసచేసిన హోటల్ ఆవరణలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ‘భారత క్రికెట్ జట్టు తరఫున ఇక్కడి నుంచి ప్రతీ ఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’ అని కోహ్లి పేర్కొన్నాడు. అనంతరం జట్టు సభ్యులు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వేడుకల ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జట్టు సంబరాలు చేసుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీమిండియా శ్రీలంకలో చేసుకుంది. ఈ నెల 18 నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం భారత జట్టు బుధవారం నాటింగ్‌హామ్ బయలుదేరింది. -
ఈసారి అక్కడ జెండా ఎగరేసేది అమ్మాయిలే..
అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను అందరికీ స్ఫూర్తిదాయకంగా నిర్వహించనుంది. తమ రాష్ట్రంలోని అన్ని (ప్రభుత్వ, ప్రభుత్వేతర) పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఆయా గ్రామాల్లో బాగా చదివిన బాలికలు, యువతులతో ఎగరేయిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ప్రాథమిక విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను పంపించింది. అంతేకాకుండా, ఈ ఏడాది అంటే 2016లో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రభుత్వం తరుపున ఆ రోజు సన్మానించనుంది. ఇందుకోసం ఆయా పాఠశాలకు ప్రభుత్వమే రూ.300 కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి రిపబ్లిక్ డే నాడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి థీమ్ గా 'బేటీ కో సలాం, దేశ్ కే నామ్' అని నిర్ణయించారు. బాలికల విషయంలో లింగవివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.