లండన్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా లండన్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు అక్కడ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీమిండియా బసచేసిన హోటల్ ఆవరణలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ‘భారత క్రికెట్ జట్టు తరఫున ఇక్కడి నుంచి ప్రతీ ఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’ అని కోహ్లి పేర్కొన్నాడు.
అనంతరం జట్టు సభ్యులు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా వేడుకల ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జట్టు సంబరాలు చేసుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్లో ఉంచింది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీమిండియా శ్రీలంకలో చేసుకుంది. ఈ నెల 18 నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం భారత జట్టు బుధవారం నాటింగ్‌హామ్ బయలుదేరింది.
లండన్‌లో త్రివర్ణ పతాక రెపరెపలు
Published Thu, Aug 16 2018 1:11 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment