
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, గణతంత్ర వేడుకల నేపథ్యంలో మాటల దాడి మరింత పెరిగింది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడారు. గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి లేఖ రాస్తాము. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలి. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదు అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు.
అంతకుముందు ఎమ్మెల్సీ కవిత సైతం గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా.. ‘కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టిపెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు.