
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ ఆరేళ్ల బీటెక్ కోర్సులో అదనంగా మరో 500 సీట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2018–19 విద్యాసంవత్సరంలో ఈ సీట్లలోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా శనివారం తెలిపారు.
బాసర క్యాంపస్‌లో 2008–09 విద్యాసంవత్సరంలో 2వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారని, మౌలిక వసతుల కొరత వల్ల 2010లో వెయ్యి సీట్లను తగ్గించినట్టు గుర్తు చేశారు. గడిచిన ఏడేళ్లలో క్యాంపస్ పురోగతి సాధించిందని, ఆధునిక లాబొరేటరీలు, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన బోధనాసిబ్బంది వంటి కారణాలతో ప్రస్తుతం మళ్లీ అదనపు సీట్లను మంజూరు చేశామని పేర్కొన్నారు.