Rama Devi
-
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
బీజేపీకి దెబ్బ మీద దెబ్బ..!
-
నడిరోడ్డుపై కిందపడ్డ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు
-
అయ్యో!.. అదుపుతప్పి నడిరోడ్డుపై పడిపోయిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మరోసారి నిరసనల బాటపట్టారు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా ఆందోళన చేపట్టిన విద్యార్థులకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి సంఘీభావం ప్రకటించారు. అయితే బైంసాలో పోలీసులు అడ్డుకుంటారని భావించిన రమాదేవి వారికి చిక్కకుండా ఉండేందుకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో హడావుడిగా వెళ్తుండగా నడిరోడ్డుపై ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. తరువాత ఆమెను పైకి లేపగా.. పెద్దగా గాయాలేవి తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్ -
అంత కోపం వద్దు...ప్రేమతో మాట్లాడండి; మీరేమీ మోరల్ సైన్స్ టీచర్ కాదు!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానంలో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ నేత మహువా మోయిత్రా వివిధ సమస్యల పట్ల ప్రభుత్వ తీరు పై నిప్పులు చెరిగారు. దీంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవి.. మోయిత్రా మాటలకు అంతరాయం కలిగిస్తూ లోక్‌సభ గౌరవార్థం "ప్రేమతో మాట్లాడండి, అంత కోపం తెచ్చుకోవద్దని కోరారు. అంతేకాదు సహనం, క్షమ, దయాలతోనే ప్రపంచం ఒక శక్తి దర్పణంలా ప్రకాశిస్తోందని కూడా అన్నారు. దీంతో మోయిత్రా ఒకింతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు ఆమె సోషల్‌మీడియా వేదికగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు మోయిత్రా మాట్లాడుతూ.." మేము సహనం, క్షమాపణను తీసుకువస్తాం. కానీ వాటి వెనుక కొద్దిమొత్తంలో కోపంతో కూడిన ఆవేశం కూడా ఉంటుంది. నేను కోపంతో కాక ప్రేమతో మాట్లాడాలి అంటూ ఉపన్యాసాలివ్వడానికి మీరెవరని ప్రశ్నించారు. మీరు నిబంధనల నిమిత్తమే నన్ను సరిదిద్దగలరు. మీరేమీ లోక్‌సభకు మోరల్ సైన్స్ టీచర్ కాదు అంటూ ట్విట్టర్లో ఘాటుగా విమర్శించారు. (చదవండి: నా నియోజకవర్గమే నా పెద్ద కుటుంబం: గనీవ్ కౌర్) -
తల్లి, కొడుకు కిస్ చేసుకున్నా తప్పేనా?
న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీతో పాటు మహిళ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ మాత్రం ఆజాంఖాన్‌కు మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆజంఖాన్‌ను సమర్ధించేలా ఆయన పలు ఊదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. అన్నాచెల్లెలు, తల్లికొడుకులు ముద్దు పెట్టుకున్నా అది లైంగిక సంబంధమేనా అని ప్రశ్నించారు. 2015లో జేడీయూను వీడిన జితన్‌రామ్ స్వంతంగా హిందూస్తాన్ అవామ్ మోర్చా పార్టీని స్థాపించారు. కాగా, లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రమాదేవి కూడా ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు మహిళా ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే, మిమి చక్రవర్తి, అనుప్రియా పటేల్‌లు ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మాత్రం ఆజంఖాన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమేనని ఆజంఖాన్ స్పష్టం చేశారు. -
ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదని డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవి అన్నారు. ఆమె శనివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆజంఖాన్ రెండు సార్లు కుర్చీలో ఉన్న తనను అవమానించారన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే వెంటనే ఆయన క్షమాపణ చెప్పలేదన్నారు. (చదవండి : లోక్‌సభలో ఆజం ఖాన్ వ్యాఖ్యలపై దుమారం) ‘నేను సభలో ఉన్న ప్రతి ఒక్కర్నీ గౌరవంగా చూస్తాను. ఆజంఖాన్ నావైపు చూస్తు మాట్లాడకుండా నేరుగా ఎంపీల వైపు చూస్తూ మాట్లాడుతున్నారు. అందుకే ఆజంను చైర్ వైపు చూసి మాట్లాడాలని ఆదేశించాను. కానీ ఆయన అది పట్టించుకోకుండా సభలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన వ్యాఖ్యలకు అప్పుడే కౌంటర్ ఇచ్చేదాన్ని. కానీ, గౌరవప్రదమైన కుర్చీలో కూర్చుని అలా చేయడం తగదు అనిపించింది. ప్రతి ఒకరికీ తల్లి, సోదరి, కుమార్తె, భార్య ఉంటారు.. ఆజం వ్యాఖ్యలు మహిళలను కించపరడమే కాకుండా పురుషుల గౌరవాన్ని కూడా తగ్గించేలా ఉన్నాయి’ అని రమాదేవి అన్నారు. (చదవండి : ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం) బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై చర్చ సందర్భంగా మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలనుకుంటున్నానని రమాదేవిని ఉద్దేశించి ఆజం ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆజం వ్యాఖ్యలను మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా సైతం ఆజం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆజంను ఆదేశించారు. -
‘ఆజం ఖాన్ మానసిక వికలాంగుడు’
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఆజం ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆజం ఖాన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజం ఖాన్ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సుష్మ స్పందిస్తూ... ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆజం ఖాన్‌కు కొత్తేం కాదు. ఆయన బుద్ధే ఇది. సభాధ్యక్షురాలి స్థానంలో ఉన్న ఓ మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆజం ఖాన్ తన హద్దులను పూర్తిగా అతిక్రమించారు. ఈ విషయంలో ఆయనకు కఠిన శిక్ష విధించి సభ గౌరవమర్యాదలు కాపాడల’ని సుష్మా స్వరాజ్ కోరారు. ఇక రమాదేవి ఆజం ఖాన్ క్షమాపణలు చెప్తే సరిపోదని.. ఆయనపై ఐదేళ్ల పాటు బహిష్కరణ విధించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల నాయకులతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్ అంశంపై చర్చించారు. -
‘ఆ ఎంపీ తల నరికి పార్లమెంటుకు వేలాడదీయండి’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజంఖాన్ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ రమాదేవిపై చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం చెలరేగుతోంది. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా ఖండించగా.. ఆ పార్టీ యూపీ నేత ఒకరు మరింత ఘాటుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఆఫ్తాబ్ అద్వానీ అజంఖాన్‌పై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎంపీని అవమాన పరుస్తూ అసభ్యంగా మాట్లాడినందుకు ఆజంఖాన్ తల నరికి పార్లమెంటు తలుపునకు వేలాడదీయాలని ఆఫ్తాబ్ డిమాండ్ చేశారు. ‘‘ఆజంఖాన్ గతంలో కూడా జయప్రదపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మహిళా ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ నిజంగా పిచ్చివాడు. పిచ్చి కుక్కలా అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్న ఇలాంటి నాయకులు దేశానికి హానికరం...అందుకే ఇతన్ని చంపండి’’ అంటూ ఆఫ్తాబ్ వీడియోలో కోరారు. దేశ మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్న ఆయనపై ప్రతికారం తీర్చుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఆజంఖాన్ సభ్వత్వాన్ని రద్దు చేయాలని పలువురు బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా దీనిపై స్పందించిన ఆయన.. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చేయని తప్పుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న ఆజంఖాన్ తాను అన్‌పార్లమెంటరీ పదాలు ఏమైనా వాడితే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. -
అమ్మే ఆదర్శం..
మొదటి నుంచి కష్టపడే తత్వం.. ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడవని వైనం.. అమ్మ నేర్పిన క్రమ శిక్షణతో చదువులో రాణింపు.. నాన్న లేకున్నా నలుగురు ఆడ పిల్లలున్న కుటుంబాన్ని ఒంటెద్దు బండిలా లాగిన తల్లిని ఆదర్శంగా తీసుకొని.. స్టెనోగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ.. అనతికాలంలోనే ఉన్నస్థానానికి ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ముదిగొండ తహసీల్దార్ రమాదేవి.. ఖమ్మం, ముదిగొండ: కొత్తగూడేనికి చెందిన మద్దెల సరోజిని, హనుమయ్యకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మద్దెల రమాదేవి, రెండో కూతురు శ్రీదేవి అంగన్వాడీ టీచర్, మూడో కుమార్తె పద్మజ ఎంఎస్సీ బీఈడీ, నాలుగో కుమార్తె అవంతి బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. తల్లి సరోజిని ఇంటర్ వరకు చదువుకొని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. తండ్రి హనుమయ్య సింగరేణి ఉద్యోగి. తండ్రి మరణానంతరం కుటుంబ భారం సరోజినిపై పడింది. ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూనే కుటుంబాన్ని సాకింది. కుమార్తెలను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో కష్టపడింది. రమాదేవి కొత్తగూడెంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఓ ప్రైవేటు గర్ల్స్ హైస్కూల్లో.. ప్రైవేటు కాలేజీలో ఇంటర్.. సింగరేణి డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం జూనియర్ స్టెనోగా 1999లో ఖమ్మంలోని కలెక్టరేట్లో ఉద్యోగం సంపాదించారు. చండ్రుగొండలో యూడీసీగా, దమ్మపేటలో ఆర్ఐగా, పెనుబల్లి మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా, పని చేశారు. వరంగల్, అశ్వారావుపేటలో ఎలక్షన్ ఆఫీసర్, అనంతరం ముల్కలపల్లి, టేకులపల్లి మండల తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం ముదిగొండ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రమాదేవి భర్త ప్రసాద్ సివిల్ çసపై డీటీగా అశ్వారావుపేటలో పని చేస్తున్నారు. ఇదంతా అమ్మ వల్లే.. నేను చిరు ఉద్యోగి నుంచి తహసీల్దార్ స్థాయికి చేరుకోవడంలో నా తల్లి పాత్ర ఎనలేనిది. చిన్ననాటి నుంచి ఎంతో శ్రద్ధతో నన్ను చదివించింది. నాన్న లేకున్నా మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. నలుగురు ఆడ పిల్లలని ఏ నాడు భయపడలేదు. నేను ఉన్నతంగా ఆలోచించడానికి కారణం మా అమ్మతో ఉన్న సాన్నిహిత్యమే.. ఆమె చూపిన మార్గంలో నడవడం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా.. విధుల విషయానికి వస్తే.. మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో, అధికారులతో మమేకమైపోతుంటా. నాకు సాధ్యమైనంత వరకు న్యాయం జరిగే విధంగా చూస్తా. నేను ఎక్కడినుంచి వచ్చానో నాకు తెలుసు.. నా మూలాలు మరిచిపోలేదు. కిందస్థాయి నుంచి వచ్చిన నేను పేదల సమస్యల పరిష్కారంలో ఎన్నటికీ రాజీపడను.. -
బాలల హక్కులు పరిరక్షించాలి
ఒంగోలు టౌన్ : బాలల హక్కులు పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. బాలలకు అన్నిరకాల వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పురుషులతో సమానంగా ఆడ పిల్లలను చదివించాలని కోరారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ జి. విశాలాక్షి అధ్యక్షతన నిర్వహించిన సభలో మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి, డీఎంహెచ్ఓ యాస్మిన్, అడిషనల్ డీఈఓ విజయలక్ష్మి, జీసీడీఓ సరస్వతి, ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియ, ఏసీఎల్ రమాదేవి, ఐఈఆర్‌ఎఫ్ సంస్థ ప్రతినిధి జోసఫ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సందర్భంగా బాలికల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దర్శి కేజీబీవీకి చెందిన బాలికలు ప్రదర్శించిన ‘బచావో బేటీ పడావో’ నాటిక సభికులను ఆలోచింప జేసింది. ఆడపిల్లల పట్ల లింగ వివక్ష చూపరాదని, వారిని రక్షించాలంటూ బాలికల ప్రదర్శన ఆకట్టుకుంది. ఒంగోలులోని శారా హోమ్‌కు చెందిన మానసిక విద్యార్థులు దేశభక్తి గీతానికి చక్కగా అభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు. ఒంగోలులోని బాలసదన్, ఐఈఆర్ఎఫ్కు చెందిన బాలలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వల్లూరు సెక్టార్‌కు చెంందిన అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు. సుప్రియ కళానిలయం డెరైక్టర్ రంగుల సంధ్య సమాజ ఆచారాలు, కట్టుబాట్ల పేర్లతో మహిళలకు వేస్తున్న సంకెళ్లను చేధించుకొని ఏవిధంగా ముందడుగు వేస్తారన్న దానిని స్పాట్ పెయింటింగ్ రూపంలో చక్కగా చిత్రాన్ని చూపించారు. రంగుల సంధ్య స్పాట్ పెయింటింగ్‌కు ముగ్ధుడైన ఎస్ఎస్ఏ పీఓ సుధాకర్ అక్కడికక్కడే రెండు వేల రూపాయలు చెల్లించి ఆ పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నారు. బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జిల్లాకు చెందిన అంగన్వాడీ కేంద్రాల చిన్నారులను అభినంధించారు. -
పెళ్లింట పెనువిషాదం
ఇద్దరి దుర్మరణం - 35 మందికి గాయాలు ఐదుగురి పరిస్థితి ఆందోళనకరం వైరా/తల్లాడ : వైరా మండలం పినపాక వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 35మందికి గాయాలయ్యాయి. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైరాలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఆది శ్రీకాంత్‌కు తల్లాడ మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతితో శుక్రవారం రాత్రి 11.30గంటలకు వివాహం జరగాల్సి ఉంది. దీంతో మంగాపురం నుంచి ట్రాక్టర్లో పెళ్లి కుమార్తె బంధువులు, గ్రామస్తులు బయల్దేరారు. వైరా మండలం పినపాక హైలెవల్ వంతెన వద్దకు రాగానే ట్రాక్టర్ ట్రక్కును వైరా నుంచి తల్లాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో ట్రాక్టర్లో ఉన్న పెళ్లి బృందం బ్రిడ్జి కింద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో వధువు మేనత్త గాదె లీలావతి(40), గాదె రమాదేవి(35) మృతిచెందారు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పద్మ, టి.రమాదేవి, వి.లక్ష్మీనరసమ్మ, కె.సుబ్బారావు, పి.అప్పారావు, వెంకమ్మ, పరుచూరి పద్మ, పరుచూరి సామ్రాజ్యం సహా 35మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా ట్రాక్టర్ వెనుక ద్విచక్రవాహనంపై అదే పెళ్లికి హాజరయ్యేం దుకు వస్తున్న వి.రాంబాబు(35) ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
సంప్రదాయానికి దర్పణం ‘స్త్రీ’
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణాలుగా భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్న శాంతమూర్తు లు మహిళలని డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి అన్నారు. అభినయ ఆర్ట్స్ హ నుమ అవార్డ్స్ నాటక పోటీలలో భా గంగా శనివారం మహతిలో మహిళా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె చీరకట్టు, నుదుట బొట్టు, కాలిమెట్టు అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచ దేశాలల్లో భారతీయ స్త్రీ మూర్తికి ప్రత్యేక స్థానం ఉందంటే అం దుకు సంస్కృతి, సంప్రదాయాలే కారణమని తెలిపారు. ఎక్కడ స్త్రీ గౌరవిస్తారో అక్కడ సుభిక్షత ఉంటుందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ సంస్కృతి దారితప్పుతోం దని చెప్పారు. పుట్టుకతో బిడ్డగా, వివాహ బంధంతో భార్యగా, ప్రసవంతో తల్లిగా, వృద్ధాప్యంలో అందరికి పెద్ద దిక్కుగా అనేక బాధ్యతలను మోస్తూ స్త్రీ కుటుంబాన్ని సంరక్షిస్తుం దని తెలిపారు. గౌరవ అతిథులు డా క్టర్ అశాలత, విశ్వం విద్యాసంస్థల కరస్పాండెంట్ నగరిమడుగు తులసి మాట్లాడుతూ ఆప్యాయత, అనురాగానికి స్త్రీ నిదర్శనమన్నారు. స్త్రీని గౌరవించే సమాజం మనదని తెలిపారు. పేదల విద్యార్థులకు ఆర్థిక సాయం మహిళా వేదికలో భాగంగా సేవా దృక్పథంతో ఇద్దరు పేద విద్యార్థులకు రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేజింగ్ డెరైక్టర్ ఆర్థికసాయం ప్రకటించారు. పేద విద్యార్థులు కె.వందన, మునిజ్యోతిని దత్త కు తీసుకొని, వారి ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాను అందిస్తానని ప్రకటించి తన సేవా తత్పరతను చాటుకున్నారు. అక్షయ క్ష్రేత్ర నిర్వాహకులకు అభినందన పురస్కారాలు అనుభవించడానికి ఆస్తులు, జీవి తాన్ని గడిపే సంపద ఉండి ఆదరణ కోల్పోయిన మానసిక వికలాంగుల ను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న అక్షయ క్షేత్ర నిర్వాహకులు ఎం.రామస్వామి, ఎం.వరలక్ష్మికి అభినయ ఆర్ట్స్ నిర్వాహకులు పురస్కారాలతో అభినందించారు. వారికి సంస్థ ద్వా రా పితృ దేవోభవ, మాతృదేవోభవ పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, బ్లిస్, మిక్రమ్ హోటల్స్ డెరైక్టర్ మబ్బురాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భం గా అక్షయ క్షేత్రం విద్యార్థుల నృ త్యాలు అబ్బుర పరిచాయి. -
రమాదేవి కథ సుఖాంతం....
హైదరాబాద్ : వారసుడు లేడనే నెపంతో అత్తామామ, భర్త వేధిస్తున్నారని ముగ్గురు కూతుళ్లతో న్యాయపోరాటం చేసిన రమాదేవి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. దిల్సుఖ్నగర్ వికాస్ నగర్లో అత్తింటి ముందు ఆమె ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి, ఐద్వా మహిళ సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి. మహిళ సంఘాలు బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా... పోలీసులు రమాదేవి భర్త సంతోష్, మామ ప్రకాశ్ రావు, అత్త నిర్మాలదేవిలను రప్పించారు. మహిళ సీఐ మధులత ఇరువురి అంగీకారం మేరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుని పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. మగ సంతానం లేదనే నెపంతో వేధిస్తున్నట్లు రమాదేవి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ తెలిపటం విశేషం. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : పట్టణ శివారులోని గిరిప్రసాద్‌నగర్ కాలనీ లో ఓ ఇంటిపై పోలీసులు దాడిచేసి భారీగా డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమాదేవి తెలిపారు. ఆమె కథనం ప్రకారం... పట్టణ శివారు గిరిప్రసాద్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్‌పాషా ఇంట్లో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో రూరల్ సీఐ వాసాల సతీష్, రూరల్ ఎస్సై రాజ్యలక్ష్మి సిబ్బందితో వెళ్లి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో తనిఖీ చేయగా 3,263 అల్యూమినియం ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 200 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 520 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, డేంజరస్ ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్లు 3 బాక్సులు(150), 44 వైర్ బండిళ్లు(578 మీటర్లు), 476 జిలెటిన్ స్టిక్స్, 145 పెద్ద డిటోనేటర్లు, అల్యూమినియం నైట్రేట్ 40 కేజీలు లభించాయి. దీంతో తహసీల్దార్ నూతి భాగ్యమ్మ ఆర్ఐ తిరుపతి సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ. అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచడం, ఉపయోగించడం చట్టరీత్యా నేరమన్నారు. మందుగుండు సామగ్రి ద్వారా ఇంట్లో ఉన్నవారికేగాక ఆ కాలనీవాసులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. ఆ సామగ్రి మూలంగా ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. -
అవును... నిజమే
=‘ఇందిరమ్మ’లో అధికారుల అవినీతి =పేర్లు ఎస్సీలవి... బిల్లులు బీసీలకు =ముగ్గురు డీఈలు, ఒక ఏఈ బాధ్యులు =‘సాక్షి’ కథనంపై కదిలిన యంత్రాంగం =చార్జిమెమోలు జారీ... త్వరలోనే వేటు వరంగల్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అధికారుల అవినీతి తేటతెల్లమైంది. ఏకంగా ముగ్గురు డీఈలు అవినీతి బాగోతంలో భాగస్వాములయ్యారు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు.. ఎస్సీల పేరిట బీసీలకు బిల్లులిచ్చారు. బీసీ వర్గాలకు రూ.45 వేలు బిల్లు ఉండటంతో ఎస్సీల పేరిట మార్చి వారికి రూ.65 వేలు మంజూరు చేసి... రూ.20 వేలను కలిసికట్టుగా పంచుకున్నారు. ఈ అంశాన్ని జూన్ 10న పూర్తి వివరాలతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీంతో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించారు. హసన్‌పర్తి మండలంలో అధికారులు చేపట్టిన విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సీల పేరిట బీసీల జాబితాను మార్చినా... లబ్ధిదారులకు మాత్రం కొంతే ముట్టజెప్పినట్లు వెల్లడైంది. మిగిలిన సొమ్మును అధికారులే పంచుకున్నట్లు గుర్తించారు. ఇదీ విషయం రూ.20 వేల అదనపు బిల్లుల కోసం అధికారులు.. బీసీల జాబితా ఎస్సీలుగా మార్చారు. వాస్తవంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బీసీ వర్గాలకు రూ.45 వేలు, ఎస్సీలకు రూ. 65 వేలు మంజూరు చేస్తారు. బీసీల జాబితాను ఎస్సీల జాబితాలో పెట్టారు. హసన్‌పర్తి మండలానికి చెందిన మాటేటి సుశీల, బుగ్గ సరోజన, చిదిర విజయ, చిదిర రమాదేవి, బుగ్గ రమాదేవి, బల్కూరి కల్పన, ఆలేటి కొమురమ్మ, మాచర్ల విజయలక్ష్మీ, కొత్తకొండ కనకలక్ష్మీ, కోదారి రాజకొమురమ్మ, కూర్ల సముద్రమ్మ, మాచర్ల వరలక్ష్మీ, గోపరాజు రమ్య, కందుకూరి సమ్మక్క, అరుణ, కోమల, కాళేశ్వర, లక్ష్మీ... ఇలా చాలా మందికి ఎస్సీలంటూ బిల్లులిచ్చినట్లు చూపించారు. వీరందరి పేరిట ఒక్కొక్కరిపై రూ.65 వేలు డ్రా చేసిన అధికారులు.. రూ.40 వేలే వారికి ఇచ్చారు. మిగిలిన రూ.20వేలు పంచుకున్నారు. ఎవరెవరంటే..? గృహ నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు డీఈలు ఈ అవినీతి వ్యవహారంలో పాలుపంచుకున్నట్టు విచారణలో తేలింది. అదే విధంగా అప్పట్లో హసన్‌పర్తిలో పనిచేసినఏఈ కూడా ఈ అవినీతి వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఏఈ మరికొన్ని అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్నట్లు విచారణలో గుర్తించారు. ముచ్చర్ల, జయగిరి, సీతంపేట, నాగారం, అనంతసాగర్, హసన్‌పర్తితో పాటు పలు గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టని ఇళ్లకు బిల్లులిచ్చినట్లు విచారణలో తేలింది. విచారణ నివేదికలను ఇప్పటికే గృహ నిర్మాణ సంస్థ ఎండీకి నివేదించారు. ఈ అవినీతికి పాల్పడిన వీరికి ఇప్పటికే చార్జిమెమోలను జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో వారిపై చర్యలు తీసుకోనున్నారు. ‘సాక్షి’ కథనంతో కుంభకోణంపై విచారణ చేపట్టామని, అవినీతి జరిగినట్టు విచారణలో తేలిందని వరంగల్ ఈఈ రమేష్ చెప్పారు. డీఈలు, ఏఈపై చర్యలకు సిఫారసు చేసినట్టు వివరించారు. -
హత్య కేసులో నిందితుల లొంగుబాటు
నర్సింహులపేట, న్యూస్‌లైన్ : మండలంలోని పడమటిగూడెం గ్రామంలో ఈ నెల 2న జరిగిన కాంబోజీ రాములు హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయూరు. మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి గురువారం నిందితుల వివరాలు వెల్లడించారు. అమె కథనం ప్రకారం.. పడ మటిగూడెం గ్రామానికి చెందిన చిర్ర యూకయ్య, హన్మంతు, ఉప్పలయ్య సోదరులు. వారి సోదరితో అదే గ్రామానికి చెందిన కాంబోజ రాములు వివాహేతర సంబం ధం సాగిస్తున్నాడు. అతడికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. వివాహేతర సంబంధం విషయం తెలిసి సదరు మహిళ సోదరులు పలుమార్లు రాములును హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి మాట పెడచెవిన పెట్టడంతో అతడిని మట్టుబెట్టేందుకు ముగ్గురు కలిసి పథకం పన్నారు. అక్టోబర్ 2వ తేదీ తెల్లవారుజామున రాములు బైక్‌పై పొలం వద్దకు వెళుతుండగా అప్పటికే రోడ్డుపై కాపుకాచిన ముగ్గురు అతడిని అడ్డుకుని గొడ్డళ్లతో దారుణంగా నరి కి చంపారు. అనంతరం గొడ్డళ్లను వారి పొలం వద్ద పెట్టి పరారయ్యూరు. వారి కోసం తీవ్రంగా గాలి స్తున్న క్రమంలోనే వారు పోలీసుల ఎదుట లొంగిపోయూరు. నిందితులపై రౌడీషీట్ నిందితుడు యూకయ్య మీద పీఎస్‌లో రౌడిషీట్ ఉందని, మిగతా ఇద్దరిపై కూడా ఓపెన్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. సమావేశంలో తొర్రూరు సీఐ సార్ల రాజు, ఎస్సై వై.వీ.ప్రసాద్, పీఎస్సై రవీందర్, హెడ్‌కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, రవీందర్, పీసీలు నాగేశ్వర్రావు, బుచ్చిరాజు, మోహన్, కృష్ణంరాజు, రమేష్, రవి, సురేష్, రమేష్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.