సంప్రదాయానికి దర్పణం ‘స్త్రీ’
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణాలుగా భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్న శాంతమూర్తు లు మహిళలని డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి అన్నారు. అభినయ ఆర్ట్స్ హ నుమ అవార్డ్స్ నాటక పోటీలలో భా గంగా శనివారం మహతిలో మహిళా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె చీరకట్టు, నుదుట బొట్టు, కాలిమెట్టు అనే అంశంపై ప్రసంగించారు.
ప్రపంచ దేశాలల్లో భారతీయ స్త్రీ మూర్తికి ప్రత్యేక స్థానం ఉందంటే అం దుకు సంస్కృతి, సంప్రదాయాలే కారణమని తెలిపారు. ఎక్కడ స్త్రీ గౌరవిస్తారో అక్కడ సుభిక్షత ఉంటుందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ సంస్కృతి దారితప్పుతోం దని చెప్పారు. పుట్టుకతో బిడ్డగా, వివాహ బంధంతో భార్యగా, ప్రసవంతో తల్లిగా, వృద్ధాప్యంలో అందరికి పెద్ద దిక్కుగా అనేక బాధ్యతలను మోస్తూ స్త్రీ కుటుంబాన్ని సంరక్షిస్తుం దని తెలిపారు. గౌరవ అతిథులు డా క్టర్ అశాలత, విశ్వం విద్యాసంస్థల కరస్పాండెంట్ నగరిమడుగు తులసి మాట్లాడుతూ ఆప్యాయత, అనురాగానికి స్త్రీ నిదర్శనమన్నారు. స్త్రీని గౌరవించే సమాజం మనదని తెలిపారు.
పేదల విద్యార్థులకు ఆర్థిక సాయం
మహిళా వేదికలో భాగంగా సేవా దృక్పథంతో ఇద్దరు పేద విద్యార్థులకు రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేజింగ్ డెరైక్టర్ ఆర్థికసాయం ప్రకటించారు. పేద విద్యార్థులు కె.వందన, మునిజ్యోతిని దత్త కు తీసుకొని, వారి ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాను అందిస్తానని ప్రకటించి తన సేవా తత్పరతను చాటుకున్నారు.
అక్షయ క్ష్రేత్ర నిర్వాహకులకు అభినందన పురస్కారాలు
అనుభవించడానికి ఆస్తులు, జీవి తాన్ని గడిపే సంపద ఉండి ఆదరణ కోల్పోయిన మానసిక వికలాంగుల ను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న అక్షయ క్షేత్ర నిర్వాహకులు ఎం.రామస్వామి, ఎం.వరలక్ష్మికి అభినయ ఆర్ట్స్ నిర్వాహకులు పురస్కారాలతో అభినందించారు. వారికి సంస్థ ద్వా రా పితృ దేవోభవ, మాతృదేవోభవ పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, బ్లిస్, మిక్రమ్ హోటల్స్ డెరైక్టర్ మబ్బురాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భం గా అక్షయ క్షేత్రం విద్యార్థుల నృ త్యాలు అబ్బుర పరిచాయి.