తాడేపల్లి రూరల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలో మార్పు తీసుకురావాలని ఓ భార్య ప్రాణత్యాగం చేసిన సంఘటన తాడేపల్లి పట్టణ పరిధిలోని బైపాస్‌రోడ్డులో చోటు చేసుకుంది.
- తాగుబోతు భర్తలో మార్పు కోసం భార్య ప్రాణత్యాగం
భర్తలో ఎటువంటి మార్పు రాకపోవడంతో తాను చనిపోయిన తరువాత అయినా తాగుడు మానమంటూ గత నెల 30న ఎలుకల మందు తాగింది. ప్రేమించిన భార్య తన కళ్ల ముందే పురుగుమందు తాగడంతో, ఆమెను ఎలాగైనా బతికించుకోవాలని శివారెడ్డి చుట్టుపక్కల వారి సాయంతో దగ్గరలోనే ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. పరిస్థితి విషమించడంతో గుంటూరు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కళావతి గురువారం మృతి చెందింది. చనిపోయే ముందు కూడా తాగనని భర్తతో ఒట్టేయించుకుని చనిపోయినట్టు బంధువులు తెలిపారు.