రుద్రూర్‌లో రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు
వర్ని(బాన్సువాడ) : రుద్రూర్ మండలంలోని అంగడిబజార్ ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆదివారం రాస్తారోకో చేశారు. గతనెల రోజులుగా కుళాయిలు సరిగా రాక తీవ్ర అవస్థ పడుతున్నామని వారు వాపోయారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించే వరకు కదలబోమని మొండికేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని వారిని సముదాయించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్యను సోమవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో స్థానికులు రాస్తారోకో విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment