ఇల్లందుకుంట (కరీంనగర్ జిల్లా) : మూడు నెలలుగా గ్రామంలో తాగునీరు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులను నిర్బంధించి బయట తాళం వేశారు.
ఈ సంఘటన గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం ముస్కాన్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలిసిన ఎంపీపీ ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు కార్యాలయం తాళం తీశారు.
పంచాయతీ కార్యాలయానికి తాళం
Published Thu, Aug 27 2015 3:53 PM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement