హైదరాబాద్: తాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ సర్కారుకు సఖ్యత లోపించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. కృష్ణా నదిపై కర్ణాటక ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణకు తాగు నీటి కష్టాలు తప్పవని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినా స్పందించటం లేదన్నారు.
ప్రాజెక్టుల అంశం పై కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రతిపక్షాలను కలుపుకొని పోయేలా కేసీఆర్ సర్కారు వ్యవహరించాలని సూచించారు.