హైదరాబాద్: బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసలు బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అన్న నినాదం ఏమైందంటూ కేసీఆర్‌ను పొంగులేటి ప్రశ్నించారు.
‘బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి కేసీఆర్ పెదవి విప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 11 అంశాల మీద ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ మాట్లాడారు. మరి ఇక్కడ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మోదీ వద్ద ఎందుకు మాట్లాడలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేటీఆర్ చెవిలో పువ్వులు పెట్టే మాటలు చెప్పారు. రహస్యంగా ఏం మాట్లాడుకున్నారో కానీ.. రాష్ట్ర ప్రయోజనాల గురించి అసలు మాట్లాడరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉస్మానియాకి ఘన స్వాగతం పలకాల్సింది పోయి.. అడ్డుకుంటామని అనడం ఎందుకు?, అందరం కలిసి పోట్లాడదాం అంటే కేసీఆర్ ఒక్కడే మోదీని కలిసి వస్తారు. రహస్య అజెండా.. రాజకీయ అజెండా తప్పితే కేసీఆర్‌కు మరొకటి లేదు’ అని పొంగులేటి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment