Bayyaram Steel plant
-
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా?
సాక్షి,హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని బీఆర్ఎల్సీ కవిత డిమాండ్ చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై లోక్ సభలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై కీలక వ్యాఖలు చేశారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. The Bayyaram Steel Plant is not merely a promise; it is a constitutional commitment made during the formation of Telangana. The BJP’s blatant refusal to fulfill this commitment exposes their neglect of the backward and tribal communities in Khammam District, Telangana.It is… https://t.co/uuTMbcH1oB— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 12, 2024 ‘బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు’ అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారు. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయి. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన.బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోంది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలిఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరం. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయం. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదు. బీజేపీ కేంద్రంపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
ఆ డబ్బులతో నిజాం షుగర్స్ తెరిపించండి: బండి సంజయ్ కౌంటర్
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. దీంతో, తమ వల్లే కేంద్రం స్టీల్‌ప్లాంట్‌పై ఈ నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాగా, బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొంటామన్న డబ్బుతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను తెరిపించాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ డబ్బు ఖర్చు చేయాలి అని వ్యాఖ్యలు చేశారు. -
బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు చేశారు
-
నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్నదే తమ ఆలోచన అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయిస్తోందని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ సంస్థలు బతికితేనే ప్రజలకు న్యాయం. బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదు.. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు’’ అని దుయ్యబట్టారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో స్టీల్‌ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో ఉంది. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిసారి ప్రశ్నిస్తున్నాం. సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానిని స్వయంగా కలిసి బయ్యారం స్టీల్‌ప్లాంట్ గురించి మాట్లాడా. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు, నిధులు. ఇవ్వకపోవడంతోనే నష్టాలు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి అమ్మడానికి చూస్తున్నారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విశాఖ పొట్ట కొడుతున్నది ప్రధాని మోదీనే. బయ్యారం విషయంలో కూడా అదే జరుగుతుంది. నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి. తెలుగు రాష్ట్రాలకు విరుద్ధంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని కేటీఆర్ విమర్శించారు. చదవండి: ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ -
వారే అసలైన ‘బయ్యారం’ దోషులు.. కేసీఆర్, ఆయన కుటుంబంపై కిషన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అసలైన దోషులని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 2014లో అధికారంలోకి రాగానే మోదీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆ కమిటీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదని నివేదిక ఇచ్చిందని.. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే జరిగిందని గుర్తుచేశారు. ఆ నివేదికకే కేంద్రం, బీజేపీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2018లో ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. కమిటీ కూడా ఆ ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని పేర్కొందన్నారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందన్నారు. దమ్ముంటే సొంతంగా కట్టండి... కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘కేంద్రం కట్టకపోతే మేమే బయ్యారం ఫ్యాక్టరీని కడతాం. సింగరేణి, టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో బయ్యారం ఫ్యాక్టరీని నిర్మిస్తాం. 10 నుంచి 15 వేల మందికి ఉపాధి కల్పిస్తాం’ అంటూ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకున్నారని పేర్కొన్నారు. సీఎం, ఆయన కుటుంబానికి చేతనైతే, దమ్ముంటే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని కట్టాలని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశా రు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం నిలబెట్టుకోలేకపోయారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. -
ఉక్కు పరిశ్రమ సాధించే వరకు ఉద్యమం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి, మహబూబాబాద్: బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించే వరకూ తమ ఉద్యమం ఆగదని, తెలంగాణ రాష్ట్ర సాధన తరహాలో ఉక్కు పరిశ్రమ సాధన ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఒక్కరోజు నిరసన దీక్షకు మంత్రి హాజరై మద్దతు తెలిపారు. అనంతరం దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. తెలంగాణను మోసం చేశాయన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీలను తుంగలో తొక్కారన్నారు. ఈ ప్రాంతంలోని ఇనుప ఖనిజం నాణ్యమైందని, బొగ్గు లభ్యత, రవాణా సౌకర్యం, బైరటీస్ వంటి ఖనిజాలు ఉన్న బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు నిపుణులు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన కానీ.. బీజేపీ నాయకులు కానీ.. ఈ ప్రాంతానికి వస్తే రాళ్లతో కొట్టి తరమాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఎస్సీల వర్గీకరణ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాజ్యాంగంలో సవరణ చేయాలని సూచనలు చేసిన ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించిన బీజేపీ నాయకులు.. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎందుకు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, రాములునాయక్, రేగ కాంతారావు, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. -
ఉక్కు హామీకి తుప్పు పట్టిందా..!
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కిన బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణం హామీని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. నిండు పార్లమెంట్లో ఒప్పుకున్న నిర్ణయాన్ని మోదీ సర్కారు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన విభజన హామీ ప్రకారం ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’అని గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారం విష యంలో కేంద్రం వైఖరిని ఎండగడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఉసురు తీసిన కేంద్రం.. బయ్యారంలో మొదలుకాకుండానే ఉక్కును తుప్పుగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్లాంట్ ఏర్పాటులో తాము భాగమవుతామన్నా స్పందించట్లేదని మండిపడ్డారు. పీఎంకు, కేంద్ర మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా.. దేశంలోని ఇనుప ఖనిజ నిల్వల్లో 11 శాతం బయ్యారంలోనే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయన్న ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)’సర్వే నివేదికను ప్రస్తావిస్తూ నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. బయ్యారంలో లేకపోతే అక్కడి నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లాలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడి నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణాకు ఓ స్లర్రి పైపులైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని ప్రధాని మోదీని కలిసి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఖనిజ రవాణా వ్యయంలో భాగమయ్యేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉన్నట్టు హమీ ఇచ్చినా మోదీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. తానూ పలు మార్లు కేంద్ర మంత్రులను కలసి ప్లాంట్ కోసం ప్రయత్నం చేసినా స్పందన రాలేదని విమర్శించారు. పెల్లెటైజేషన్ ప్లాంటైనా పెట్టాలని కోరాం ఛత్తీస్‌గఢ్ నుంచి బయ్యారం ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్ఎండీసీ అంగీకరించిందని కేటీఆర్ గుర్తు చేశారు. మెటలర్జికల్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ (మేకాన్) సంస్థ ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్ ప్లాంట్, స్క్రాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సానుకూల నివేదిక ఇచ్చిందన్నారు. ఎన్ఎండీసీ, సింగరేణి కాలరీస్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సానుకూలంగా ఉన్నా కేంద్రం మాత్రం ప్లాంట్ ఏర్పాటును పక్కనబెడుతోందని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రస్తుతం వీలు కాకుంటే తాత్కాలికంగా పెల్లెటైజేషన్ ప్లాంట్ పెట్టి స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కేంద్రాన్ని కోరామన్నారు. కిషన్‌రెడ్డి.. ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదంటారా? ఉక్కు పరిశ్రమపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనతో పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రానిది ‘తుక్కు సంకల్పమే’నని తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. స్టీల్ ఫ్యాక్టరీని సాధించాల్సిన కేంద్ర మంత్రే ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చేతులేత్తేయడం సిగ్గుచేటన్నారు. కిషన్ రెడ్డి మాటలు వ్యక్తిగతమా లేక కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమా తెలపాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌తో తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న వేలాది మంది గిరిజన, అదివాసీ యువకుల ఆశలకు కిషన్‌రెడ్డి ఉరేశారని విమర్శించారు. సెయిల్ ఆధ్వర్యంలోని పాత ప్లాంట్లకు రూ. 71వేల కోట్లు ‘బయ్యారం ప్లాంట్ గురించి పట్టించుకోని కేంద్రం.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలోని రూర్కెలా, బర్న్‌పూర్, దుర్గాపూర్ బొకారో, సాలెం ప్లాంట్ల విస్తరణ, ఆధునికీకరణ, గనుల కోసం దాదాపు రూ. 71 వేల కోట్లను ఖర్చు చేసింది. పాత కర్మాగారాల ఆధునికీకరణ ఆహ్వానించదగ్గదే అయినా.. రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశాక సెయిల్‌ను అప్పనంగా అమ్మేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని కేటీఆర్ ఆరోపించారు. -
‘బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో నిర్లక్ష్యం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్లాంట్ ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలపై కేంద్రానికి ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదని, ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తనకు చెప్పారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం అడిగిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్‌లో రూ.600 కోట్లతో నిర్మాణంలో ఉన్న కొత్త ఆయిల్ టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అలాగే రూ.2,321 కోట్లతో నిర్మాణంలో ఉన్న పారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్‌ను కొత్త ఆయిల్ టెర్మినల్‌కు అనుసంధానంగా ఉపయోగించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలసి కోరినట్టు దత్తాత్రేయ తెలిపారు. -
బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు నినాదం ఏమైంది?
హైదరాబాద్: బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసలు బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అన్న నినాదం ఏమైందంటూ కేసీఆర్‌ను పొంగులేటి ప్రశ్నించారు. ‘బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి కేసీఆర్ పెదవి విప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 11 అంశాల మీద ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ మాట్లాడారు. మరి ఇక్కడ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మోదీ వద్ద ఎందుకు మాట్లాడలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేటీఆర్ చెవిలో పువ్వులు పెట్టే మాటలు చెప్పారు. రహస్యంగా ఏం మాట్లాడుకున్నారో కానీ.. రాష్ట్ర ప్రయోజనాల గురించి అసలు మాట్లాడరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉస్మానియాకి ఘన స్వాగతం పలకాల్సింది పోయి.. అడ్డుకుంటామని అనడం ఎందుకు?, అందరం కలిసి పోట్లాడదాం అంటే కేసీఆర్ ఒక్కడే మోదీని కలిసి వస్తారు. రహస్య అజెండా.. రాజకీయ అజెండా తప్పితే కేసీఆర్‌కు మరొకటి లేదు’ అని పొంగులేటి విమర్శించారు. -
బయ్యారం ఉక్కు భిక్ష కాదు.. హక్కు
రాష్ట్రాల పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణం అంశాన్ని స్పష్టంగా పొందుప ర్చారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రాని ఒప్పిం చడానికి వారికి పోలవరం ప్రాజెక్ట్ హామీనిచ్చిన కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కింద నాటి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపుకు గురౌతున్నం దున ఖమ్మం జిల్లాకు ఊరడింపుగా ఉక్కు పరిశ్ర మను ఇస్తామని చట్టంలో చేర్చింది. విభజన చట్టం లోని 13వ క్లాజులో ఖమ్మం జిల్లాలో 30 వేల కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటిం చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను 6 నెలల్లో ప్రారంభిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. అప్పటినుంచి టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ కమిటీలను వేస్తూ, సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. త్వరలో బయ్యారానికి తీపి కబురు చెపుతామని కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి మీడియా ముందు ప్రకటించటం, బయ్యారం ఉక్కు పరిశ్రమకు అవసర మైన వనరులన్నీ సమకూర్చుతామని, ముడి ఖనిజం రవాణా కోసం జగదల్పూర్ నుంచి రైల్వే లైన్ నిర్మా ణానికి పరిశీలన కోసం 2 కోట్లు కేటాయించామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించడం ఇలా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వాలు 4 ఏళ్ల నాటకానికి తెర వేస్తూ తాజాగా పరిశ్రమ పెట్టే అవకాశమే లేదని స్పష్టీక రిం చారు. ఇది విభజన హామీని తుంగలో తొక్కి తెలం గాణ ప్రజలను మోసం చేయడమే. యూపీఏ ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో పొందుపర్చిన తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల నిర్మాణంపై మొదటినుండి సాకులు చెపుతూ కాలం గడుపుతూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వనరులు సమకూర్చడం లేదని, బయ్యారం ఇనుప ఖనిజంలో నాణ్యత లేదని ఉన్న ఖనిజం కూడా పరిశ్రమ నిర్విఘ్నంగా నడవడానికి సరిపోదని తదితర సాకులు చెబుతూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవమేనను కున్నా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా నుంచి నాణ్యత కలిగిన ఇనుప ఖనిజాన్ని దిగుమని చేసుకుంటామని, అందుకు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉంది. అయినా, పరిశ్రమ పెట్టడానికి అభ్యంతరమేమిటి? 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచబడిన ఉక్కు పరిశ్రమ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నదే నిజం. అప్పుడప్పుడు మాట వరసకు బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి వల్లెవేయడం తప్ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేసీఆర్, ఆయన ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసింది లేదు. పైగా సెయిల్ ముందుకు రానందున బయ్యారం స్టీల్స్‌ను జిందాల్‌కు ఇస్తామని, సిద్ధంగా ఉండమని ఆ కంపెనీ అధికారులకు మీడియా ముందే చెప్పారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరి శ్రమను ఏర్పాటు చేయకుండా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణకు చట్ట బద్ధంగా రావల్సిన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్ని స్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నది.బయ్యారం ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ, దీని కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. ఇక్కడి ఉక్కును పాలకులు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రజా ఉద్య మాల ద్వారా అడ్డుకున్న చరిత్ర ఉంది. 1 లక్షా 46 వేల ఎకరాల పరిధిలోని ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన సందర్భంలోనే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వవద్దని ప్రభుత్వ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఈ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నది. తెలంగాణ ఉద్యమ శక్తులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాల సమస్య కాదు. అది అనేక ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రానికి లభించిన చట్టబద్ధ హక్కు, దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు. ఈ హక్కు సాకారం అయ్యేవరకు ఐక్యంగా ఉద్యమించాలి. గౌని ఐలయ్య, కన్వీనర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటి, జడ్పీటీసీ ‘ 94907 00955 -
‘రాముడు తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్రాలో’
సాక్షి, హైదరాబాద్: ‘భద్రాచల రాముడు తెలంగాణలో కొలువై ఉంటే, ఆయన ఆస్తులు మాత్రం ఆంధ్రలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం రాముడి ఆస్తులున్న గ్రామాలను తెలంగాణకు ఇవ్వడానికి సుముఖంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేద’ని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాముడి ఆస్తులున్న గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ ఆయన చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్రాలు కుమ్మక్కు ‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014’లో పేర్కొన్న చట్టబద్ధమైన హామీల సాధనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సుధాకర్ రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలయ్యేలా లేవనీ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇచ్చిన వివరణ అన్యాయమని ఆయన వాపోయారు. కేసీఆర్‌కు కేంద్రానికి మధ్య ఈ ప్లాంట్ విషయంలో జరిగిన రహస్య ఒప్పందమేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బయ్యారం ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కేంద్ర, రాష్ట్రాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయడానికి తప్పించి రాష్ట్ర బీజేపీ నాయకులు ఒరగబెట్టిందేం లేదని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు గురించి ఒక్కసారైనా ప్రధాని మోదీతో మాట్లాడారా అని ప్రశ్నించారు. -
‘బయ్యారం’పై కేంద్రం సానుకూలం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ గురువారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. గతంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యమేనన్న ధృక్పథంతో ఉందన్నారు. దీనిపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ రాష్ట్ర అధికారులతో చర్చించి నెల రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్‌తోపాటు ఏపీలోని కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్‌సింగ్ చౌదరీ గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావుతో కలసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర అధికారులు కూడా పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని కేంద్ర మంత్రి సూచించినట్లు చెప్పారు. వచ్చే నెల 8న కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నారని, అప్పుడు ప్లాంట్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి బీరేందర్‌సింగ్ మాట్లాడుతూ ప్లాంట్ల ఏర్పాటుపై గతంలో అధ్యయనం జరిపిన టాస్క్‌ఫోర్స్ కమిటీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిందన్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని వివరాలను తెప్పించుకున్నామని, వాటిని అధ్యయనం చేశాక టాస్క్‌ఫోర్స్ కమిటీ నెల రోజుల్లో మళ్లీ ప్లాంట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదిక ఇస్తుందన్నారు. తెలంగాణలో పట్టణాభివృద్ధి చర్యలు భేష్... కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ కితాబు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరితో సమావేశమైన కేటీఆర్.. ఈ నెల్లో ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రోపై వివరాలందించా రు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన, బహిరంగ మలవిసర్జన రహిత మున్సిపాలిటీలుగా మార్చేందుకు తీసు కుంటున్న చర్యలతోపాటు తాగునీరు, వ్యర్థాల నిర్వహణకు అవలంబిస్తున్న విధానాల గురించి ఆయనకు వివరించారు. పట్టణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అభినందించినట్లు కేటీఆర్ మీడియాకు తెలిపారు. ఈ చర్యల గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. గల్ఫ్‌లోని తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చండి గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గురువారం సుష్మతో సమావేశమైన కేటీఆర్ ఈ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 2006లో యూఏఈలో జైలుపాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరుగురు కార్మికులను విడిపించాల్సిందిగా కోరారు. వారి క్షమాభిక్ష పిటిషన్లను కొట్టేశారని, అందువల్ల వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుష్మ సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ మీడియాకు తెలిపారు. త్వరలో ప్రధానితో కలసి అబుధాబి పర్యటనకు వెళ్తున్నానని, అప్పుడు అక్కడి అధికారులతో మాట్లాడి బాధితుల విడుదలకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారన్నారు. -
బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే నిర్ణయం
న్యూఢిల్లీ: విభజన చట్ట ప్రకారం తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర గనుల శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చౌదరి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సోమవారం బీరేంద్ర సింగ్‌తో ఢిల్లీలో సమావేశమై చర్చించారు. విభజన చట్ట ప్రకారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రికి వివరించారు. విభజన జరిగి మూడేళ్ల పూర్తైనా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఇంత వరకు పురోగతి లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడైల ఐరన్‌ఓర్ మైన్స్‌కు లింక్ చేస్తూనైనా ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని సెయిల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అనంతరం తాను ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశానాని తెలిపారు. ఈ కమిటీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సానుకూలంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. కమిటీ తుది నివేదిక అందాక హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. -
బయ్యారంలో పీపీపీ విధానంలో స్టీలు ప్లాంటు
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా బయ్యారంలో విశాఖ తరహా భారీ స్టీలు ప్లాంటు సాధ్యం కాదని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ముడి సరుకులో నాణ్యత లేనందున ఛత్తీస్‌గఢ్ తరహాలో పీపీపీ విధానంలో సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు ఉక్కు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ తన కార్యాలయానికి వచ్చిన ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో ఈ అంశంపై సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘బయ్యారంలో భారీ స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించాయి. పునర్ వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తరువాత కేంద్రం ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించి యోగ్యత అధ్యయనం చేయించింది. అయితే ఇక్కడ లభించే ఐరన్ ఓర్లో మ్యాగ్నటైట్ ఎక్కువగా ఉంది. హెమటైట్ తక్కువగా ఉంది. అందువల్ల విశాఖ తరహాలో భారీ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు యోగ్యత లేదని టాస్క్‌ఫోర్స్ తేల్చింది. దీనిపై నేడు మరోసారి ఉక్కు మంత్రితో సమీక్ష జరిపాం. ఉన్న ముడి వనరులతో పీపీపీ విధానంలో ఒక సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు సూత్ర ప్రాయ అంగీకారం తెలిపినట్టు ఉక్కు మంత్రి తెలిపారు. తగిన సర్వే చేసి ఈ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు, సెప్టెంబరులోగా ఈ నివేదిక పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. మ్యాగ్నటైట్ గల ఓర్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిషాలలో స్టీలు ప్లాంట్లు ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో బయ్యారంలో కూడా కేంద్రం, రాష్ట్రం, సెయిల్, ప్రయివేటు భాగస్వామితో కలిసి పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నాం..’ అని దత్తాత్రేయ పేర్కొన్నారు. జాతీయ రూర్బన్ మిషన్ కింద... కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కూడా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ రూర్బన్ మిషన్ కింద రంగారెడ్డి జిల్లాలోని అల్లాపూర్, మెదక్ జిల్లాలోని రాయకల్, నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపల్లి ప్రాంతాలను ఎంపిక చేశారని వివరించారు. ఆయా ప్రాంతాలకు భారీగా నిధులు దక్కనున్నట్టు మంత్రి వివరించారు. ఇదే పథకం కింద చౌటుప్పల్, కల్వకుర్తి ప్రాంతాలను చేర్చాలని విజ్ఞప్తిచేసినట్టు తెలిపారు. అలాగే యూపీఏ హయాంలో ‘పుర’ పథకం కింద వరంగల్లు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారని, ఈ పథకం రద్దయిన నేపథ్యంలో తిరిగి దీనిని పునరుద్ధరించాలని కోరినట్టు తెలిపారు. సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న సన్నూరు, అన్నారం షరీఫ్, కొలనుపాక గ్రామాలకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను అనుసంధానించాలని కోరినట్టు తెలిపారు. -
‘బయ్యారం ఉక్కు’ మరింత ఆలస్యం
బయ్యారంలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగారం ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్ర స్థాయి సర్వే నత్తనడకన సాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాలివీ.. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఖమ్మం జిల్లా బయ్యారంలో మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ద్యం కలిగిన సమీకృత ఉక్కు కర్మాగారం స్థాపనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) సుముఖత వ్యక్తం చేసింది. అయితే 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉంటేనే కర్మాగారం ఏర్పాటు సాధ్యమని సెయిల్ స్పష్టీకరించింది. దీనిపై ఏర్పాటైన జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ.. తన నివేదికలో 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం లభించడం అసాధ్యమని ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ముడి ఖనిజం లభ్యతపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. నత్తనడకన జీఎస్ఐ సర్వే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 13 బ్లాకుల పరిధిలో 340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం ఉందని మైనింగ్ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో.. 240.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణకు సరిహద్దులు నిర్ణయిస్తూ సర్వేకు అనుమతి ఇచ్చింది. మొత్తం 13 బ్లాకులుగా ఇనుప ముడి ఖనిజం లభ్యత కలిగిన ప్రాంతాలను విభజించి.. బయ్యారంలోని రెండు బ్లాకుల్లో జీఎస్ఐ క్షేత్ర స్థాయి సర్వేను పూర్తి చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు బ్లాకులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇస్తామని జీఎస్ఐ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మిగతా 11 బ్లాకుల్లో సర్వే పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2016 మార్చి నాటికే సర్వే పూర్తి చేయాల్సి ఉండగా.. తుది నివేదిక మాత్రం 2017 మార్చికి అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటులో జీఎస్ఐ నివేదికే కీలకం కావడంతో.. ప్రతిపాదనలు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. -
కేంద్రం సహకారంతో అభివృద్ధి: దత్తాత్రేయ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు గనుల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ తాను కలసినప్పుడు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరో మంత్రి జవదేకర్ బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 7,300 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం సహకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతులు ఏర్పాటుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. 13వ ఫైనాన్స్ కమిటీ ద్వారా తెలంగాణకు 3,139.46 కోట్లు రావాల్సి ఉండగా అందులో రూ. 1,112 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ. 2,027. 45 కోట్లు త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
కొత్త సీసాలో.. పాత సారాలా ఉంది: తాటి వెంకటేశ్వర్లు
బడ్జెట్లో అంకెలగారడీ తప్ప మరేమీ లేదు. కొత్తసీసాలో పాత సారా మాదిరిగా ఉంది. లక్ష కోట్ల బడ్జెట్ చూపాలనే తపన తప్ప విశ్వసనీయత, స్పష్టత లేదు. ప్రణాళిక వ్యయాన్ని 10 నెలలకే రూ.48,648 కోట్లు చూపారు. ఇది ఉమ్మడిరాష్ట్రంలో కంటే ఎక్కువ. ఇంత పెద్ద బడ్జెట్ అసాధ్యం. గిరిజన విశ్వవిద్యాలయం ఊసే లేదు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది అమరులు కాగా, 459 కుటుంబాలకే రూ.10 లక్షల చొప్పున పరిహారమిస్తామంటున్నారు. బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రస్తావనే లేదు. ఖమ్మం జిల్లా బయ్యారం స్టీల్‌ప్లాంట్ గురించి పేర్కొనలేదు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 108, 104 సర్వీసులను ఘనంగా నడిపినా.. వాటి గురించి పేర్కొనలేదు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. దళితులతోపాటు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు. వీటిని గురించిన ప్రస్తావనలేదు. వివిధ మార్గాల్లో ప్రభుత్వ ఆదాయం ఎంత వస్తుంది, ఎందులో ఎంత ఉంది, ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారో చెప్పనేలేదు. గోరంతను కొండంత చేసి చూపించారు. సాధారణ స్థాయికి మించి భారీగా భూముల అమ్మకం ద్వారా, కేంద్రం ద్వారా డబ్బు వస్తుందని చెబుతున్నారు. వచ్చే 4 నెలల్లో భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ద్వారా అంతస్థాయిలో ఆదాయాన్ని సాధించే పరిస్థితి లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగక కొనుగోళ్లు తగ్గాయి. వైఎస్సార్ హయాంలోనే రియల్ ఎస్టేట్ బూమ్ ఉండగానే రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.4 వేల కోట్లే వచ్చింది. తెలంగాణకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశమే లేదు. ఛత్తీస్‌గఢ్‌నుంచి విద్యుత్ ఎలా వస్తుందనేది తెలియదు. విద్యుత్ సమస్య కారణంగా 400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ప్రభుత్వానికి హైదరాబాద్‌పై దృష్టి తప్ప గ్రామీణప్రాంతాలపై ధ్యాసే లేదు. విద్యుత్ సమస్యను ఎలా అధిగమిస్తారో చెప్పలేదు. భూమి కొనుగోలుకు వెయ్యి కోట్లు కేటాయించారు. ఒక ఎకరం కూడా భూమిలేనివారు పది లక్షలమంది ఉన్నారు. వారికి భూమి కొనాలంటే 10 లక్షల ఎకరాలకు రూ. 50 వేల కోట్లు కావాలి. వారందరికీ ఇవ్వాలంటే 50 ఏళ్లు పడుతుంది. బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులు తప్ప వాస్తవికత లేదు. లక్ష కోట్లకు పైబడిన బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం నిధుల సేకరణ విషయంలో వాస్తవికత లేదు. ఖమ్మం జిల్లాలోని 7 పోలవరం ముంపు మండలాలకు (ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినవి) ఉదారంగా కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. వారంతా తెలంగాణవాళ్లే. నా సొంత గ్రామం కూడా అక్కడే ఉంది. అక్కడి వారు తెలంగాణకే, తనకే ఓటువేశారు. ఆ మండలాల్లోని ఉద్యోగులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారినీ తెలంగాణకు తీసుకురావాలి.’ మంత్రి హరీశ్‌రావు స్పందన.. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు కలుగజేసుకుని 7 మండలాలు తెలంగాణలోనే ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో లేఖ రాయించాలని అన్నారు. ఈ అంశంపై మీ పార్టీ విధానం ఏమిటో చెప్పాలన్నారు. జగన్, చంద్రబాబు, అందరూ కలిసి ఈ మండలాలను అక్కడ కలిపారని, ఎందుకు కలపమన్నారో జగన్‌ను అడగాలని ప్రశ్నిం చగా.. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పందిస్తూ సభలో లేని వ్యక్తి గురించిమాట్లాడడడం సరికాదన్నారు. అంతకు ముందు వైఎస్సార్ పాలన ప్రస్తావన తెచ్చి తాటి మాట్లాడుతున్నపుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కలుగజేసుకుని వైఎస్సార్ పేరు ఎత్తే నైతికహక్కు లేదంటూ వ్యాఖ్యానించారు.