హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు గనుల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ తాను కలసినప్పుడు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరో మంత్రి జవదేకర్ బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 7,300 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం సహకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతులు ఏర్పాటుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. 13వ ఫైనాన్స్ కమిటీ ద్వారా తెలంగాణకు 3,139.46 కోట్లు రావాల్సి ఉండగా అందులో రూ. 1,112 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ. 2,027. 45 కోట్లు త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
కేంద్రం సహకారంతో అభివృద్ధి: దత్తాత్రేయ
Published Sun, Feb 8 2015 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement