సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. దీంతో, తమ వల్లే కేంద్రం స్టీల్‌ప్లాంట్‌పై ఈ నిర్ణయం తీసుకుందని బీఆర్‌ఎస్ నేతలు ఓవరాక్షన్ చేశారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాగా, బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొంటామన్న డబ్బుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను తెరిపించాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ డబ్బు ఖర్చు చేయాలి అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment