రాహుల్‌.. ప్రధాని కావడం కలే: బండి సంజయ్‌ | Central Minister Bandi Sanjay Interesting Comments Over Rahul gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌.. ప్రధాని కావడం కలే: బండి సంజయ్‌

Published Fri, Nov 1 2024 5:23 PM | Last Updated on Fri, Nov 1 2024 6:03 PM

Central Minister Bandi Sanjay Interesting Comments Over Rahul gandhi

సాక్షి, బెజ్జంకి: రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు.. అది ఆయన కల మాత్రమే అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ పాదయాత్ర చేస్తాను అనడం హాస్యాస్పదం అంటూ సెటైర్లు వేశారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌ నేడు బెజ్జంకిలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుపుతున్నాయి. మూసీ ప్రక్షాళన పేరిట లక్షా యాభై వేల కోట్లను ఖర్చు పెట్టే కంటే కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేస్తే బాగుండేది. రేవంత్ రెడ్డి ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తాడు?.

ప్రజాసమస్యలు పట్టించుకోకుండా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి మోదీపై యుద్ధం చేస్తాడట రేవంత్. రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేడు. అది కేవలం కల మాత్రమే. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదు. జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే హిందూ ఆలయాలు, హిందువులుపైనే దాడులు జరుగుతాయి. కేటీఆర్ పాదయాత్ర చేస్తాను అనడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ ఇప్పుడు నాయకుడు లేని నావలా నడుస్తోంది అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement