సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్నదే తమ ఆలోచన అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయిస్తోందని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ సంస్థలు బతికితేనే ప్రజలకు న్యాయం. బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదు.. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు’’ అని దుయ్యబట్టారు.
‘‘తెలుగు రాష్ట్రాల్లో స్టీల్‌ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో ఉంది. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిసారి ప్రశ్నిస్తున్నాం. సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానిని స్వయంగా కలిసి బయ్యారం స్టీల్‌ప్లాంట్ గురించి మాట్లాడా. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు, నిధులు. ఇవ్వకపోవడంతోనే నష్టాలు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి అమ్మడానికి చూస్తున్నారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘విశాఖ పొట్ట కొడుతున్నది ప్రధాని మోదీనే. బయ్యారం విషయంలో కూడా అదే జరుగుతుంది. నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి. తెలుగు రాష్ట్రాలకు విరుద్ధంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని కేటీఆర్ విమర్శించారు.
చదవండి: ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment