సీఎం కేసీఆర్‌పై మోదీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ | KTR Tweet On Modi Comments Over KCR At Nizamabad | Sakshi
Sakshi News home page

మేం మోసగాళ్లం కాదు.. పోరాట యోధులం: మంత్రి కేటీఆర్‌

Published Wed, Oct 4 2023 11:17 AM | Last Updated on Wed, Oct 4 2023 1:47 PM

KTR Tweet On Modi Comments Over KCR At Nizamabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా బీఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. వాస్తవానికి ఒక్క కేసీఆర్‌ను ఓడించేందుకు సిద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చింది ప్రతిపక్షాలేనని విమర్శించారు. నిజామాబాద్‌ సభలో కేసీఆర్‌ ఎన్డీయేలో చేరేందుకు ప్రయత్నించాడంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. 

2018లో జూటా పార్టీ అయిన బీజేపీ తమ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ ద్వారా బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు మధ్యవర్తులను పంపిందని ప్రస్తావించారు. ఢిల్లీ అధికారుల ఆమోదం లేకుండానే ఈ ఆఫర్‌ వచ్చి ఉంటుందా అని ప్రశ్నించారు. వచ్చిన మరు క్షణంలోనే ఆ ఆఫర్‌ను బీఆర్‌ఎస్‌ తిరస్కరించిందని తెలిపారు. మతిమరుపుతో కథలు అల్లుతున్న రాజకీయ పర్యాటకులు ఈ విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.

105 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీతో బీఆర్‌ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకోవాలని కేటీఆర్‌ నిలదీశారు. సొంతంగా గెలిచే బలం బీఆర్‌ఎస్‌కు ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు అవమసరం ఏముందని ప్రశ్నించారు.  తాము మోసగాళ్లం కాదని, పోరాట యోధులమని పేర్కొన్నారు. ఈ మేరకు అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేసిన ప్రకటన క్లిప్‌లను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 
చదవండి: మోదీ తీన్‌మార్‌.. కేసీఆర్‌ మౌనం కరెక్టేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement