సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్లలో ప్రగతిభవన్, సచివాలయంలో ప్రతిపక్షాలకు కలిసే అవకాశమివ్వని సీఎంగా కేసీఆర్ రికార్డుకెక్కారని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ, భద్రాచలానికి సంబంధించి ఆ 4గ్రామాలను రాష్ట్రంలో కలపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదన్నారు.
ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై మంత్రివర్గం ఆమోదించాలని కోరారు. ఉద్యమంలో 1,200 మంది చనిపోతే 500 మందిని మాత్రమే గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 ఉద్యమ నాయకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సంకుచిత మనస్తత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఆ విషయంలో సీఎంగా కేసీఆర్ రికార్డు: పొంగులేటి
Published Thu, Sep 6 2018 2:34 AM | Last Updated on Thu, Sep 6 2018 2:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment