
నీటి సమస్య పరిష్కరించాలంటూ వంగవీటి ధర్నా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు..ప్రజలకు గుక్కెడు నీళ్లువ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా అన్నారు. నగరంలో మంచినీటి సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ గుణదలలో గురువారం ఉదయం ఆయన ధర్నా చేపట్టారు.
ప్రజలకు తాగునీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వంగవీటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి చేపట్టిన ధర్నా కార్యక్రమానికి వామపక్షాలు మద్దతు తెలిపాలి. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, నగర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.