ఆపసోపాలు | Power Department selection posts of junior Tests | Sakshi
Sakshi News home page

ఆపసోపాలు

Published Thu, Jul 31 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

ఆపసోపాలు

ఆపసోపాలు

 సాక్షి, ఏలూరు:విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు ఎంపిక పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు 214 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పరీక్షలో భాగంగా సిమెంట్, ఐరన్ విద్యుత్ స్తంభాలు ఎక్కాల్సి రావడంతో అభ్యర్థులు ఆపసోపాలు పడ్డారు. మీటర్ రీడింగ్, సైక్లింగ్ వంటి పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసిన వారిలో కొం దరు స్తంభాలు ఎక్కడంలో విఫలమై ఉద్యోగానికి అర్హత కోల్పోయారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)లో జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి తుది పరీక్షలు బుధవారంనుంచి ఆగస్టు 13 వరకూ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 310 జేఎల్‌ఎం పోస్టులు ఉండగా, 3,539 మందికి కాల్ లెటర్స్ పంపించారు. వట్లూరులోని ఈపీడీసీఎల్ జిల్లా స్టోర్స్ పక్కన గల పోల్ తయారీ సెంటర్లో ఎంపిక పరీక్ష ప్రారంభమైంది.
 
 12 వీడియో కెమెరాలతో ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించారు. అభ్యర్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ మెషిన్ ఉపయోగించారు. ఎంపికలో భాగంగా అభ్యర్థులు 8మీటర్ల సిమెంట్ స్తంభం, 30 అడుగుల ఇనుప స్తంభం ఎక్కాలి. సైకిల్ తొక్కి చూపించాలి. ఎలక్ట్రానిక్ మీటర్, మెకానికల్ మీటర్లలో రీడింగ్ తీయాలి. సైకిల్ తొక్కడం, మీటర్ రీడింగ్ తీయడం వరకూ అందరూ బాగానే చేయగలిగినప్పటికీ స్తంభాలు ఎక్కాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆపసోపాలు పడ్డా రు. కొందరు మధ్యవరకూ వెళ్లి దిగిపోయారు. మరి కొందరు కిందకు దిగేందుకు ఇబ్బందిపడ్డారు. ఐరన్ స్తంభాన్ని సులభంగా ఎక్కగలిగినవారు సిమెంట్ స్తంభం విషయంలో ఇబ్బంది పడ్డారు.
 
 ఫలితాలు చివరి రోజునే : మొదటి రెండు రోజులు రోజు కు 250 మంది చొప్పు న ఎంపికకు పిలిచామని, 36 మంది గైర్హాజరయ్యారని ఏలూరు (ఆపరేషన్స్) సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ తెలిపారు. మూడో రోజు నుంచి రోజుకు 300 మందికి పరీక్షలు నిర్వహిస్తామని, చివ రి రోజు పరీక్షలు  ముగిసిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామన్నారు.  ఈపీడీసీఎల్ డెరైక్టర్ (ఆపరేషన్స్) పి.రామ్మోహన్, సీజీఎం (ఎనర్జీ ఆడిట్) ఓ.సింహాద్రి పరిశీలకులుగా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement