విజయనగరం మున్సిపాలిటీ: ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని పలువురు ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. ఈ మేరకు సంస్థ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సర్కిల్ పరిధిలోని పలువురు ఏఈలు, ఏఈడీలకు స్థానం చలనం తప్పలేదు. గతంతో పోలిస్తే ఈసారి నిర్వహించిన బదిలీలు పారదర్శకంగా జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ సిఫార్సులు, విద్యుత్ ఉద్యోగుల సంఘాల సిఫార్సులకు తావులేకుండా బదిలీలు జరిగినట్లు సమాచారం.
బదిలీ అయిన వారిలో విజయనగరం పట్టణ పరిధిలో ఏఈలుగా విధులు నిర్వహిస్తున్న వారు అధికంగా ఉన్నారు. ఇక్కడ డి-3 ఏఈగా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్‌కు ఇచ్ఛాపురం బదిలీ చేయగా ఆయన స్థానంలో విశాఖ గాజువాకలో గల ఎన్‌ఎస్‌టీఎల్ నుంచి డి.వి.ఎల్.కుమార్‌ను నియమించారు. నెల్లిమర్ల స్టోర్స్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న రామారావును గాజువాక పరిధిలోని మిందికి బదిలీ చేయగా విజయనగరం పట్టణంలోని డి-1 ఏఈగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తికి రాజమండ్రి సర్కిల్‌కు బదిలీ అయింది.
డి-5 ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న భీమరాజుకు శ్రీకాకుళం జిల్లా పోలాకి ఏఈగా నియమించగా ఆయన స్థానంలో డెంకాడ మండల ఏఈగా విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ను నియమించారు. డెంకాడ మండల ఏఈగా విశాఖ జిల్లా రావికమతం ఏఈని నియమించారు. పార్వతీపురం రూరల్ ఏఈ గేదెల సూర్యనారాయణ రాజమండ్రి సర్కిల్‌కు బదిలీ అయ్యారు. జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం ఏఈల్లో ఒకరిని నెల్లిమర్ల ట్రాన్స్‌ఫార్మర్స్ ఏఈగా, మరొకరిని కనస్ట్రక్షన్ విభాగంలో టెక్నికల్ ఏఈగా నియమించారు. విజయనగరం సర్కిల్ ఆఫీసులో ఏఈగా విధులు నిర్వహిస్తున్న నళినిని కనస్ట్రక్షన్‌గా ఏఈగా బదిలీ చేశారు.
ఇప్పటివరకు టెక్నికల్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న కె.ఎస్.పి.కుమార్‌ను సర్కిల్ పరిధిలోనే సిటీ మీటర్స్ ఏడీఈగా నియమించారు. సిటీ మీటర్స్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న జి.యజ్ఞేనేశ్వరరావును సింహాచలంలోని స్టోర్స్ ఏడీఈగా బదిలీ చేశారు. డీపీఈ విభాగంలో ఏడీఈగా పనిచేస్తున్న మురళీకృష్ణను విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం డీపీఈ విభాగానికి, నెల్లిమర్ల ఏడీఈ ఎం.సుదర్శనరావును విశాఖపట్నం ప్లానింగ్ ఏడీఈగా బదిలీ చేశారు. సింహాచలం స్టోర్స్ ఏడీఈ కె.వెంకటరామ్‌గోపాల్‌రెడ్డిని విజయనగరం కమర్షియల్ ఏడీఈగా, గాజువాగ ఈపీఐ విభాగంలో విధులు నిర్వహిస్తున్న విడివి.రామకృష్ణరావును నెల్లిమర్ల ఎస్‌పీఎం ఏడీఈగా బదిలీ చేశారు. శ్రీకాకుళం ఏడీఈ కె.విష్ణుమూర్తిని విజయనగరం డీపీఈ ఏడీఈగా నియమించారు.
ఉద్యోగుల బదిలీలు పూర్తి
విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రక్రియకు ఎట్టకేలకు అధికారులు ముగింపు పలికారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సంస్థ సీఎండీ రేవు ముత్యాలరాాజు నియమించిన కమిటీ సభ్యులు బదిలీల జాబితాను ప్రకటించారు. కమిటీ అధ్యక్షునిగా చీఫ్ జనరల్ మేనేజర్ ఓ.సింహాద్రి, సభ్యులుగా సర్కిల్ ఎస్‌ఈ జి.చిరంజీవిరాావు, టెక్నికల్ డీఈ ఎల్.దైవప్రసాద్, సీనియర్ అకౌంట్స్ అధికారి జి.వెంకటరాజు వ్యవహరించారు. వీరు 8 మంది జూనియర్ అకౌంట్స్ అధికారులు, 16 మంది సీనియర్ అసిస్టెంట్లు 21 మంది జూనియర్ అసిస్టెంట్‌లు, 16 మంది సబ్‌ఇంజినీర్‌లను బదిలీ చేశారు. విజయనగరం డివిజనల్ ఇంజినీర్ ప్రసాద్ ఆరుగురు లైన్‌ఇన్‌స్పెక్టర్లు, 21 మంది లైన్‌మెన్‌లు, 12 మంది అసిస్టెంట్ లైన్‌మెన్‌లు, ఐదుగురు జూనియర్‌లైన్‌మెన్‌లను బదిలీ చేశారు. అలాగే బొబ్బిలి డివిజనల్ ఇంజినీర్ పలువురు లైన్‌ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్‌లు, అసిస్టెంట్‌లైన్‌మెన్‌లు, జూనియర్ లైన్‌మెన్‌లను బదిలీ చేశారు.
విద్యుత్ శాఖలో భారీగా బదిలీలు
Published Mon, Jun 1 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement