
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం అయ్యింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చేసేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశామని ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌లో 24 గంటలపాటు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటికప్పుడు ఇంజినీర్లు, సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరెంటు స్తంభాలు, వైర్లు తెగిపడిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియాజేయాలని ప్రభాకర్ రావు సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలనీలు, రహదారుల వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలను తాకవద్దని ఆయన తెలిపారు. నగరాలు, పట్టణాల్లో అపార్ట్‌మెంట్ సెల్లర్లలోకి నీరు చేరితే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని ప్రభాకర్‌రావు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment