ప్రాణాలు హరీ | Harry lives | Sakshi
Sakshi News home page

ప్రాణాలు హరీ

Published Sun, Aug 3 2014 4:04 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Harry lives

సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో విద్యుత్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 2012-13 సంవత్సరంలో 113 మంది మృత్యువాతపడగా 27 పశువులు చనిపోయాయి. 2013-14లో 112 మంది ప్రాణాలు కోల్పోగా, 10పశువులు, ఇతర జంతువులు మృతిచెందాయి. ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు 45 మందికి పైగా విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. దశాబ్దాల కాలం నాటి విద్యుత్‌లైన్లు, వైర్లను మార్చకపోవడం, ఇళ్లమధ్యనే విద్యుత్‌లైన్లు ఉంచడం, పాతకాలం నాటిస్తంభాలు ఒరిగిపోవడం, సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్ సక్రమంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జిల్లాలో 130కేవీ సామర్థ్యం కలిగినవి 20 విద్యుత్ సబ్‌స్టేషన్ స్టేషన్లు ఉన్నాయి. 220 కేవీ కలిగిన స్టేషన్లు ఐదు, 400 కేవీ సామర్థ్యం కలిగిన ఒక సబ్‌స్టేషన్ ఉంది. వీటికింద 33/11 కేవీ విద్యుత్ వాడకం కలిగిన 269 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు 55,232 ఉన్నాయి. ఇందులో త్రీఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు 36,176 కాగా, గృహఅవసరాల కోసం ఏర్పాటుచేసిన సింగల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు సుమారు 19,056 వరకు ఉన్నాయి. జిల్లాలో 51వేల కిలోమీటర్ల పొడవు విద్యుత్‌లైన్  ఉంది.
 
 నిధులున్నా నిరూపయోగమే..!
 ఇందులో 30, 40 ఏళ్ల నాటి విద్యుత్‌లైన్, వైర్లను మార్చాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ ఏటా పెండింగ్‌లోనే ఉంటోంది. జిల్లాలో విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలు తీర్చేందుకు విద్యుత్ కార్పొరేషన్ రూ.100 కోట్లు విడుదలచేసింది. వీటిలో 33 కేవీ సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.15.26కోట్లు, గ్రామ, మండల కెపాసిటర్లు పెంచుకోవడం, అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.31.33కోట్లు మంజూరయ్యాయి.
 
 అలాగే ఓవర్‌లోడ్ , పాతబడిన లైన్లను పునరిద్ధంచడం కోసం రూ.16 కోట్లు, కెపాసిటర్లు అమర్చుకోవడానికి రూ.4.73కోట్లు, సబ్‌స్టేషన్ల నిర్వహణ కోసం మరో రూ.15కోట్లు మంజూరయ్యాయి. అయితే ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులను నత్తనడకన కొనసాగుతున్నాయి. దీనికితోడు చాలా గ్రామాల్లో కొక్కెలు తగిలించుకోవడం, ఎర్తింగ్ లేకపోవడంతో హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ క్రమంలో  నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి.
 
 వీధిన పడుతున్న కుటుంబాలు..
 తరుచూ విద్యుత్ ప్రమాదాలతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. ఈ క్రమంలో వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ ఇంట్లో బట్టలు ఆరవేయబోయి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచింది. దీంతో ఆ ఇంటికి ఉన్న ఏకైక పెద్దదిక్కును కోల్పోయారు.
 
 అలాగేనాగర్‌కర్నూల్ మండలం చందుబట్ల గ్రామానికి చెందిన కాకునూరు బాలనాగయ్య కొత్త ఇంటికి నీళ్లు పట్టేందుకు మోటర్ ఆన్‌చేయబోగా కరెంట్‌షాక్‌కు గురై మృతిచెందాడు. దీంతో ఆయన ఇద్దరు పిల్లలు, భార్య పెద్దదిక్కును కోల్పోయారు. ఇలా ఎన్నోమంది రోడ్డునపడ్డారు. ఇంత జరిగినా ట్రాన్స్‌కో మాత్రం అరకొర సాయంతోనే సరిపెట్టుకుంటోంది. అరకొర సాయం అందించి చేతు లు దులుపుకుంటోంది. ఇలా చాలామేరకు కేసు లు పెండింగ్‌లో ఉన్నా యి. విద్యుత్‌షాక్‌కు గు రై మరణిస్తేనే రూ.లక్ష పరిహారం ఇస్తున్నారు. అదే అంగవైకల్యం కలిగిన వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement