
పైసలిస్తారా? పవర్ ఆపేయాలా?
తెలంగాణకు ఏపీ జెన్‌కో ఎండీ లేఖ..
సాక్షి, అమరావతి: విద్యుత్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ తెలంగాణకు ఏపీ జెన్‌కో ఎండీ బుధవారం లేఖ రాశారు. బకాయిలు నెలా ఖరులోగా చెల్లించాలని, లేకుంటే విద్యుత్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు. అవసరమైతే చట్టపరమైన చర్యలకూ వెనుకాడేది లేదన్నారు.
రోజూ పది మిలియన్ యూనిట్లు ఏపీ నుంచి తెలంగాణకు అదనంగా విద్యుత్ వెళ్తోంది. దీనికి తెలంగాణ సంస్థలు 2014 నుంచి ఇప్పటి వరకు రూ.4,800 కోట్లు చెల్లించాలని ఏపీ లెక్కతేల్చింది. ఇందుకు తెలంగాణ అభ్యంతరం తెలపగా.. సంప్రదింపుల తర్వాత తెలంగాణ రూ.3,200 కోట్లు ఇవ్వాలని నిర్ణయానికొచ్చారు. అయినా చెల్లించకపోవడంతో ఈనెల 31 వరకు గడువిచ్చి.. తర్వాత సరఫరా నిలిపివేయాలని ఏపీ సంస్థలు నిర్ణయించాయి.