గ్రేటర్‌లో వీధిదీపాల వెలుగులు | Street Lights In Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో వీధిదీపాల వెలుగులు

Published Sat, Feb 9 2019 10:20 AM | Last Updated on Sat, Feb 9 2019 10:20 AM

Street Lights In Hyderabad - Sakshi

ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో వెలుగుతున్న ఎల్‌ఈడీ లైట్లు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ వెలిగిపోతోంది. నగరంలో గల 4,19,500 ఎల్‌ఈడీ లైట్లన్నింటిని పూర్తిస్థాయిలో వెలిగేలా జీహెచ్‌ఎంసీ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ సత్ఫలితాలిచ్చింది. దాదాపు 98 శాతం వీధిలైట్లు వెలుగుతున్నాయి. నగరంలో స్ట్రీట్‌ లైట్లు వెలగడం లేదని ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తీవ్రంగా స్పందించారు. ఇటీవల జరిగిన స్టాండింగ్‌ కమిటీలో కూడా ఇదే సమస్యను సభ్యులు లేవనెత్తారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న 4,19,500 స్ట్రీట్‌ లైట్లన్నింటిని తనిఖీ చేసి ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో, ఎన్ని వెలగలేదో అనే అంశంపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్‌ విభాగం, ఎల్‌ఈడీ లైట్లను చేపట్టిన ఈఈఎస్‌ఎల్‌ సంస్థను కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ ఆదేశించారు. గత వారం జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్‌ విభాగం ఇంజనీర్లు, ఈఈఎస్‌ఎల్‌ అధికారులు సంయుక్తంగా నగరంలోని విద్యుత్‌ దీపాలపై సునామీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 20,450 లైట్లు వెలగడంలేదని గుర్తించారు. స్ట్రీట్‌ లైట్లను మానిటరింగ్‌ చేసేందుకు 26,000 కమాండ్‌ కంట్రోల్‌ స్విచ్‌ సిస్టమ్‌ (సీసీఎంఎస్‌)లకుగాను 25,860 పనిచేస్తున్నట్టు గుర్తించారు. నగరంలో 35 వాట్స్, 75 వాట్స్, 110 వాట్స్, 190 వాట్స్‌ గల వీధిదీపాలు ఉన్నాయి.

వంద శాతం...
నగరంలో వంద శాతం స్ట్రీట్‌ లైట్లు వెలిగేలా చర్య లు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్, అడిషనల్‌ కమిషనర్‌ శృతిఓజాలు జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ విభాగం ఇంజనీర్లు, ఈఈఎస్‌ఎల్‌ ప్రతినిధులు, కాంట్రాక్టర్లతో ఇటీవల సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ వెలగని 20,450 స్ట్రీట్‌ లైట్లను గుర్తించి సోమ, మంగళ, బుధవారాల్లో కొత్త లైట్ల ఏర్పా టు, విద్యుత్‌ లైన్లలో లోపాలను సవరించడం, స్ట్రీట్‌ లైట్ల మానిటరింగ్‌ చేసే సీసీఎంఎస్‌ బాక్స్‌లను పునరుద్ధరించడం, ప్రతిరోజు జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ విభాగం సిబ్బంది, ఇంజనీర్లు తనిఖీలు చేపట్టడంతో రికార్డు స్థాయిలో 98 శాతం దీపాలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో వెలుగులు పంచుతున్నా యి. కేవలం అధికారులు అందించిన లెక్కలపైనే ఆధారపడి ఉండకుండా తమ ప్రాంత ంలో లైట్లన్నీ పూర్తిస్థాయిలో వెలుగుతున్నాయని, సంబ ంధిత వార్డుకు చెందిన కార్పొరేటర్‌ చే లిఖితపూర్వకంగా లేఖలను స్వీకరిస్తున్నారు. సీసీఎం ఎస్‌ బోర్డులు కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం తో హైదరాబాద్‌ నగరంలో వెలిగే లైట్ల వివరాలన్నిం టిని నగరవాసులు తమ మొబైల్‌లో కూడా స్వయ ంగా తెలుసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఎల్‌ఈడీ లైట్ల అతిపెద్ద కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో 4.20 లక్షల ఎల్‌ఈడీ లైట్లను అమర్చే అతిపెద్ద ప్రక్రియ 2017 జూలై మాసంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ చేపట్టింది. స్ట్రీట్‌ లైట్లు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 4,20,000 విద్యుత్‌ దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం ద్వారా సంవత్సరానికి 162.15 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.115.13 కోట్ల విద్యు త్‌ బిల్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. దీంతో పాటు సంవత్సరానికి 1,29,719 టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదల కూడా తగ్గనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement