Man Receives Electricity Bill Of 6.69 Lakh Rupees In Mancherial - Sakshi
Sakshi News home page

వామ్మో.. ఇంటి కరెంటు బిల్లు రూ.6.69 లక్షలు

Published Tue, Jun 22 2021 4:43 AM | Last Updated on Tue, Jun 22 2021 10:09 AM

Rs Six Lakh Power Charge Generated To A House In Mancherial - Sakshi

మంచిర్యాల అగ్రికల్చర్‌: ఓ ఇంటి యజమాని ఏకంగా రూ.6.69 లక్షలు కరెంట్‌ బిల్లు చూసి బెంబేలెత్తిపోయాడు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్‌కు చెందిన ముప్పుడి రాజేందర్‌ ఇంటికి సోమవారం బిల్‌ రీడర్‌ వచ్చాడు. మీటర్‌ నంబరు 63118–55668 రీడింగ్‌ నమోదు చేయగా.. ఇందులో 42 రోజుల వ్యవధికి 70,188 యూనిట్లు వినియోగానికి గాను రూ.6,69,117 బిల్లు అందజేసి వెళ్లిపోయాడు. దీన్ని చూసి రాజేందర్‌ నిర్ఘాంతపోయాడు. గత నెల 5న రూ.2,528 బిల్లు చెల్లించాడు. ఎలాంటి పెండింగ్‌ బిల్లూ లేదు. ఈ విషయమై సీనియర్‌ అకౌంటెంట్‌ శ్రీనివాస్‌ స్పందిస్తూ.. అధికంగా బిల్లు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, మీటర్‌ రీడింగ్‌ను మరోసారి పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement