one house
-
ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్..
Man With 8 Wives In Thailand: సాధారణంగా ఒక వ్యక్తి ఒక మహిళనే పెళ్లాడటాన్ని సమాజం, చట్టం అంగీకరిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో భర్త లేదా భార్యకు తెలీయకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం వంటివి జరుతున్నాయి. అయితే ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక వీరందరిని ప్రేమించి మనువాడటం విశేషం. అంతేనా.. ఎనిమిదిమంది భార్యలతో ఎలాంటి గొడవలు లేకుండా ఒకే ఇంటిలో ఎంచక్కా కాపురం కూడా చేస్తుండటం మరో విశేషం. థాయ్‌లాండ్‌కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ అనే టాటూ ఆర్టిస్ట్ తన ఎనిమిది మంది భార్యలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటిలో నాలుగు బెడ్ రూములు ఉండగా.. ఒక్కో గదిలో ఇద్దరు భార్యల చొప్పున ఎనిమిది మందితో కాపురం చేస్తున్నాడు. ఇటీవల తన వైవాహిక జీవితం గురించి ఓ టీవీ షోలో మాట్లాడాడు. ఈ షోలో సోరోట్ తన భార్యలను పరిచయం చేస్తూ, వారిని ఎలా కలిశారో వివరించాడు. చదవండి: Winter Olympic: గాల్వాన్‌లో మారణహోమానికి పాల్పడిన వ్యక్తి టార్బ్ బేరరా..? తన మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో చూసి ప్రేమించానని తరువాత ఆమెను వివాహం చేసుకున్నానని చెప్పిన ఓంగ్..తన రెండో భార్యను మార్కెట్లోను, మూడో భార్యను హాస్పిటల్లో.. నాలుగు, అయిదు, ఆరో భార్యలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్‌లలో చూసి ప్రేమించినట్లు తెలిపాడు. ఇక తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్లినప్పుడు ఏడో భార్యను చూసి ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు. ఇక నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు.. తన ఎనిమిదో భార్యను చూసి ఇష్టపడి అక్కడే పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొచ్చానని చెప్పాడు. చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో! అంతేగాక తమది ఎంతో అన్యోన్య దాంపత్యమని, తన భార్యలు అందరు తనకు సమానమేనని..తన ప్రేమను అందరికి ఒకేలా పంచుతానని చెబుతున్నాడు.అంతేకాదు నా భార్యలు చాలా అందమైనవారని, ఎంతో మంచివారని తెలిపాడు. తనను ఎంతో అపురూపంగా..ప్రేమగా చూసుకుంటారని చెబుతూ తెగ మురిసిపోయాడు. ఓంగ్ తన భార్యలు, ప్రేమ గురించి ఎంతో సంతోషంగా చెబుతుంటే ఈ వీడియోను చూసిన నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ఈ రోజుల్లో ఒక భార్యతోనే వేగడం కష్టమనుకుంటే ఎనిమిది మందిని పెళ్ళి చేసుకోవడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మంటల్లో లారీ.. ప్రాణాలకు తెగించి రియల్ హీరో అయ్యాడు -
వామ్మో.. ఇంటి కరెంటు బిల్లు రూ.6.69 లక్షలు
మంచిర్యాల అగ్రికల్చర్: ఓ ఇంటి యజమాని ఏకంగా రూ.6.69 లక్షలు కరెంట్ బిల్లు చూసి బెంబేలెత్తిపోయాడు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్‌కు చెందిన ముప్పుడి రాజేందర్ ఇంటికి సోమవారం బిల్ రీడర్ వచ్చాడు. మీటర్ నంబరు 63118–55668 రీడింగ్ నమోదు చేయగా.. ఇందులో 42 రోజుల వ్యవధికి 70,188 యూనిట్లు వినియోగానికి గాను రూ.6,69,117 బిల్లు అందజేసి వెళ్లిపోయాడు. దీన్ని చూసి రాజేందర్ నిర్ఘాంతపోయాడు. గత నెల 5న రూ.2,528 బిల్లు చెల్లించాడు. ఎలాంటి పెండింగ్ బిల్లూ లేదు. ఈ విషయమై సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాస్ స్పందిస్తూ.. అధికంగా బిల్లు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, మీటర్ రీడింగ్‌ను మరోసారి పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. -
ఒకే ఇంట్లో ఐదుగురి హత్య
-
అమలాపురంలో రౌడీల బీభత్సం
ఇంటిపై దాడి చేసి ధ్వంసం దౌర్జన్యం చేసిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యే త్రిమూర్తులు బంధువులు పోలీసుల అదుపులో 16 మంది.. రెండు ఇన్నోవా కార్లు స్వాధీనం పరారీలో మరో 30 మంది నిందితులపై హత్యాయత్నం, మారణాయుధాల కేసులతో పాటు పది సెక్షన్లు వివిధ సామాజిక వర్గాల నిరసనలు.. నేడు బంద్‌కు పిలుపు అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం మాచిరాజు వీధిలోని ఓ ఇంటిని దాదాపు 50 మంది రౌడీ మూకలు గురువారం సాయంత్రం విరుచుకుపడి మారణాయుధాలతో దౌర్జన్యం ధ్వంసం చేశారు. ఆ ఇంట్లోని ఓ పోర్షన్లో నిర్వహిస్తున్న ప్రింటింగ్ ప్రెస్‌నూ ధ్వంసం చేసి యంత్రాలు, సామాన్లు రోడ్డుపైకి విసిరేశారు. గంగవరం మండలం వెంకటాయపాలెం, కాకినాడ ప్రాంతాలకు చెందిన 50 మంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోదరుని కుమారుడు తోట తేజోమూర్తి, ఆయన దగ్గర బంధువు తోట బాబి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ఘాతుకం సాగినట్టు ఇంటి యాజమానులు గూడా రామాంజనేయులు, కాళ్లకూరి బుజ్జి, శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇల్లు మాదేనంటూ దాడులు గూడా రామాజంనేయులుకు చెందిన ఇల్లు ఒకప్పుడు ఐదుగురు అన్నదమ్ములతో కూడిన ఉమ్మడి ఆస్తి. 1990లో వాటాల పంపకంలో రామాంజనేయులకు మాత్రమే ఈ ఇల్లు పూర్తిగా వాటాగా వచ్చింది. అందులో సగం ఇంటిని రామంజనేయులు కాళ్లకూరి బుజ్జి అనే ఆసామికి విక్రయించారు. బుజ్జి తాను కొన్న పోర్ష¯ŒSలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. అయితే రామాంజనేయులు మిగిలిన నలుగురు అన్నదమ్ములు, వారి సోదరి కలిసి ఆ ఇంటిపై తమకూ హక్కు ఉందంటూ దౌర్జన్యంగా ఆచంట వీర వెంకట సత్యనారాయణ అనే ప్రభుత్వ టీచర్‌కు విక్రయించి రిజిస్ట్రేష¯ŒS కూడా చేయించేశారు. అయితే ఆ టీచర్ ఆ ఇంటిని ఖాళీ చేయించలేక దానిని తోట తేజోమూర్తికి విక్రయించారు. దీంతో ఆ ఇంటిని ఖాళీ చేయించడానికి తేజోమూర్తి, తోట బాబి ఆధ్వర్యంలో గురువారం ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. బాధితులు గతంలో ఎమ్మెల్యే త్రిమూర్తులుకు ఈ సమస్య వివరించగా ఆయన పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాలు శుక్రవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. అలాగే ఇంటిపై దాడిని ఖండిస్తూ గురువారం పలు నిరసన ప్రదర్శనలు చేశారు. అందరూ నేర చరితులే.. ఇంటిపై దాడి సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 16 మందిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేష¯ŒSకు తరలించారు. వీరంతా నేర చరిత్ర గల వారే. రెండు ఇన్నోవా కార్లు కూడా స్వాధీనం చేసుకోగా, మరో 30 మంది పరారయ్యారు. అందులో తోట బాబి, ఉపాధ్యాయుడు వీర వెంకట సత్యనారాయణ, ఇల్లును అక్రమంగా అమ్మిన రామాంజనేయులు నలుగురు సోదరులు, సోదరి కూడా ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తోట తేజోమూర్తి, కాకినాడకు చెందిన బళ్ల సూరిబాబు, యాళ్ల రాజు (రౌడీ షీటర్), పోలిశెట్టి సురేంద్రకుమార్, ఎలిపే అల్తాప్, చొక్కా రాజు, అయినవిల్లి వీరబాబు, గొల్లపూడి నాని, కోడూరి రంగనాథ్, లూటుకుర్తి మోహనరావు, వాసంశెట్టి శ్రీనివాసరావు, తలారి సుబ్రహ్మణ్యం, చాపల జయ ఆనందరాజు, కాండ్రేగుల రంగారావు, కొండేల బంగారయ్యలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డీఎస్పీ లంక అంకయ్య, సీఐలు వైఆర్కే శ్రీనివాస్, జి.దేవకుమార్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని ప్రెస్‌ల సంఘం ప్రతినిధులు, వైశ్య, బ్రాహ్మణ నాయకులు రౌడీల దౌర్జన్యంపై గడియారం స్తంభం సెంటరులో గురువారం రాత్రి ధర్నా చేశారు. రౌడీ మూకల దౌర్జన్యంపై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేష¯ŒS జిల్లా కో ఆర్డినేటర్ రాణి శ్రీనివాసశర్మ తక్షణమే రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేష¯ŒS చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీ కృష్ణారావుకు సమాచారం అందించారు. ఆయన ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టిలో పెట్టినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు డీజీపీతో మాట్లాడటంతో జిల్లా ఎస్పీకి ఈ ఘటనపై ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో అదుపులోకి తీసుకున్న 16 మందిపై మరిన్ని కఠినమైన సెక్షన్లతో చర్యలకు తీసుకునేలా కేసులు నమోదు చేశారు. సెల్ ఫోన్లు లాగేసుకుని దౌర్జన్యం చేశారు నాలుగు కార్లలో వచ్చిన దాదాపు 50 మంది నా ఇంటి తలుపు తట్టి మారణాయాధాలతో ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ముందు మా వద్ద సెల్ ఫోన్లు లాక్కుని దూషిస్తూ మాపై చేయిచేసుకున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లోకి వెళ్లి గునపాలతో గోడలు, తలుపులు బద్దలు కొట్టారు. ప్రింటింగ్ సామగ్రిని రోడ్డుపై విసిరి, ఏంటని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారు. – గూడా రామాంజనేయులు, ధ్వంసానికి గురైన ఇంటి యాజమని, అమలాపురం -
ఒక్క ఇల్లిస్తే ఒట్టు!
ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు గతంలో నిర్మించిన గృహాలకూ బిల్లుల నిలిపివేత ప్రారంభం కాని ఇళ్ల రద్దు ఆందోళనలో లబ్ధిదారులు చిత్తూరు: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే పక్కాగృహాలు నిర్మించి ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కారు. ఏడాది పాలన ముగిసినా ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేయలేదు. పక్కా గృహాలు వస్తాయని ప్రజలు వాటికోసం ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల ప్రచారంలో అడిగిన వారికల్లా పక్కాగృహం ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. అంతేకాదు గృహ నిర్మాణ వ్యయం రూ.70 వేల నుంచి రూ లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుందని కూడా హామీ ఇచ్చారు. తీరా ఓట్లేయించుకుని గద్దెనెక్కి ఏడాది ముగిసినా ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేసిన పాపాన పోలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరా ఆవాస్ యోజన పక్కాగృహాలదీ అదే పరిస్థితి. 2014-15 ఏడాదికి గాను 7112గృహాలు వచ్చాయన్నారు. ఆ తరువాత 2015-16కు గాను 5036 గృహాలు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నా ఒక్కటీ నిర్మాణానికి నోచుకోలేదు. గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని, ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చిందని సంబంధిత గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పక్కా గృహాల కోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 40వేల మంది పేదలు జన్మభూమి-మావూరు, గ్రీవెన్స్ డేల్లో వినతి పత్రాలు సమర్పించారు. రూ .15 కోట్ల పాత బకాయిలు పెండింగ్ కొత్త ఇళ్ల సంగతి దేవుడెరుగు గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథ కం కింద మూడు విడతలకు సంబంధించిన పలుగృహాలను లబ్ధిదారులు ఆలస్యంగా పూర్తి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన రూ 15 కోట్ల రూపాయల బిల్లులను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. వైఎస్ హయాంలో అడిగినన్ని గృహాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయంలో పేదలకు అడినన్ని గృహాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేందుకు పేదలకు పూర్తి సహకారం అందించారు. 2006 నుంచి 2009 వరకు ఇందిరమ్మ గృహాల పేరుతో జిల్లాలోని 3,57,370 మందికి పక్కా గృహాలు మంజూరు చేసిన ఘనత వైఎస్‌దే. ఏడాదికి లక్ష గృహాలకు పైగా మూడు సంవత్సరాల్లో 3,57,370 గృహాలను వైఎస్ మంజూరు చేశారు. వైఎస్ మూడు విడతల్లో కేటాయించిన మొత్తం గృహాల్లో 2,62,222 గృహాలు పూర్తి కాగా, మరో 41 వేల గృహాలు వివిధ దశల్లో నిలిచి పోయాయి. ఆర్థిక కారణాలతో ఇంతవరకు పలుగృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. వైఎస్ మరణానంతరం అధికారం చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో రచ్చబండ మూడు విడతల్లో 66,817 గృహాలను మాత్రమే మంజూరు చేశారు. అయితే ఇందులో 32,716 గృహాలు పూర్తి కాగా, 12వేలకు పైగా గృహాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. 21,868 గృహాల నిర్మాణం ప్రారంభంకాలేదు. వాటిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. -
ఇంటికొక్కటే!
సామాజిక పింఛన్లపై టీ సర్కార్ యోచన సాక్షి, హైదరాబాద్: పింఛన్ల కింద చెల్లిస్తున్న మొత్తాన్ని భారీగా పెంచుతుండడంతో.. అర్హులకు మాత్రమే పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే సామాజిక పింఛన్ ఇవ్వాలని యోచిస్తోంది. కొన్నిచోట్ల ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పెన్షన్ పొందుతుండడం.. ఉద్యోగుల తల్లిదండ్రులు, అంగన్వాడీ వర్కర్లుగా ఉన్నవారూ పింఛన్ తీసుకుంటున్నట్లు వెల్లడైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్తగా తెలంగాణ ప్రభుత్వ లోగోతో కార్డులు పంపిణీ చేయనున్న సమయంలోనే.. జల్లెడ పట్టి అనర్హులను తొలగించనుంది. అర్హులకు మాత్రమే సామాజిక పింఛన్లు అందాలన్న ఉద్దేశంతో.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల పథకంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఇంటిలో ఒకరికి మాత్రమే సామాజిక పెన్షన్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారికి ఆధార్‌కార్డు ఉంటేనే పెన్షన్ ఇవ్వాలని.. లేనిపక్షంలో ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. పెన్షన్లను విధిగా ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను కూడా తప్పనిసరి చేస్తున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులు, అంగ వైకల్యం కేటగిరీల కింద 30.87 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లను అందజేస్తున్నారు. అయితే ఇందులో ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికిపైగా పెన్షన్లు పొందుతున్నట్లు అధికారుల సర్వేల్లో వెల్లడైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటికి ఒకే పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే అంగవైకల్యం ఉన్నవారికి మాత్రం ఇంట్లో ఇంకెవరు పొందుతున్నా కూడా.. పెన్షన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక అంగన్వాడీల్లో వర్కర్లుగా పనిచేస్తున్న వితంతువులు... వర్కర్‌గా వేతనాలు తీసుకుంటూనే, వితంతు పెన్షన్ కూడా పొందుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారి తల్లిదండ్రులు కూడా వృద్ధాప్య పింఛన్లను పొందుతున్నారని.. అంతేగాకుండా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు వృద్ధులు ఉంటే వారందరికీ పెన్షన్లు మంజూరు అవుతున్నాయని పేర్కొంటున్నాయి. ఇలా కాకుండా ఒక్కరికి మాత్రమే ఈ పెన్షన్ మంజూరు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఓ అధికారి వివరించారు. అయితే ఈ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు సంబంధించి ఎవరి ఆర్థిక, సామాజిక పరిస్థితి వారికి ఉంటుందని.. అర్హత కలిగిన వారికి ఇవ్వాలనే మౌలిక సూత్రాన్ని పట్టించుకోకుండా ఒకరికి మాత్రమే పెన్షన్ అమలు చేస్తామనడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కార్డులతో షురూ..! దసరా-దీపావళి నాటికి పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వ లోగోతో కొత్త కార్డులను పంపిణీ చేసే సమయంలోనే.. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురికి అందుతున్న పెన్షన్లను జల్లెడ పట్టనున్నట్లు ప్రభుత్వవర్గాలు వివరించాయి. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికలకు నెలకు రూ. 200, వికలాంగులకు రూ. 500 చొప్పున పింఛన్లను చెల్లిస్తున్నారు. ప్రస్తుత పెన్షన్ల ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ. 872 కోట్ల భారం పడుతుండగా.. అందులో రూ. 272 కోట్ల వరకు కేంద్రం భరిస్తోంది. అయితే ఈ పెన్షన్లను వికలాంగులకు రూ. 1,500కి, మిగతావారికి రూ. వెయ్యికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... ఈ భారం రూ. 3,900కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. దీంతో నిజంగా అర్హులకు మాత్రమే పింఛన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్ల పథకంలో భరీగా అవినీతి చోటు చేసుకుంటోందని.. దానిని అరికట్టాల్సి ఉందని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం గమనార్హం.