అమలాపురంలో రౌడీల బీభత్సం | gang attak in amalapuram | Sakshi
Sakshi News home page

అమలాపురంలో రౌడీల బీభత్సం

Published Thu, Dec 1 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

అమలాపురంలో రౌడీల బీభత్సం

అమలాపురంలో రౌడీల బీభత్సం

  • ఇంటిపై దాడి చేసి ధ్వంసం
  • దౌర్జన్యం చేసిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యే త్రిమూర్తులు బంధువులు
  • పోలీసుల అదుపులో 16 మంది..
  •  రెండు ఇన్నోవా కార్లు స్వాధీనం
  •  పరారీలో మరో 30 మంది నిందితులపై హత్యాయత్నం, 
  • మారణాయుధాల కేసులతో పాటు పది సెక్షన్లు 
  • వివిధ సామాజిక వర్గాల నిరసనలు.. 
  • నేడు బంద్‌కు పిలుపు
  • అమలాపురం టౌన్‌
    అమలాపురం పట్టణం మాచిరాజు వీధిలోని ఓ ఇంటిని దాదాపు 50 మంది రౌడీ మూకలు గురువారం సాయంత్రం విరుచుకుపడి మారణాయుధాలతో దౌర్జన్యం ధ్వంసం చేశారు. ఆ ఇంట్లోని ఓ పోర్షన్‌లో నిర్వహిస్తున్న ప్రింటింగ్‌ ప్రెస్‌నూ ధ్వంసం చేసి యంత్రాలు, సామాన్లు రోడ్డుపైకి విసిరేశారు. గంగవరం మండలం వెంకటాయపాలెం, కాకినాడ ప్రాంతాలకు చెందిన 50 మంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోదరుని కుమారుడు తోట తేజోమూర్తి, ఆయన దగ్గర బంధువు తోట బాబి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ఘాతుకం సాగినట్టు ఇంటి యాజమానులు గూడా రామాంజనేయులు, కాళ్లకూరి బుజ్జి, శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
    ఇల్లు మాదేనంటూ దాడులు
    గూడా రామాజంనేయులుకు చెందిన ఇల్లు ఒకప్పుడు ఐదుగురు అన్నదమ్ములతో కూడిన ఉమ్మడి ఆస్తి. 1990లో వాటాల పంపకంలో రామాంజనేయులకు మాత్రమే ఈ ఇల్లు పూర్తిగా వాటాగా వచ్చింది. అందులో సగం ఇంటిని రామంజనేయులు కాళ్లకూరి బుజ్జి అనే ఆసామికి విక్రయించారు. బుజ్జి తాను కొన్న పోర్ష¯ŒSలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతున్నారు. అయితే రామాంజనేయులు మిగిలిన నలుగురు అన్నదమ్ములు, వారి సోదరి కలిసి ఆ ఇంటిపై తమకూ హక్కు ఉందంటూ దౌర్జన్యంగా ఆచంట వీర వెంకట సత్యనారాయణ అనే  ప్రభుత్వ టీచర్‌కు విక్రయించి రిజిస్ట్రేష¯ŒS కూడా చేయించేశారు. అయితే ఆ టీచర్‌ ఆ ఇంటిని ఖాళీ చేయించలేక దానిని తోట తేజోమూర్తికి విక్రయించారు. దీంతో ఆ ఇంటిని ఖాళీ చేయించడానికి తేజోమూర్తి, తోట బాబి ఆధ్వర్యంలో గురువారం ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. బాధితులు గతంలో ఎమ్మెల్యే త్రిమూర్తులుకు ఈ సమస్య వివరించగా ఆయన పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
    ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాలు శుక్రవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. అలాగే ఇంటిపై దాడిని ఖండిస్తూ గురువారం పలు నిరసన ప్రదర్శనలు చేశారు.
     
    అందరూ నేర చరితులే..
    ఇంటిపై దాడి సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 16 మందిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేష¯ŒSకు తరలించారు. వీరంతా నేర చరిత్ర గల వారే.  రెండు ఇన్నోవా కార్లు కూడా స్వాధీనం చేసుకోగా, మరో 30 మంది పరారయ్యారు. అందులో తోట బాబి, ఉపాధ్యాయుడు వీర వెంకట సత్యనారాయణ, ఇల్లును అక్రమంగా అమ్మిన రామాంజనేయులు నలుగురు సోదరులు, సోదరి కూడా ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తోట తేజోమూర్తి, కాకినాడకు చెందిన బళ్ల సూరిబాబు, యాళ్ల రాజు (రౌడీ షీటర్‌), పోలిశెట్టి సురేంద్రకుమార్, ఎలిపే అల్తాప్, చొక్కా రాజు, అయినవిల్లి వీరబాబు, గొల్లపూడి నాని, కోడూరి రంగనాథ్, లూటుకుర్తి మోహనరావు, వాసంశెట్టి శ్రీనివాసరావు, తలారి సుబ్రహ్మణ్యం, చాపల జయ ఆనందరాజు, కాండ్రేగుల రంగారావు, కొండేల బంగారయ్యలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డీఎస్పీ లంక అంకయ్య, సీఐలు వైఆర్‌కే శ్రీనివాస్, జి.దేవకుమార్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని ప్రెస్‌ల సంఘం ప్రతినిధులు, వైశ్య, బ్రాహ్మణ నాయకులు రౌడీల దౌర్జన్యంపై గడియారం స్తంభం సెంటరులో గురువారం రాత్రి ధర్నా చేశారు. 
     
    రౌడీ మూకల దౌర్జన్యంపై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేష¯ŒS జిల్లా కో ఆర్డినేటర్‌ రాణి శ్రీనివాసశర్మ తక్షణమే రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేష¯ŒS చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీ కృష్ణారావుకు సమాచారం అందించారు. ఆయన ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టిలో పెట్టినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు డీజీపీతో మాట్లాడటంతో జిల్లా ఎస్పీకి ఈ ఘటనపై ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో అదుపులోకి తీసుకున్న 16 మందిపై మరిన్ని కఠినమైన సెక్షన్లతో చర్యలకు తీసుకునేలా కేసులు నమోదు చేశారు.
     
    సెల్‌ ఫోన్లు లాగేసుకుని దౌర్జన్యం చేశారు
    నాలుగు కార్లలో వచ్చిన దాదాపు 50 మంది నా ఇంటి తలుపు తట్టి మారణాయాధాలతో ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ముందు మా వద్ద సెల్‌ ఫోన్లు లాక్కుని దూషిస్తూ మాపై చేయిచేసుకున్నారు. ప్రింటింగ్‌ ప్రెస్‌లోకి వెళ్లి గునపాలతో గోడలు, తలుపులు బద్దలు కొట్టారు. ప్రింటింగ్‌ సామగ్రిని రోడ్డుపై విసిరి, ఏంటని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారు.
           
     – గూడా రామాంజనేయులు, ధ్వంసానికి గురైన ఇంటి యాజమని, అమలాపురం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement