ఎమ్మెల్యే... తీరు మార్చుకో..! | ysrcp flex removed in amalapuram | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే... తీరు మార్చుకో..!

Published Sun, Jan 8 2017 11:34 PM | Last Updated on Tue, May 29 2018 3:43 PM

ysrcp flex removed in amalapuram

  • ఫీజు కట్టిన వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ తొలగింపు సరికాదు
  • అధికారులపై పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వరూప్‌ ఆగ్రహం
  • అమలాపురం టౌన్‌ :
    అమలాపురంలో ఫ్లెక్సీల ఏర్పాటు, తొలగింపులో పక్షపాతం చూపుతున్న మున్సిపల్‌ అధికారులపై వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యాడ్‌ ఏజెన్సీ ద్వారా మున్సిపాలిటీ నుంచి అధికారికంగా అనుమతి పొందిన వైఎస్సార్‌ పీసీ ఫ్లెక్సీని తొలగించడంపై విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు తీరు మార్చుకోవాలని సూచించారు. పట్టణంలో పలు చోట్ల మున్సిపాలిటీకి ఎలాంటి ఫీజలు చెల్లించకుండా రోజుల తరబడి భారీ ఫ్లెక్సీలు పెడుతున్నా నోరు మెదపని మున్సిపల్‌ అధికారులు సక్రమంగా ఫీజు చెల్లించిన వాటిని తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక హౌసింగ్‌ బోర్డులో జనవరి ఒకటో తేదీన పార్టీ అభిమానులు వెంకటేశ్వర యాడ్‌ ఏజెన్సీ ద్వారా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి రసీదు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ నుంచి నెల రోజుల పరిమితితో అనుమతి పొందిన పార్టీ ఫ్లెక్సీని ఎమ్మెల్యే ఆనందరావు తక్షణమే తొలగించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించడం... వారు తొలగించటం జరిగిందని విశ్వరూప్‌ అన్నారు. చిన్న విషయాల్లో కూడా కక్ష సాధింపు చర్యల్లా వ్యవహరించటం ఎమ్మెల్యేకు స్థాయికి సరికాదని విశ్వరూప్‌ పేర్కొన్నారు. ముందు పట్టణంలో అనుమతిలేని ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన సూచించారు. అనుమతి ఉన్నవాటిని తొలగించి అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని ఆయన హితవు పలికారు. అనంతరం ఫ్లెక్సీ తొలగించిన పట్టణ ప్రణాళిక అధికారి ఆనందకుమార్‌కు విశ్వరూప్‌ ఫో¯ŒS చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి లోగా ఫ్లెక్సీని యథాస్థానంలో పెట్టకపోతే మున్సిపల్‌ కార్యాలయం ముందు తమ పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తారని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా విశ్వరూప్‌ మున్సిపల్‌ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, కమిషనర్‌ శ్రీనివాస్‌కు కూడా ఫో¯ŒSలోనే అనుమతి ఉన్న ఫ్లెక్సీల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వరూప్‌ విలేకర్లకు తెలిపారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement