in amalapuram
-
ఎమ్మెల్యే... తీరు మార్చుకో..!
ఫీజు కట్టిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ తొలగింపు సరికాదు అధికారులపై పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వరూప్ ఆగ్రహం అమలాపురం టౌన్ : అమలాపురంలో ఫ్లెక్సీల ఏర్పాటు, తొలగింపులో పక్షపాతం చూపుతున్న మున్సిపల్ అధికారులపై వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యాడ్ ఏజెన్సీ ద్వారా మున్సిపాలిటీ నుంచి అధికారికంగా అనుమతి పొందిన వైఎస్సార్ పీసీ ఫ్లెక్సీని తొలగించడంపై విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు తీరు మార్చుకోవాలని సూచించారు. పట్టణంలో పలు చోట్ల మున్సిపాలిటీకి ఎలాంటి ఫీజలు చెల్లించకుండా రోజుల తరబడి భారీ ఫ్లెక్సీలు పెడుతున్నా నోరు మెదపని మున్సిపల్ అధికారులు సక్రమంగా ఫీజు చెల్లించిన వాటిని తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక హౌసింగ్ బోర్డులో జనవరి ఒకటో తేదీన పార్టీ అభిమానులు వెంకటేశ్వర యాడ్ ఏజెన్సీ ద్వారా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి రసీదు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ నుంచి నెల రోజుల పరిమితితో అనుమతి పొందిన పార్టీ ఫ్లెక్సీని ఎమ్మెల్యే ఆనందరావు తక్షణమే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించడం... వారు తొలగించటం జరిగిందని విశ్వరూప్ అన్నారు. చిన్న విషయాల్లో కూడా కక్ష సాధింపు చర్యల్లా వ్యవహరించటం ఎమ్మెల్యేకు స్థాయికి సరికాదని విశ్వరూప్ పేర్కొన్నారు. ముందు పట్టణంలో అనుమతిలేని ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన సూచించారు. అనుమతి ఉన్నవాటిని తొలగించి అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని ఆయన హితవు పలికారు. అనంతరం ఫ్లెక్సీ తొలగించిన పట్టణ ప్రణాళిక అధికారి ఆనందకుమార్‌కు విశ్వరూప్ ఫో¯ŒS చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి లోగా ఫ్లెక్సీని యథాస్థానంలో పెట్టకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు తమ పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తారని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా విశ్వరూప్ మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, కమిషనర్ శ్రీనివాస్‌కు కూడా ఫో¯ŒSలోనే అనుమతి ఉన్న ఫ్లెక్సీల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వరూప్ విలేకర్లకు తెలిపారు. -
ఆర్డీఓను ఘెరావ్ చేసిన హాస్టల్ విద్యార్థినులు
అమలాపురం: స్థానిక వడ్డి గూడెంలో సరైన వసతులు లేని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్ భవనంలోకి నాలుగు హాస్టళ్లకు చెందిన దాదాపు 600 మంది విద్యార్ధినులను తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు, కోనసీమ దళిత నాయకులు స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. సుమారు నాలుగు గంటల పాటు కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది దాదాపు హౌస్ అరెస్ట్ అయ్యారు. జిల్లా ఎస్సీ కార్పొరేష¯ŒS ఈడీ, ఇ¯ŒSఛార్జి ఆర్డీఓ అనూరాధను హాస్టల్ విద్యార్థినులు ఘెరావ్ చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఆర్డీఓ కార్యాలయ ముట్టడి కొనసాగింది. సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాక జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి ఇక్కడ వచ్చి ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడే ప్రకటించాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. దాంతో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో డీడీ శోభారాణి కాకినాడ నుంచి అమలాపురానికి వచ్చారు. ఆమెను కూడా విద్యార్ధినులు, దళిత నాయకులు ఘెరావ్ చేశారు. ఆమె ఫో¯ŒSలో జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. ఈ విద్యాసంవత్సరానికి పాత హాస్టళ్లలోనే విద్యార్థినులను ఉంచుతామని కలెక్టర్ అనుమతితో ఆమె ప్రకటించటంతో ఆందోళనకు తెరపడింది. ఇప్పటికే కొత్త హాస్టల్‌కు పాత హాస్టళ్లనుంచి తరలించిన బియ్యం తదితర సామగ్రిని తిరిగి పాత హాస్టళ్లకు తరలించేలా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ సమస్యకు తెరపడింది. కోనసీమ దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, పెయ్యల శ్రీనివాసరావు, జంగా బాబూరావు, దేవరపల్లి శాంతికుమార్, మెండు రమేష్‌బాబు, ఉండ్రు వెంకటేష్, కాట్రు చంద్రమోహన్, బొంతు బాలరాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, స్త్రీ శక్తి రాష్ట్ర కో ఆర్డినేటర్ కొంకి రాజామణి పాల్గొన్నారు. -
అమలాపురంలో రౌడీల బీభత్సం
ఇంటిపై దాడి చేసి ధ్వంసం దౌర్జన్యం చేసిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యే త్రిమూర్తులు బంధువులు పోలీసుల అదుపులో 16 మంది.. రెండు ఇన్నోవా కార్లు స్వాధీనం పరారీలో మరో 30 మంది నిందితులపై హత్యాయత్నం, మారణాయుధాల కేసులతో పాటు పది సెక్షన్లు వివిధ సామాజిక వర్గాల నిరసనలు.. నేడు బంద్‌కు పిలుపు అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం మాచిరాజు వీధిలోని ఓ ఇంటిని దాదాపు 50 మంది రౌడీ మూకలు గురువారం సాయంత్రం విరుచుకుపడి మారణాయుధాలతో దౌర్జన్యం ధ్వంసం చేశారు. ఆ ఇంట్లోని ఓ పోర్షన్లో నిర్వహిస్తున్న ప్రింటింగ్ ప్రెస్‌నూ ధ్వంసం చేసి యంత్రాలు, సామాన్లు రోడ్డుపైకి విసిరేశారు. గంగవరం మండలం వెంకటాయపాలెం, కాకినాడ ప్రాంతాలకు చెందిన 50 మంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోదరుని కుమారుడు తోట తేజోమూర్తి, ఆయన దగ్గర బంధువు తోట బాబి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ఘాతుకం సాగినట్టు ఇంటి యాజమానులు గూడా రామాంజనేయులు, కాళ్లకూరి బుజ్జి, శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇల్లు మాదేనంటూ దాడులు గూడా రామాజంనేయులుకు చెందిన ఇల్లు ఒకప్పుడు ఐదుగురు అన్నదమ్ములతో కూడిన ఉమ్మడి ఆస్తి. 1990లో వాటాల పంపకంలో రామాంజనేయులకు మాత్రమే ఈ ఇల్లు పూర్తిగా వాటాగా వచ్చింది. అందులో సగం ఇంటిని రామంజనేయులు కాళ్లకూరి బుజ్జి అనే ఆసామికి విక్రయించారు. బుజ్జి తాను కొన్న పోర్ష¯ŒSలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. అయితే రామాంజనేయులు మిగిలిన నలుగురు అన్నదమ్ములు, వారి సోదరి కలిసి ఆ ఇంటిపై తమకూ హక్కు ఉందంటూ దౌర్జన్యంగా ఆచంట వీర వెంకట సత్యనారాయణ అనే ప్రభుత్వ టీచర్‌కు విక్రయించి రిజిస్ట్రేష¯ŒS కూడా చేయించేశారు. అయితే ఆ టీచర్ ఆ ఇంటిని ఖాళీ చేయించలేక దానిని తోట తేజోమూర్తికి విక్రయించారు. దీంతో ఆ ఇంటిని ఖాళీ చేయించడానికి తేజోమూర్తి, తోట బాబి ఆధ్వర్యంలో గురువారం ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. బాధితులు గతంలో ఎమ్మెల్యే త్రిమూర్తులుకు ఈ సమస్య వివరించగా ఆయన పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాలు శుక్రవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. అలాగే ఇంటిపై దాడిని ఖండిస్తూ గురువారం పలు నిరసన ప్రదర్శనలు చేశారు. అందరూ నేర చరితులే.. ఇంటిపై దాడి సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 16 మందిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేష¯ŒSకు తరలించారు. వీరంతా నేర చరిత్ర గల వారే. రెండు ఇన్నోవా కార్లు కూడా స్వాధీనం చేసుకోగా, మరో 30 మంది పరారయ్యారు. అందులో తోట బాబి, ఉపాధ్యాయుడు వీర వెంకట సత్యనారాయణ, ఇల్లును అక్రమంగా అమ్మిన రామాంజనేయులు నలుగురు సోదరులు, సోదరి కూడా ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తోట తేజోమూర్తి, కాకినాడకు చెందిన బళ్ల సూరిబాబు, యాళ్ల రాజు (రౌడీ షీటర్), పోలిశెట్టి సురేంద్రకుమార్, ఎలిపే అల్తాప్, చొక్కా రాజు, అయినవిల్లి వీరబాబు, గొల్లపూడి నాని, కోడూరి రంగనాథ్, లూటుకుర్తి మోహనరావు, వాసంశెట్టి శ్రీనివాసరావు, తలారి సుబ్రహ్మణ్యం, చాపల జయ ఆనందరాజు, కాండ్రేగుల రంగారావు, కొండేల బంగారయ్యలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డీఎస్పీ లంక అంకయ్య, సీఐలు వైఆర్కే శ్రీనివాస్, జి.దేవకుమార్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని ప్రెస్‌ల సంఘం ప్రతినిధులు, వైశ్య, బ్రాహ్మణ నాయకులు రౌడీల దౌర్జన్యంపై గడియారం స్తంభం సెంటరులో గురువారం రాత్రి ధర్నా చేశారు. రౌడీ మూకల దౌర్జన్యంపై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేష¯ŒS జిల్లా కో ఆర్డినేటర్ రాణి శ్రీనివాసశర్మ తక్షణమే రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేష¯ŒS చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీ కృష్ణారావుకు సమాచారం అందించారు. ఆయన ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టిలో పెట్టినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు డీజీపీతో మాట్లాడటంతో జిల్లా ఎస్పీకి ఈ ఘటనపై ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో అదుపులోకి తీసుకున్న 16 మందిపై మరిన్ని కఠినమైన సెక్షన్లతో చర్యలకు తీసుకునేలా కేసులు నమోదు చేశారు. సెల్ ఫోన్లు లాగేసుకుని దౌర్జన్యం చేశారు నాలుగు కార్లలో వచ్చిన దాదాపు 50 మంది నా ఇంటి తలుపు తట్టి మారణాయాధాలతో ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ముందు మా వద్ద సెల్ ఫోన్లు లాక్కుని దూషిస్తూ మాపై చేయిచేసుకున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లోకి వెళ్లి గునపాలతో గోడలు, తలుపులు బద్దలు కొట్టారు. ప్రింటింగ్ సామగ్రిని రోడ్డుపై విసిరి, ఏంటని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారు. – గూడా రామాంజనేయులు, ధ్వంసానికి గురైన ఇంటి యాజమని, అమలాపురం -
ఎవరికీ లేని ఆంక్షలు కాపులకేనా?
∙కాపు ఉద్యమాల సమయంలోనే 144, 30 సెక్షన్లు అమలు ∙రాష్ట్ర కాపు జేఏసీ నేతల ధ్వజం ∙పాదయాత్ర జరిపి తీరుతామని స్పష్టీకరణ అమలాపురం టౌన్ : రాష్ట్రంలో ఎవరైనా పాద యాత్రలు, సైకిల్ యాత్రలు, చైతన్య యాత్రలు వంటివి నిర్వహించినప్పుడు లేని ఆంక్షలు కాపులు ఏదైనా ఉద్యమాలు, యాత్రలు ఏర్పాటు చేస్తే మాత్రం ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తోందని రాష్ట్ర కాపు జేఏసీ నేతల ధ్వజమెత్తారు. కాపు ఉద్యమాలు, యాత్రల సమయంలోనే ప్రభుత్వం 144 సెక్షన్, 30 సెక్షన్ తూ.చ.తప్పకుండా అమలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని కొల్లూరి వారి సత్రంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన కాపు నాయకుల సమావేశంలో ఈ నెల 16 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ చేపడుతున్న పాదయాత్ర సన్నాహాలపై చర్చించారు. రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, జిల్లా కాపునాడు పరిశీలకుడు, గుంటూరు జిల్లా పొన్నూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు కోట శ్రీనివాస్, నల్లా పవన్, మెండుగుదటి మోహన్, కల్వకొలను తాతాజీ, ముత్యాల రామదాసు తదితరులు ముద్రగడ పాదయాత్ర రూట్ మ్యాప్, ఏర్పాట్లపై చర్చించారు. యాత్రకు దరఖాస్తు చేసుకుని, గొడవలు జరగవని హామీ ఇస్తే అనుమతి ఇస్తామని డీజీపీ చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. చంద్రబాబుతో పాటు రాజకీయ ప్రముఖులు చేస్తున్న యాత్రలకు అనుమతులు ఉంటున్నాయాని వారు ప్రశ్నించారు. తుని కాపు గర్జన సభకు బస్సులు కూడా ఏర్పాటు చేసుకోనివ్వకుండా ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఐక్యతతో పాదయాత్రను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాపు నాయకులు బసవా ప్రభాకర్, ఆర్వీ నాయుడు, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, మోటూరి సాయి, సుంకర సుధ, నల్లా శివాజీ, బద్రి బాబ్జీ, అరిగెల నాని, కురసాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
సేవాపథంలో షష్టిపూర్తి
కోనసీమలో తొలి మహిళా వైద్యురాలు గోటేటి సరస్వతి సత్యసాయిబాబా ఆదర్శంగా 60 ఏళ్లుగా వైద్యసేవలు గుర్తింపుగా విశ్వమాత ఈశ్వరమ్మ జీవనసాఫల్య పురస్కారం అమలాపురం టౌ¯ŒS : ఆమె పుట్టపర్తి భగవా¯ŒS సత్యసాయి సేవా మార్గంలోనే అరవై ఏళ్లుగా అడుగులు వేస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యురాలైన ఆమె ఆ వృత్తి ద్వారానే ప్రజలకు ఉచిత సేవలు అందించారు. అమలాపురంలోనే కాదు.. కోనసీమలో తొలి మహిళా వైద్యురాలిగా డాక్టర్ గోటేటి సరస్వతి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితురాలే. అందుకే ఆమెను భగవా¯ŒS సత్యసాయి బాబా తల్లి విశ్వమాత ఈశ్వరమ్మ జీవన సాఫల్య పురస్కారం వెతుక్కుంటూ వచ్చి వరించింది. పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థలు 60 ఏళ్లుగా వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న వారిని రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తే అందులో ఒకరు డాక్టర్ సరస్వతమ్మ. రాజమహేంద్రవరంలో గల సత్యసాయి సేవా మందిరంలో సత్యసాయి సేవా సంస్థల రెండు రాష్ట్రాల అధ్యక్షుడు ఎ¯ŒSజీ చలం చేతుల మీదుగా డాక్టర్ సరస్వతమ్మ గురువారం ఈ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. డాక్టర్ సరస్వతమ్మ కూడా రాష్ట్ర సత్య సాయి సేవా సంస్థల్లో అనేక కీలక పదవులు చేశారు. సత్యసాయి బాబాకు అత్యంత విశ్వసనీయంగా ఉన్న వ్యక్తుల్లో సరస్వతమ్మ ఒకరు. అమలాపురం నుంచి సేవా ప్రస్థానం అమలాపురం యరమ్రిల్లివారి వీధిలో నివసిస్తున్న ఆమె 1955 నుంచి పట్టణంలో ఆస్పత్రి నిర్వహిస్తూ ప్రజల నుంచి నామమాత్రపు ఫీజలతో ఎన్నో ఏళ్లు వైద్య సేవలు అందించారు. అప్పటి నుంచే సర్వతిమ్మ పుట్టపర్తి సత్యసాయి బాబా చేస్తున్న సేవలకు ప్రభావితురాలై తాను కూడా ఆ సేవా మార్గాన్నే ఎంచుకున్నారు. తన ఆస్పత్రి ద్వారా కొన్నాళ్లు ఉచిత వైద్యం అందించి పుట్టపర్తికి వచ్చే యాత్రికులకు అక్కడి ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసుతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటూ సత్యసాయి సేవా సంస్థల ద్వారా సేవలు అందిస్తున్నారు. అమలాపురంలో నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపం, సత్యసాయి సేవా మందిరం నిర్వహణ బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తున్నారు. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ఆమెను అమలాపురంలో పలువురు ప్రముఖులు శుక్రవారం సత్కరించారు. సరస్వతమ్మ ఇంటికి సత్యసాయి.. సత్యసాయి భక్తురాలైన డాక్టర్ సరస్వతమ్మ ఇంటికి 1964 ప్రాంతంలో సత్యసాయి బాబా స్వయంగా వచ్చారు. ఆమె ఇంటి నుంచే బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పటంతో పాటు డాక్టర్‌గా సరస్వతి చేస్తున్న వైద్య సేవలను కొనియాడారు. 1986 ప్రాంతంలో బీజేపీ నేత, మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి కూడా ఆమె ఇంటికి వచ్చి చేస్తున్న సేవలకు కితాబు ఇచ్చారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా సరస్వతి చేస్తున్న సేవలకు మెచ్చి ఆమె ఇంటికి స్వయంగా వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మృగ్యమైన సేవాభావం ‘మా రోజుల్లో వైద్య వృత్తి చేపట్టిన వారిలో వ్యాపార దృక్పథం ఉండేది కాదు. వారిలో సేవా భావం ఉండేది. ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం రోగుల నుంచి నామమాత్రపు ఫీజులు తీసుకునే వా’రని జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్ సరస్వతమ్మ అన్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా ’సాక్షి’ శుక్రవారం అమలాపురంలోని ఆమె స్వగృహంలో కలసి మాట్లాడినప్పుడు నాడు...నేడు వైద్య సేవల్లో ఉన్న వ్యత్యాసాన్ని ఆవేదనాభరితంగానే వివరించారు. ‘అప్పట్లో నా వద్దకు వచ్చే రోగుల ఆర్థిక స్థితిగతులను కూడా గమనించే దాన్ని. ఫీజుగా వారిచ్చినంత మేము పుచ్చుకున్నంత అన్నట్లుగా డబ్బులు తీసుకునేవాళ్లం. నేనైతే వైద్యం చేసి ఇన్ని డబ్బులు ఇవ్వమని ఎప్పుడూ అడగలే’దని ఆమె చెప్పారు. రోగులు పేదోళ్లైతే వెళ్లేటప్పుడు రిక్షాకు డబ్బులిచ్చి పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. – డాక్టర్ సరస్వతమ్మ -
‘తూర్పు’లో దళితులపై దాడి
-
దళితులపై దాడితో కలకలం
నిరసించిన దళిత సంఘాలు, నేతలు ∙ ఆవుల వధ అనుమానంతో అనాలోచిత దాడి ∙ అమలాపురంలో ధర్నాలు, రాస్తారోకోలు తమ ఆవులను అపహరించి, గోవధకు పాల్పడుతున్నారన్న అనుమానం వారితో ఓ అమానుషానికి పురిగొల్పింది. తమ చర్మకార వృత్తిలో భాగంగా చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న ఇద్దరి దళిత సోదరులకు గోవుల అపహరణ, వధ అంటగట్టి, అకారణంగా దాడి చేసిన ఘటన జిల్లావ్యాప్తంగా మంగళవారం కలకలం రేకేత్తించింది. జిల్లాలో దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దళిత నేతలు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించడమే కాకుండా, నిరసనలు కూడా తెలిపారు. – అమలాపురం టౌన్/ అమలాపురం రూరల్ అమలాపురం మండలం కామనగరువులో ముగ్గురు రైతులకు చెందిన మూడు ఆవులు కనిపించకుండా పోవటం, వాటిని అమలాపురం పట్టణానికి చెందిన చర్మకారులు మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు(లాజర్)లే అపహరించి, మాంసం కోసం గో వధకు పాల్పడుతున్నారని నిర్ధారణకు వచ్చారు. అసలు ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోకుండా చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న వారిపై దాడికి దిగటంతో దాడి చేసిన వారు నిందితులయ్యారు. కామనగరువుకు చెందిన ఉర్రింక నారాయణరావు, కామన దుర్గారావు, రాజులపూడి నరేష్, వాకా ప్రసాద్, వాకా గోపి, రాజులపూడి గంగాధరరావు, అతని కుమారుడితో పాటు మరి కొంతమంది కలిసి దళిత సోదరులపై దాడి చేసిశారంటూ వారిపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల రంగప్రవేశం ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం శ్మశానంలో చనిపోయిన ఆవును చర్మాన్ని వలుస్తున్న దళితులపై దాడి చేసి గాయపరచగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. అల్లవరం ఎస్సై డి.ప్రశాంత కుమార్ శ్మశానానికి చేరుకుని, రక్తపు గాయాలతో ఉన్న ఎలీషా, లాజర్, వ్యాన్ డ్రైవర్ సరవపు లక్ష్మణకుమార్‌ను తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోనసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గంపల దుర్గాప్రసాద్, ఇతర దండోరా నాయకులు సోమవారం అర్ధరాత్రి అమలాపురం ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఆందోళన చేశారు. ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న నిరసనలో ఉన్న ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా మంగళవారం ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడి, ఈ ఘటనపై నిరసన తెలిపారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, సీపీఐ నాయకుడు కె.సత్తిబాబు, సీపీఎం నాయకుడు ఎం.రాజశేఖర్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గెడ్డం సంపదరావు, జిల్లా మానవ హక్కుల వేదిక ప్రతినిధి రవి తదితర దళిత నేతలు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, ఈ ఘటనపై నిరసన తెలిపారు. అమలాపురం గడియారం స్తంభం వద్ద కేవీపీఎస్ నేతలు ధర్నా చేశారు. 24 గంటల్లో అరెస్టు చేస్తాం : ఎస్పీ కాకినాడ సిటీ: అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో చర్మకారులపై దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సంఘటనకు సంబంధించి కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీంతో పార్టీలకు, గోసంరక్షణ, ఆర్ఎస్ఎస్ వంటి సంఘాలకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. కేవలం ఉప్పలగుప్తం మండలం సూదాపాలేనికి చెందిన యువత వారి గ్రామానికి చెందిన ఆవును దొంగిలించి, చర్మం వలుస్తున్నారని ఉద్రిక్తతకు లోనై, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. సమాచారం అందిన తక్షణమే పటిష్ట చర్యలు తీసుకుని, పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ దాడిలో ఏడుగురు ఉన్నట్టు పేర్లు వచ్చాయని, వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో సెక్షన్–30 అమలు జిల్లావ్యాప్తంగా సెక్ష–30 అమలులో ఉన్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఈ నెల 31 వరకు జిల్లాలోని కాకినాడ, రామచంద్రపురం అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్లలో అమలవుతుందని పేర్కొన్నారు.