ఆర్డీఓను ఘెరావ్ చేసిన హాస్టల్ విద్యార్థినులు
Published Mon, Jan 2 2017 10:09 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
అమలాపురం:
స్థానిక వడ్డి గూడెంలో సరైన వసతులు లేని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్ భవనంలోకి నాలుగు హాస్టళ్లకు చెందిన దాదాపు 600 మంది విద్యార్ధినులను తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు, కోనసీమ దళిత నాయకులు స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. సుమారు నాలుగు గంటల పాటు కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది దాదాపు హౌస్ అరెస్ట్ అయ్యారు. జిల్లా ఎస్సీ కార్పొరేష¯ŒS ఈడీ, ఇ¯ŒSఛార్జి ఆర్డీఓ అనూరాధను హాస్టల్ విద్యార్థినులు ఘెరావ్ చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఆర్డీఓ కార్యాలయ ముట్టడి కొనసాగింది.
సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాక
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి ఇక్కడ వచ్చి ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడే ప్రకటించాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. దాంతో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో డీడీ శోభారాణి కాకినాడ నుంచి అమలాపురానికి వచ్చారు. ఆమెను కూడా విద్యార్ధినులు, దళిత నాయకులు ఘెరావ్ చేశారు. ఆమె ఫో¯ŒSలో జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. ఈ విద్యాసంవత్సరానికి పాత హాస్టళ్లలోనే విద్యార్థినులను ఉంచుతామని కలెక్టర్ అనుమతితో ఆమె ప్రకటించటంతో ఆందోళనకు తెరపడింది. ఇప్పటికే కొత్త హాస్టల్‌కు పాత హాస్టళ్లనుంచి తరలించిన బియ్యం తదితర సామగ్రిని తిరిగి పాత హాస్టళ్లకు తరలించేలా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ సమస్యకు తెరపడింది. కోనసీమ దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, పెయ్యల శ్రీనివాసరావు, జంగా బాబూరావు, దేవరపల్లి శాంతికుమార్, మెండు రమేష్‌బాబు, ఉండ్రు వెంకటేష్, కాట్రు చంద్రమోహన్, బొంతు బాలరాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, స్త్రీ శక్తి రాష్ట్ర కో ఆర్డినేటర్ కొంకి రాజామణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement