
హాస్టల్ యువతుల పట్ల యజమాని అసభ్య ప్రవర్తన
రక్షణగా ఉండాల్సిన హాస్టల్ యజమానే .... యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వనస్థలిపురం బీఎన్ రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : రక్షణగా ఉండాల్సిన హాస్టల్ యజమానే .... యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వనస్థలిపురం బీఎన్ రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. శ్రీసాయి మణికంఠ లేడీస్ హాస్టల్ యజమాని నరేష్ తో పాటు అతని స్నేహితులు, తాగిన మత్తులో హాస్టల్ లోని అమ్మాయిలపై లైంగిక దాడికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది.
సంక్రాంతి సందర్భంగా హాస్టల్ లోని విద్యార్థులు ఊరెళ్లారు. బీహార్ కు చెందిన 5 మంది యువతులు హాస్టల్ లోనే ఉన్నారు. దీంతో పథకం ప్రకారం, స్నేహితులతో కలిసి లేడీస్ హాస్టల్ యజమాని, విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో తప్పించుకుని గత రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో సన్నిహితులతో కలిసి మళ్లీ ఉదయాన్నే పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. బాధితులను స్థానికులు అండగా నిలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా యువతుల ఫిర్యాదుతో నరేష్....హాస్టల్ బోర్డు పీకేశాడు.