
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటా మని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలి పారు. సదరన్ రీజినల్ పవర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం సహకరిస్తుందన్నారు. రాష్ట్రాల పునర్విభజన వివాదాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంపకాల వివాదంపై దాదాపు మూడున్నరేళ్ల కింద కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అప్పటి కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) చైర్మన్ నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిందా? లేదా? అన్న సమాచారం తన వద్ద లేదన్నారు.
వివాదం నా దృష్టికి రాలేదు..
ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్‌కు సంబంధించి విభజన వివాదాలు నెలకొని ఉన్నాయన్న విషయం తన దృష్టికి రాలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విద్యుత్ రంగం సాధించిన విజయాలపై మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర నగరాల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతులకు సౌర విద్యుత్ పంప్ సెట్లను సరఫరా చేసేందుకు కుసుమ్ (కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తమ్ మహాభియాన్) పేరుతో కొత్త పథకా న్ని అమల్లోకి తీసుకురానున్నామన్నారు. దీనిద్వా రా దేశ వ్యాప్తంగా 27.5 లక్షల సోలార్ పంప్‌సెట్ల ను పంపిణీ చేస్తామని, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో 17.5 లక్షల పంప్‌సెట్లు ఇస్తామన్నారు.
త్వరలో కొత్త టారిఫ్ విధానం
విద్యుత్ ధరలను నిర్ణయించే టారిఫ్ విధానంలో సమూల సంస్కరణల కోసం ముసాయిదా టారిఫ్ విధానాన్ని ప్రకటించామని ఆర్కే సింగ్ పేర్కొన్నా రు. త్వరలో అమల్లోకి వచ్చే ఈ విధానం ప్రకారం పలు కేటగిరీల వినియోగదారుల మధ్య క్రాస్ సబ్సిడీ 25 శాతానికి మించరాదన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు 15 శాతం లోపు ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment