నకిలీ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాను పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
హైదరాబాద్: నకిలీ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాను పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు శివను చంచల్ గూడ జైలుకు తరలించారు.
శివ పూజల పేరుతో పలువురిని మాయం చేసి రూ.1.33 కోట్లు దోచుకున్న విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. టాస్క్ ఫోర్స్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అతణ్ని విమానంలో నగరానికి తరలించారు. నకిలీ బాబా, డ్రైవర్ షాజహాన్తో సహా మరో ఇద్దర్ని పోలీసులు ప్రశ్నించి కేసు నమోదు చేశారు.