fake godman
-
ఎనిమిది నెలలుగా వాడుకున్నాడు
లక్నో : ఓ దొంగ స్వామీజీ తనపై ప్రతి రోజు లైంగిక దాడికి పాల్పడేవాడని యువతి ఆరోపించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇప్పటికే బాబాల పేరిట పలువురు చేస్తున్న మోసాలు బయటకు వచ్చి సంచలనంగా మారుతున్న ఈతరుణంలో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం సియా రామ్ దాస్ అనే వ్యక్తి బాబా వేషంలో ఉంటూ అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఓ యువతిని తన వద్ద బంధించి ఎనిమిది నెలలపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడి శిష్యులు కూడా వరుసగా ఆమెపై లైంగిక దాడులు చేశారు. ఓ మహిళా శిష్యురాలికి తనను తన బంధువులే రూ.50 వేలకు అమ్మేశారని, తొలుత తనను లక్నో తీసుకెళ్లి అక్కడి నుంచి మిష్రిక్ ఆశ్రమానికి తీసుకెళ్లారని తెలిపింది. అప్పటి నుంచే తనపై లైంగికదాడి జరగడం మొదలైందని, ఎనిమిది నెలలపాటు తనపై ఈ దాడి జరిగిందని వాపోయింది. అంతేకాకుండా ఆ బాబా గురించి షాకింగ్ విషయాలు కూడా బాధితురాలు చెప్పింది. అక్కడి నుంచి తనను ఆగ్రాకు పంపారని అక్కడే తనను ఎనిమిది నెలలు ఉంచి ఈ చర్యలకు పాల్పడి ఎంఎంఎస్‌లు తీసి బెదిరించారని తెలిపింది. బాబా సెక్స్ రాకెట్ కూడా నడిపేవాడని, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు స్కూళ్లల్లో చదువుతున్న అమ్మాయిలను బలవంతంగా బెదిరిస్తూ పంపించేవాడని కూడా వాపోయింది. కాగా, అసలు బాధితురాలు తనకు తెలియదేని, ఆమెను తాను చూడనే లేదని సియా రామ్ దాస్ అన్నారు. ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
నకిలీ బాబా శివకు జ్యుడిషియల్ రిమాండ్
హైదరాబాద్: నకిలీ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాను పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు శివను చంచల్ గూడ జైలుకు తరలించారు. శివ పూజల పేరుతో పలువురిని మాయం చేసి రూ.1.33 కోట్లు దోచుకున్న విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. టాస్క్ ఫోర్స్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అతణ్ని విమానంలో నగరానికి తరలించారు. నకిలీ బాబా, డ్రైవర్ షాజహాన్తో సహా మరో ఇద్దర్ని పోలీసులు ప్రశ్నించి కేసు నమోదు చేశారు. -
నకిలీ బాబాను ప్రశ్నిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
హైదరాబాద్ : పూజల పేరుతో రూ.1.33 కోట్లు మాయం చేసిన బురిడీ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకు వచ్చారు. నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అతగాడిని అర్ధరాత్రి విమానంలో నగరానికి తరలించారు. సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నకిలీ బాబా, డ్రైవర్ షాజహాన్తో సహా మరో ఇద్దర్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం బురిడీ గ్యాంగ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా డబ్బును రెట్టింపు చేస్తానంటూ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంటి నుంచి రూ.1.33 కోట్లు కాజేసిన విషయం తెలిసిందే. డబ్బుతో హైదరాబాద్ నుంచి పరారైన శివ బెంగళూరు చేరుకుని నగర శివార్లలోని తన ఇంట్లో తలదాచుకున్నాడు. డబ్బుతో సహా అక్కడ్నుంచి జారుకోవడానికి సన్నాహాలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ బృందం మెరుపుదాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.