నకిలీ బాబాను ప్రశ్నిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులు | Task Force police begins interrogation of Fake Godman siva | Sakshi
Sakshi News home page

నకిలీ బాబాను ప్రశ్నిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులు

Published Fri, Jun 17 2016 11:12 AM | Last Updated on Tue, Oct 16 2018 8:38 PM

Task Force police begins interrogation of Fake Godman siva

హైదరాబాద్ : పూజల పేరుతో రూ.1.33 కోట్లు మాయం చేసిన బురిడీ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకు వచ్చారు. నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అతగాడిని  అర్ధరాత్రి విమానంలో నగరానికి తరలించారు. సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయంలో నకిలీ బాబా, డ్రైవర్ షాజహాన్తో సహా మరో ఇద్దర్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం బురిడీ గ్యాంగ్ను  మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

కాగా డబ్బును రెట్టింపు చేస్తానంటూ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంటి నుంచి రూ.1.33 కోట్లు కాజేసిన విషయం తెలిసిందే. డబ్బుతో హైదరాబాద్ నుంచి పరారైన శివ బెంగళూరు చేరుకుని నగర శివార్లలోని తన ఇంట్లో తలదాచుకున్నాడు. డబ్బుతో సహా అక్కడ్నుంచి జారుకోవడానికి సన్నాహాలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ బృందం మెరుపుదాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement