యువతిపై వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు విధించిన జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈనెల 25 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఆయనను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తనకు బెయిల్ ఇవ్వాలని మరోసారి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 18న కోర్టు విచారణ జరపనుంది.