
సాక్షి, హైదరాబాద్ : లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు ఈ నెల 12 వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రేడియో జాకీ ఫిర్యాదుతో ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే గజల్ శ్రీనివాస్‌ను రెండు వారాలపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు గజల్ శ్రీనివాస్ తరఫున ఆయన న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. సేవ్ టెంపుల్ పేరుతో అమ్మాయిలను వేధించినట్లు గజల్ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి.