న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు మరోసారి కోర్టు షాకిచ్చింది. ఇప్పటికే వారం రోజులు సీబీఐ కస్టడీలో ఉన్నఆయనకు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు. ఈనెల 20 వరకు ఆయన రిమాండ్‌లోనే ఉండనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత ఆదివారం(ఫిబ్రవరి 26) సిసోడియాను 8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు అనంతరం అరెస్టు చేశారు. ఆ మరునాడే కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీ విధించింది. అనంతరం మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టగా మరో రెండు రోజులు కస్టడీ విధించింది. ఈ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ మరోసారి సిసోడియాను కోర్టులో ప్రవేశపట్టారు.
ఈసారి కస్టడీ కాకుండా జ్యుడీషియల్ రిమాండ్ కోరారు. న్యాయస్థానం ఇందుకు అనుమతి ఇవ్వడంతో సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు. కాగా.. సిసోడియా ఇప్పటికే బెయిల్ కోసం దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 10న దీనిపై విచారణ చేపడతామని న్యాయస్థానం చెప్పింది.
చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో
Comments
Please login to add a commentAdd a comment