ఈ నెల 19వతేదీన జరిగిన హత్యకు సంబంధించి నమోదైన కేసులో నిందితులుగా ఉన్న వారిని కర్నూలు రెండోపట్టణ పోలీసులు శుక్రవారం సాయత్రం అరెస్టు చేశారు.
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: ఈ నెల 19వతేదీన జరిగిన హత్యకు సంబంధించి నమోదైన కేసులో నిందితులుగా ఉన్న వారిని కర్నూలు రెండోపట్టణ పోలీసులు శుక్రవారం సాయత్రం అరెస్టు చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బోయ రాఘవేంద్రను పాత గొడవల కారణంగా కొత్తపేటకు చెందిన ఈడిగ రామకృష్ణ(25), బోయ కిరణ్ అలియాస్ మురళి (25) కత్తితో పొడిచి గాయపరిచారు. గాయపడిన రాఘవేంద్ర హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 22న మరణించాడు.
ఇతని హత్య కేసులో నిందితులైన ఈడిగ రామకృష్ణ, బోయ కిరణ్ కర్నూలు డీఎస్పీ వై.వి.రమణకుమార్ ఆధ్వర్యంలో కర్నూలు రెండవ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె.బాబుప్రసాద్ స్థానిక సంకల్‌బాగ్‌లోని వెంకటేశ్వరస్వామి గుడి వద్ద అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన పిడిబాకులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.