సినీ ఫక్కీలో ఖైదీ పరారైన ఘటన పరప్పన అగ్రహార జైలులో చోటు చేసుకుంది.
బెంగళూరు(బనశంకరి): సినీ ఫక్కీలో ఖైదీ పరారైన ఘటన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు. సంజయనగర కు చెందిన డేవిడ్‌కు ఓ చోరీకేసులో కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో మూడున్నర సంవత్సరాలుగా అతను పరప్పన అగ్రళహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళవారం ఉదయం జైలుకు కూరగాయాలు తీసుకువచ్చిన వాహనంలోకి చొరబడిన డేవిడ్ కూరగాయాల సంచిలో దూరి తప్పించుకున్నాడు.
జైలు అధికారులు పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్లో పరారీ ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖైదీ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ బోరలింగయ్య తెలిపారు.