
ఓ చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగరెట్‌ను గుప్పు గుప్పు మని పీలుస్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఏడాది జూన్ 8,2024 తన ప్రియురాలు పవిత్ర గౌడ అశ్లీల పంపించాడని రేణుకాస్వామి (28) అనే యువకుడిని దారుణంగా హత్య చేసి జైలు శిక్షను అనుభవిస్తున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే ఆ ఫొటో. అభిమాని హత్య కేసులోని ఏ1 దర్శన్‌తో పాటు ఇతర నిందితులు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, దర్శన్ బెయిల్ కోసం ఆయన భార్య ప్రయత్నిస్తున్నారు.
ఈ తరుణంలో దర్శన్ పరప్పన అగ్రహార జైలు గార్డెన్‌లో ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శన్‌తో పాటు రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ,మరో ఖైదీ మేనేజర్ నాగరాజ్ ఉన్నారు.
ఇక ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో క్షణాల్లో వైరలైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో జైల్లో నిబంధనలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న దర్శన్‌కు వీవీఐపీ ట్రీట్మెంట్ అందుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు జైలు గార్డెన్‌లో తోటి నేరస్తులతో కబర్లు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, తాగేందుకు కాఫీ, సిగరెట్‌లు అందించడమేనని అంటున్నారు. మరి ఈ ఫొటోపై పరప్పన జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
ಏನ್ರೀ ಸ್ವಾಮಿ ಜೈಲು
ಇದ್ರೆ ನೆಮ್ಮದಿ ಆಗಿರ್ಬೇಕು 💀💥#DBoss #Darshan pic.twitter.com/eTNmHZqt4j— S R E E | ಶ್ರೀ ✨ (@SreeDharaNEL) August 25, 2024
Comments
Please login to add a commentAdd a comment