కన్నడ నటుడు దర్శన్‌ను బెంగుళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు నేడు (ఆగష్టు 29) తరలించారు. బెంగుళూరు జైలు అధికారులు దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు అందుకు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ అంశంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.
కన్నడ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్‌ను గురువారం ఉదయం బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. బెంగళూరు పోలీసుల ఎస్కార్ట్‌తో సహా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆయనను తీసుకెళ్లారు. బల్లారిల సెంట్రల్ జైలులో కూడా ప్రత్యేకంగా నియమించబడిన హై-సెక్యూరిటీ సెల్‌లో దర్శన్‌ను ఉంచారు. బెంగళూరు పరప్పన అగ్రహార నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసు వాహనం బయలుదేరి ఉదయం 9.45 గంటలకు బళ్లారి సెంట్రల్ జైలుకు చేరుకుంది. నల్లటి టీషర్ట్ ధరించి కనిపించిన దర్శన్.. కుడి చేతికి బ్యాండేజీతో ఉన్నాడు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎంట్రీ బుక్‌పై సంతకం చేసిన తర్వాత జైలు వైద్యులు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, ఆపై హై-సెక్యూరిటీ సెల్‌కు పంపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మీదుగా వెళ్లిన దర్శన్ వాహనానికి స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, జైలు సూపరింటెండెంట్ లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, దర్శన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఆయన అభిమానులను జైలు దగ్గరకు వెళ్లకుండా అన్నీ మార్గాలను బారికేడ్‌లతో మూసేశారు.
దర్శన్‌పై మరో రెండు కేసులు
దర్శన్‌కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్‌లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment