చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి ప్రముఖ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడతో పాటు 17 మంది నిందితులపై పోలీసులు 4,500 పేజీల చార్జిషీట్ దాఖలుకు సిద్ధమయ్యారు. కేసు నమోదు అయ్యి మూడు నెలలు అయినా ఇప్పటికీ పూర్తి నివేదికను పోలీసులు సమర్పించలేదు. తాజాగా అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేసిన పోలీసులు ఇక చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. 200కు పైగా సాక్ష్యాధారాలతో వారు కోర్టు ముందుకు వెళ్లనున్నారు.
సినీ నటుడు దర్శన్ వినతి మేరకు జైలు శాఖ సర్జికల్ టాయిలెట్ కుర్చీని అందజేశారు. వెన్నుముక సమస్యతో దర్శన్ బాధపడుతున్నట్లు ఆయన సతీమణి విజయలక్ష్మీ, న్యాయవాదితో జైలు అధికారులను ఆశ్రయించారు. ఆ సమయంలో దర్శన్ మెడికల్ రిపోర్ట్‌లను అందించారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో సర్జికల్ కుర్చీని జైలులో ఉన్న దర్శన్‌కు అందించారు. ఆపై వెన్నెముక సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను దర్శన్‌కు వైద్యులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment