దర్శన్‌కు మళ్లీ నిరాశే.. రిమాండ్‌ పొడిగింపు | Darshan Judicial Custody Extension | Sakshi

దర్శన్‌కు మళ్లీ నిరాశే.. రిమాండ్‌ పొడిగింపు

Aug 2 2024 3:12 PM | Updated on Aug 2 2024 4:01 PM

Darshan Judicial Custody Extension

రేణుకాస్వామి హత్య కేసులో గత రెండు నెలలుగా పరప్పన జైలులో  హీరో దర్శన్‌ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్‌ కోసం దర్శన్‌ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. కనీసం ఇంటి భోజనానికి అనుమతి కోరినా కోర్టు అడ్డు చెప్పింది. దీంతో ఆయన తిండి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే, తాజాగా వారిద్దరికి కోర్టు షాకిచ్చింది.

రేణుకాస్వామిని హత్య చేశారని హీరో దర్శన్‌, నటి పవిత్రగౌడ, అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే, వారిద్దరూ ఇప్పట్లో విడుదల అయ్యే  భాగ్యం కనిపించడం లేదు.  రేణుకాస్వామి హత్య కేసులో తాజాగా దర్శన్‌, పవిత్రగౌడ సహా నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు . పరప్పన జైలు నుంచి 13 మంది, తుమకూరు జైలు నుండి నలుగురు నిందితులను హాజరు పరిచారు. వారి రిమాండును పొడిగించాలని సిట్‌ లాయరు కోరారు. దీంతో ఆగస్టు 14 వరకూ పొడిగించారు. దీంతో బెయిల్‌ మీదు ఆశలు పెట్టుకున్న దర్శన్‌కు నిరాశే మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement