కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. వారిద్దరితో పాటు మరో 15 మంది పాత్ర కూడా ఉన్నట్లు 3,991 పేజీలతో చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నిందితుల జ్యుడీషియల్ కస్టడీ గడువు సెప్టెంబర్ 9న సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నటుడు దర్శన్ సహా నిందితులంతా రేపు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్నారు. ఇతర నిందితులను మైసూరు, తుమకూరు, షిమోగా, ధార్వాడ్, బెల్గాం, విజయపుర, కలబురగి జైలుకు తరలించారు. నిందితుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుండడంతో నిందితులను తమ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.
పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ మొత్తం 17 మంది నిందితులకు అందజేయనున్నారు. చార్జిషీటు అందిన తర్వాత చాలా మంది నిందితులు రేపు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును సమర్పించినందున ప్రధాన నిందితులైన దర్శన్, పవిత్రగౌడ్ సహా సోమవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment