కన్నడ టాప్ హీరో దర్శన్, ప్రస్తుతం హత్య కేసులో చిక్కుకుని పోలీసుల విచారణలో ఉన్నాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్య మెసేజ్‌లు పెడుతున్నాడని అనుచరుల సాయంతో అతన్ని హత్య చేపించాడని తెలుస్తోంది.
1997లో మహాభారత అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత 2000 సంవత్సరంలో రెండు చిత్రాలు విడుదల చేసి హీరోగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో 100కు పైగా చిత్రాల్లో మెప్పించిన దర్శన్ తూగుదీప ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. దినకర్ అనే తన తమ్ముడు ఈ ప్రొడక్షన్స్ బాధ్యతలు నిర్వహించేవాడు.
అయితే, దర్శన్ వద్ద 2018 నుంచి మేనేజర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్ అనే వ్యక్తి గత ఏడేళ్లుగా కనిపించడం లేదు. ఏడేళ్ల క్రితం దర్శన్ పేరు చెప్పి కన్నడ సినీ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మల్లికార్జున్‌పై ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ బరహ అనే సినిమా పంపిణీ బాధ్యత తూగుదీప ప్రొడక్షన్‌కి అప్పగించగా ఆ పనులు మొత్తం మల్లికార్జున్ చూసుకున్నాడు. సినిమా హక్కులు విక్రయించి వచ్చిన డబ్బుతో మల్లికార్జున్ పరారయ్యాడు. ఆనాటి నుంచి దర్శన్ చేతికి కూడా దొరకలేదని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఆయనపై దర్శన్ ఎలాంటి కేసు పెట్టలేదని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వివాదం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment