సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పారు..?
సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పారు..?
Published Tue, Feb 14 2017 2:13 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జీవించి ఉన్న ముగ్గురు నిందితులు దోషులేనంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 570 పేజీలతో కూడిన సుదీర్ఘ తీర్పును సుప్రీం వెల్లడించింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి...
''కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నాం. ఎ2 నుంచి ఎ4 వరకు ఉన్న ముగ్గురు నిందితులపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలుచేయాలని ఆదేశిస్తున్నాం. ఎ1తో ఎ2 నుంచి ఎ4 వరకు సంబంధాలు ఉన్నప్పటికీ, ఎ1 నిందితురాలు మరణించినందువల్ల ఆమెకు సంబంధించిన విషయాలను తీసేవేయాల్సి వస్తోంది. ఎ2 నుంచి ఎ4 వరకు ఉన్న నిందితులపై అభియోగాలు రుజువయ్యాయి. వారికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను పునరుద్ధరించాలి. దాని పరిణామాలను కూడా వారు అనుభవించాలి. ఆ ముగ్గురూ ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలి. ఎ2 నుంచి ఎ4 వరకు గల దోషులు వారికి మిగిలి ఉన్న శిక్షాకాలాన్ని పూర్తిచేసుకోవాలి, ఈ తీర్పులో చెప్పిన మిగిలిన అంశాలను కూడా చట్టానికి అనుగుణంగా పాటించాలి'' అని తీర్పు తుదిపాఠంలో పేర్కొన్నారు.
Advertisement